Search
  • Follow NativePlanet
Share
» »మహిమాన్విత దేవాలయాలు - హైదరాబాద్ !

మహిమాన్విత దేవాలయాలు - హైదరాబాద్ !

భారత దేశం లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం హైదరాబాద్ నగరం ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని. ఈ నగర వారసత్వం, సంస్కృతి నిజాముల పాలన నుండి అవగాతమవుతోంది. హైదరాబాద్ నగరం పురాతన అందాలు మరియు ఆధునికతలు సంతరించుకొన్న నగరం. ఇక్కడ అనేక అందమైన కోతలు, పార్క్ లు, మ్యూజియం లు, టెంపుల్స్ కలవు. హైదరాబాద్ నగరం ఖ్యాతి గాంచిన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి. ఈ నగరం లో పర్యాటకులకు, యాత్రికులకు దర్సించేందుకు అనేక దేవాలయాలు కలవు. వాటిలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను పరిశీలిద్దాం.

బిర్లా మందిర్
అందమైన బిర్లా మందిర్ హైదరాబాద్ సెక్రటేరియట్ మరియు రవీంద్ర భారతి లకు సమీపంలో కలదు. ప్రసిద్ధి చెందిన ఈ బిర్లా మందిర్ ను భారత దేశపు ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త బిర్లా కుటుంబం నిర్మించింది. దీనిని నగర నడిబొడ్డున ఒక చిన్న కొండపై 1976 లో నిర్మించారు.

ఒక కొండపై నుండి సందర్శకులకు మంచి సుందర దృశ్యాలను చూపే ఈ బిర్లా మందిర్ ను తెల్లటి పాల రాతి తో నిర్మించారు. దీని గోడలపై రామాయణ, మహాభారత కావ్యాలనుండి కొన్ని చిత్రాలను కూడా ఏర్పరిచారు. టెంపుల్ లోని శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం కొంచెం అటూ ఇటూ గా తిరుపతి లోని విగ్రహాన్ని పోలి వుంటుంది. విగ్రహం నల్లటి గ్రానైట్ రాతి తో చేయబడి 11 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది.

బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్
బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ హైదరాబాద్ లోని బలకంపేట్ పొలిమేరలలో కలదు. ఈ టెంపుల్ సుమారు 15 వ శతాబ్దం నాటిది గా చెపుతారు. ఈ దేవత ఎల్లమ్మ సాక్షాత్తూ మాత పార్వతి అవతారంగా చెపుతారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఎల్లమ్మ కల్యాణం ప్రసిద్ధి. దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ ఘనంగా సాగుతాయి. ఈ ఎల్లమ్మ టెంపుల్ కాంప్లెక్స్ లో గణేశ, మాత పోచమ్మ, ఇంకనూ ఇతర దేవుళ్ళ గుడులు కూడా కలవు.

చిల్కూర్ బాలాజీ టెంపుల్
చిల్కూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్ నగరం లోని మోఇనాబాద్ మండలంలో కలదు. ఈ టెంపుల్ దేముడు శ్రీ వేంకటేశ్వరుడు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు, చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళే విద్యార్ధులు తమ వీసాలు లు తేలికగా రావాలని కోరుకుంటూ ఇక్కడకు తరచుగా రావటంతో చాలా మంది ఈయనను ' వీసాల బాలాజీ' అని కూడా అంటారు.

మహిమాన్విత దేవాలయాలు - హైదరాబాద్ !

ఇక్కడకు వచ్చే భక్తులు వారి కోరిక ఏదైనప్పటికీ, ముందుగా తొమ్మిది ప్రదిక్షణలు చేసి వారు తమ కోరిక కోరుకుంటారు. అది తీరిన వెంటనే, నూట ఎనిమిది ప్రదిక్షణలు మొక్కుబడి గా చెల్లిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తుల నుండి ఎత్తి దక్షిణలు, లేదా విరాళాలూ స్వీకరించక పోవటం ఈ టెంపుల్ ప్రత్యేకత. ఈ టెంపుల్ యాజమాన్యం 'వాక్' అనబడే ఒక మాస పత్రిక ను ప్రచురించి భక్తులకు అతి తక్కువ ధరలో విక్ర ఇస్తుంది. దీనిపై వచ్చే ఆదాయాన్ని యాజమాన్యం టెంపుల్ అభివృద్ధి, నిర్వహణలకు వినియోగిస్తుంది.

కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్
కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ సుమారు 900 సంవత్సరాల క్రిందటిది గా చెపుతారు. ఈ టెంపుల్ ను కాకతీయ రాజ వంశానికి చెందిన 11 వ శతాబ్దపు రాజు రెండవ ప్రతాప్ రుద్రుడు నిర్మించాడు. హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో కల ఈ హనుమాన్ టెంపుల్ ఆంజనేయుడి కి ఇష్టమైన మంగళ వారం మరియు శని వారం లలో భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ రెండు రోజుల్లోనూ ఇక్కడ భక్తులకు అన్నదానం కూడా జరుగుతుంది. హనుమత్ జయంతి వంటి వివిధ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలను తప్పక తీరుస్తాడని ఇక్కడకు వచ్చే భక్తులు విశ్వసిస్తారు.

ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ఇంకా నూ శ్రీరాముడు, విజ్ఞేశ్వర, నాగేశ్వర, బ్రహ్మరాంబ సమేత స్పటిక లింగేశ్వర, దుర్గ మాత, సరస్వతి మాత, జగన్నాథ వేణుగోపాల స్వామి, నవగ్రహ గుడులు కూడా కలవు.

శ్యాం టెంపుల్
శ్యాం దేవ్ టెంపుల్ హైదరాబాద్ లోని కాచిగూడా రైల్వే స్టేషన్ ఎదురుగా కలదు. ఇక్కడి దేముడు, శ్రీ కృష్ణుడి అవతారమైన బార్బారికా. ఈ టెంపుల్ కు సంవత్సరం పొడవునా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

మహిమాన్విత దేవాలయాలు - హైదరాబాద్ !

ప్రత్యేకించి హిందూ కేలండర్ మేరకు శుక్ల పక్షం లోని 11 మరియు 12 వ రోజుల లో భక్తులు విశేష సంఖ్యలో వచ్చి దేముడిని దర్శించు కొంటారు. ఈ రోజులలో దేవాలయం రాత్రి వేల అంతా తెరచి వుంటుంది. భక్తులు భజనలు, పాటలు పాడి ఆనందిస్తారు.

Read more about: hyderabad andhra pradesh temples
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X