Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !!

శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం !!

మథురకు సమీపంలో ఉన్న గోవర్ధనగిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధనగిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని నమ్ముతారు. అంతేకాక ఈ ప్రదేశముతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఒకసారి కుండపోత వర్షాలు పడుతున్న సమయంలో కృష్ణుడు పర్వతంను ఎత్తి వరుసగా ఏడు రోజుల పాటు తన చేతులతో పట్టుకోవడం ద్వారా ప్రజలను కాపాడెను.

నేటి ఫ్రీ కూపన్లు : అన్ని థామస్ కుక్ ప్రయాణ కూపన్లను సాధించండి

గోవర్ధనగిరి హిందువులకు ప్రధాన యాత్రా ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. అంతే కాకుండా గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకము. ఇక్కడ ఉన్న దేవుని యొక్క ఒక భారీ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఇక్కడున్న కొన్ని ముఖ్య ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఒకసారి తనివితీరా చూసినట్లయితే ...

గోవర్ధనగిరి కొండ

గోవర్ధనగిరి కొండ

గోవర్ధన ఘట్టం మహాభాగవత౦ లోని శ్రీకృష్ణలీలావినోదాలలో ఒకటిగా కనిపించిన తరచి చూచిన ఒక చక్కని విశేషం మనకు గోచరిస్తుంది. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసంనకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధనగిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు. కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు. ఈ విషయం గమనించిన ఇంద్రుడు మహోగ్రంతో యాదవులను శిక్షించ పూనుకుంటాడు. ప్రళయకాల గర్జన్లతో మెరుపులతో కారు మబ్బులతో ధారపాతమైన వర్షం ను గోకులం పైన ఎడతెరిపి లేకుండా కురిపిస్తాడు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి నెల కొన్నది. దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటంతో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.

Photo Courtesy: Atarax42

హర దేవజీ ఆలయం

హర దేవజీ ఆలయం

కొన్ని గ్రంథాల ప్రకారం, రాధా రాణి, గోపికలతో కలసి ఒకసారి మన్సి గంగా బ్యాంకు వద్ద వారి ప్రియమైన కృష్ణను కలవడానికి నిలబడేను. కానీ సుదీర్ఘ కాలం పాటు కృష్ణుడు రాకపోవుట వలన వారు తమ దేవుడైన కృష్ణుడుని అర్థించడానికి హరిదేవ అనే పేరు పఠించడం ప్రారంభించారు. అప్పుడు వారి ప్రేమకు చలించి కృష్ణుడు తన ఎడమ చేతిలో గోవర్ధన కొండ మరియు కుడి చేతిలో వేణువుతో ఆహ్లాదకరమైన చక్కని ఏడు సంవత్సరాల బాలుడు రూపంలో వారికి దర్శనమిచ్చెను. ఈ దివ్య సంజ్ఞ ద్వారా తృప్తిపొందిన రాధా రాణి మరియు గోపికలతో గర్వంగా ఈ ప్రదేశమునకు ప్రతి రోజు వచ్చి భక్తి పాటలు పాడటం ప్రారంభించారు. వాస్తవంగా హరదేవ ఆలయంను కృష్ణ మనవడు నిర్మించారని ఒక నమ్మకం. భక్తులు మన్సి గంగలో స్నానం చేసి లార్డ్ హరిదేవ యొక్క దర్శనం చేసుకుని దీవెనలు కోరుకుంటారు. ఆలయంలోనికి ప్రవేశించటానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి.

Photo Courtesy: sowrav

కుసుమ్ సరోవర్

కుసుమ్ సరోవర్

కుసుం సరోవర్ గోవర్ధన గిరిలో ఒక ప్రముఖ పవిత్రమైన ట్యాంక్. దీనికి ఆ పేరు ట్యాంక్ చుట్టూ విస్తారంగా పెరిగిన కుసుమ పువ్వుల నుండి వచ్చింది. గోపికలు ఈ ప్రదేశం నుంచి పువ్వులను కోసి వారి ప్రియమైన కృష్ణుడు కోసం నిరీక్షిస్తూ ఉంటారు. కుసుమ్ సరోవర్ 450 అడుగుల పొడవు మరియు 60 అడుగుల లోతు కలిగి ఉంటుంది. కృష్ణుడుకి కదంబ చెట్లు ఇష్టమైన చెట్టు కనుక చెరువు కట్ట అంతటా చెట్లను దట్టంగా ఉండేలా అభివృద్ధి చేసారు. ట్యాంక్ దగ్గరగా అనేక చిన్న ఆలయాలు మరియు ఆశ్రమములు ఉన్నాయి. ఈ ప్రాంతంనకు సాయంత్రంపూట భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. వారు ప్రశాంతమైన పరిసరాల నడుమ ప్రార్ధనలు చేస్తారు.

