Search
  • Follow NativePlanet
Share
» »మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !

మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !

By Mohammad

శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి గా, 'వికటకవి' గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడనటువంటి వర్ణనలు, పదాలు వాడారు.

పాండురంగ మహాత్మ్యము చదివితే, దుర్వాసనాలకు గురైన వ్యక్తిని పాండురంగడు ఏవిధంగా తప్పించాడో మనకు బోధపడుతుంది. అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మనిపించే దేవుడు.

రాయదుర్గం రైల్వే స్టేషన్

రాయదుర్గం రైల్వే స్టేషన్

చిత్ర కృప : indiarailinfo

ఎలా చేరుకోవాలి ?

ముందుగా అనంతపురానికి చేరుకోవాలి. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు, రైళ్లు కలవు. అనంతపురం నుండి 100 కిలోమీటర్ల దూరంలో గల రాయదుర్గం వరకు బస్సులో చేరుకొని, అక్కడి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చేరుకోవాలి.

రాయదుర్గ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్ (ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకళ్ దేవాలయానికి వెళ్ళవచ్చు.

ఉంటకళ్ పాండురంగ స్వామి దేవాలయం

ఉంతకల్లు లో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు.

సందర్శించు సమయం : ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పాండురంగ స్వామి దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు.

ఉంతకల్లు పాండురంగ స్వామి ఆలయం

ఉంతకల్లు పాండురంగ స్వామి ఆలయం

చిత్ర కృప : Sivakumar Gudekota

సాధారణంగా గ్రామంలో నివసించే వారు ఒక్కో దేవుణ్ణి పూజిస్తుంటారు. కానీ ఈ గ్రామం డిఫెరెంట్. అందరూ పాడురంగ భక్తులే. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రమైన 'పండరీపురం' వెళ్లివచ్చేవారు. ఆతర్వాత ఇక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పాండురంగ స్వామి దేవాలయం గా పేరుపెట్టుకున్నారు.

మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళి జన్మలో దాని జోలికి పొరనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాల ధరించిన ఏ ఒక్కరూ మళ్ళి ఇప్పటివరకు మద్యం జోలికి వెళ్లలేదని దాఖలాలు ఉన్నాయి అని స్థానికులు చెబుతారు.

పూజలు అందుకుంటున్న పాండురంగ స్వామి

పూజలు అందుకుంటున్న పాండురంగ స్వామి

చిత్ర కృప : Sivakumar Gudekota

'మాల' ఎప్పుడు ధరించాలి?

'పాండురంగ మాల' ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజుపడితే ఆరోజు వేసుకోకూడదు. మాలాధారణ నిర్వహణ నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే 'శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి' రోజుల్లోనే మాల ధరించాలి. ఆ రోజులలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతుంటారు.

పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందుగా 100 రూపాయల ధర చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ముందురోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాల ధరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకోవాలి. గుడి ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిల్చోవాలి. ఇలా నిల్చున్న భక్తులకు ఆలయ ప్రధాన పూజారి వచ్చి మెడ లో ఒక్కోటిగా మాల వేస్తారు.

రాయదుర్గం కోటలోని ఆలయం

రాయదుర్గం కోటలోని ఆలయం

చిత్ర కృప : Vamsi Krishna Lankipalli

ఆరోజున ఎంత ముందైతే భక్తులు వస్తారో, అంతమందికి ఉచిత భోజనాన్ని గ్రామస్తులే వండి, వడ్డిస్తారు. టోకెన్ కు 100 రూపాయలు తప్పనిచ్చి ఇంకా దేనికీ డబ్బులు తీసుకోరు. మాలధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశ రోజులలో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. కావాలనుంటే ఆ మూడు ఏకాదశ రోజులు అయిపోయినాక మాల తీసేయవచ్చు.

రాయదుర్గంలో సందర్శించు స్థలాలు

పాండురంగ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం, మీకు సమయముంటే రాయదుర్గం లో గల కోట, అందులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడవచ్చు. రాయదుర్గం లో బస చేయటానికి లాడ్జీ లు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X