» »శివుడు తలక్రిందులుగా దర్శనమిచ్చే శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

శివుడు తలక్రిందులుగా దర్శనమిచ్చే శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

By: Venkata Karunasri Nalluru

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు. శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నవారిగా భావిస్తారు. ఇప్పుడు అటువంటి శివుని విగ్రహాన్నే దర్శించుకోబోతున్నాం. ఇక్కడ శివుడు విగ్రహరూపంలోనే కాదు తలక్రిందులుగా తపస్సు చేస్తూ భక్తులచేత పూజించబడుతున్నారు. ఇదెక్కడుందో ? అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం రండి ...!

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

శివుడు తలక్రిందులుగా దర్శనమిచ్చే శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

1. విలక్షణమైన శివలింగం

1. విలక్షణమైన శివలింగం

యనమదుర్రు గ్రామంలో గల దేవాలయం - శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం. దీనిని తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం పురాతనమైనది మరియు అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగి ఉంటుంది.

చిత్రకృప : Sesha Sai Kumar

2. స్థలపురాణం

2. స్థలపురాణం

యమధర్మరాజు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆయన జీవులను, కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకెళుతుంటాడు. ఒకానొక దశలో యముడు ఈ పనిపై విరక్తి చెంది, శివుడికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు.

చిత్రకృప : Venkata Viswanath Maddipatla

3. శివుని వరం

3. శివుని వరం

ప్రత్యక్షమైన శివుడు ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు లయకారులన్న భయం పోయి ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇస్తాడు. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని, గుడిలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణంలో పేర్కొనబడింది.

చిత్రకృప : Venkata Viswanath Maddipatla

4. విశిష్టత

4. విశిష్టత

యనమదుర్రు గ్రామంలో ఉన్న శక్తీశ్వరాలయం విశిష్టమైనది. శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతీదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారు మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు కొలువై ఉండడమూ విశేషమే.

చిత్రకృప :Venkata Viswanath Maddipatla

5. యమధర్మ రాజు తపస్సు

5. యమధర్మ రాజు తపస్సు

శివుడు తలక్రిందులుగా దర్శనం ఇవ్వటానికి ప్రధాన కారణం ... యమధర్మ రాజు తపస్సు. ఆ సమయంలో శివుడు తలక్రిందులుగా తపస్సుచేస్తూ .. పార్వతీదేవి బాల కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉన్నారు. యముడు ఉన్నపళంగా లోకకల్యాణం కోసం ప్రత్యక్షం కావాలని వేడుకుంటాడు. యముడి కోరికను మన్నించి శివుడు, పార్వతీ యదా స్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానిక కధనం.

భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఎక్కడుందో తెలుసా ?

చిత్రకృప :wikimedia.org

6.100 సం నాటి దేవాలయం

6.100 సం నాటి దేవాలయం

వంద సంవత్సరాల కిందట ఈ దేవాలయం ఒక తవ్వకాలలో బయటపడింది. ఇది త్రేతాయుగం నాటిదని చెబుతారు. ఈ తవ్వకాలలో శివుని విగ్రహం, 3 నెలల బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి.

చిత్రకృప :Arian Zwegers

7. యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి

7. యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి

వాయు మార్గం : ఆలయానికి చేరువలో 90 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి దేశీయ విమానాశ్రయం ఉన్నది. ఇక్కడికి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి యనమదుర్రు చేరుకోవచ్చు.

హారతి సమయంలో కళ్ళు తెరిచే దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

చిత్రకృప :Trixi Skywalker

8. రైలు మార్గం

8. రైలు మార్గం

ఆలయానికి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో భీమవరం రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై, కొలకత్తా తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.

చిత్రకృప :Teves Costa

9. రోడ్డు మార్గం

9. రోడ్డు మార్గం

4 కి.మీ ల దూరంలో ఉన్న భీమవరం సమీప బస్ స్టాండ్. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సులు వస్తుంటాయి.

చిత్రకృప :BYD ebus in Bonn, Germany

Please Wait while comments are loading...