Photo Courtesy: Cold.peak

మన్సి గంగా ట్యాంక్

మన్సి గంగా ట్యాంక్

'మన్సి' అనే పదమునకు మనసు అని అర్దము. ఒక పురాణం ప్రకారం, కృష్ణ సంరక్షక తల్లిదండ్రులు అయిన నంద మరియు యశోదలు గంగా పవిత్ర స్నానం చేయాలనీ కోరుకున్నారు. కానీ గంగ చాలా దూరంగా ఉండుట వల్ల బృందావనంను వదిలి అక్కడకు వెళ్ళడం నంద, యశోదలకు ఇష్టం లేదు. కృష్ణుడు వారి కోరిక గురించి విని తన మనస్సు యొక్క శక్తితో గోవర్ధన గిరికి గంగాను తీసుకువచ్చెను. అందుకే ఈ ట్యాంక్ కు మన్సి గంగా అని పేరు వచ్చెను. ఈ పవిత్రమైన మన్సి గంగా లో స్నానం చేస్తే శ్రీ కృష్ణుడి ప్రేమ రూపంలో మిలియన్ రెట్లు ఎక్కువ ఆధ్యాత్మిక యోగ్యతా వస్తుందని నమ్మకం.

Photo Courtesy: gopal

రాధా కుండ్

రాధా కుండ్

పురాణముల ప్రకారం, కృష్ణ భగవానుడు ఒక ఎద్దు రూపంలో కనిపించే ఒక పెద్ద దెయ్యంను గోహత్య చేసిన తర్వాత అతని భార్య రాధ పవిత్రమైన అనేక నదులలో స్నానం ద్వారా పాపాలను పోతాయని చెప్పెను. భార్య అభ్యర్ధనను విన్న కృష్ణుడు అతను నిలబడిన స్థానం లోనే తన అడుగు ముద్ర వేసి ఒక నీటి కుండ్ ను ఏర్పాటు చేసెను. అందులో రాధా ద్వారా పేర్కొనబడిన అన్ని నదులు కనిపించినాయి. అందులో స్నానం చేసెను. ఇది శ్యామ్ కుండ్ అని ప్రాచుర్యంలోకి వచ్చింది. గోవర్ధన నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎంతో గౌరవించే ఈ కుండ్ లో ముఖ్యంగా వార్షిక కార్యక్రమం జరుపుకుంటారు. అక్టోబర్ మరియు నవంబర్ మాసాలలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ప్రజలు ఈ కుండ్ లో ఒక పవిత్ర స్నానం ఆచరించి వారి పాపాలు తొలగించుకొంటారు.

Photo Courtesy: Caspian Rehbinder

గోవర్ధనగిరికి ఎలా చేరుకోవాలి ??

గోవర్ధనగిరికి ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

గోవర్ధనగిరిలో విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయం 30 కిమీ దూరంలో ఉన్న వారణాసి లో ఉన్నది. అక్కడ నుంచి టాక్సీని లేదా ప్రైవేట్ / ప్రజా రవాణా బస్సు ద్వారా గోవర్ధన చేరుకోవచ్చు.

రైలు మార్గం

గోవర్ధనగిరి నుండి 26 కిలోమీటర్ల దూరంలో సమీప రైల్వే స్టేషన్ మథురలో ఉంది. ఇక్కడ నుండి ప్రభుత్వ రవాణా బస్సు లేదా ఒక టాక్సీని అద్దెకు తీసుకోని గోవర్ధన గిరిని చేరుకోవచ్చు.


రోడ్డు ప్రయాణం

మథుర నుండి గోవర్ధనగిరి కి బస్సులు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. అంతే కాకుండా ప్రైవేట్ వాహనాలతో పాటుగా ఆటోలు కూడా తిరుగుతుంటాయి.

Photo Courtesy: NVD Parikrama

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X