Search
  • Follow NativePlanet
Share
» »చిలుకూరు బాలాజీ ఆల‌యానికి వెళితే.. తిరుప‌తి వెళ్లిన‌ట్లే!

చిలుకూరు బాలాజీ ఆల‌యానికి వెళితే.. తిరుప‌తి వెళ్లిన‌ట్లే!

చిలుకూరు బాలాజీ ఆల‌యానికి వెళితే.. తిరుప‌తి వెళ్లిన‌ట్లే!

హైదరాబాద్ న‌గ‌రం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలుకూరు సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షించే సుందరమైన గ్రామం. ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయం నిర్మించబడింది. ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున, వికారాబాద్ రహదారికి సమీపంలో ద‌ర్శ‌న‌మిచ్చే ఈ ఆలయం దేశ నలుమూలల నుండి వ‌చ్చే భక్తులను ఆకర్షిస్తోంది.

చిలుకూరు బాలాజీ దేవాలయం ఆహ్లాదకరమైన శిల్పకళకు పేరుపొందింది. ఇది తెలంగాణలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. అబ్బుర ప‌ర‌చే ఆల‌య నిర్మాణ‌శైలి చూప‌రుల మ‌న‌సు దోచేస్తుంది. ఆలయాన్ని అర సహస్రాబ్దికి పైగా నిర్మించారని చెబుతారు. దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం తిరుమల ఆలయానికి ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందింది. ఆలయ ప్రధాన దైవంగా బాలాజీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీదేవి మరియు భూదేవిలు ద‌ర్శ‌నమిస్తారు.

ఆలయ నిర్మాణం వెనుక ఒక చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని ఒక నిర్మించాడట‌. అతను అనారోగ్య సమస్యలతో తిరుపతి ఆలయాన్ని సందర్శించలేకపోయాడు. అతని భక్తికి మెచ్చిన వేంకటేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై, శ్రీదేవి మరియు భూదేవితో కలిసి స్వామివారి విగ్రహాన్ని ప్ర‌తిష్టించి, ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. అలా నిర్మించ‌బ‌డిన ఈ ఆల‌యం అప్పటి నుండి చిలుకూరు బాలాజీ దేవాల‌యంగా గుర్తింపు పొందింది. తిరుపతి ఆలయానికి వెళ్లలేని వారు తరచూ ఇక్కడికి వస్తుంటారు.

chilkurbalajitemple

వీసా బాలాజీ దేవాలయంగా..

అంతేకాదు, ఈ ఆలయాన్ని "వీసా బాలాజీ దేవాలయం" అని కూడా పిలుస్తారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా పొందాలనే వారి కోరిక ఈ ఆల‌యం సంద‌ర్శ‌ర‌న ద్వారా నెర‌వేరుతుంద‌ని చాలామంది విశ్వ‌సిస్తారు. అలా వీసా బాలాజీ దేవాల‌యంగా కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని హుండీ లేదా విరాళాల పెట్టె లేకుండా ఉన్న అతి తక్కువ దేవాలయాలలో ఒకటిగా కూడా చిలుకూరి బాలాజీ దేవాల‌యం పేరుగాంచింది.

సాధారణంగా ఇక్క‌డికి న‌మ్మ‌కంతో వ‌చ్చే సంద‌ర్శ‌కులు 11 ప్రదక్షిణలు చేసి, దైవాన్ని ఆరాదిస్తూ తార‌స‌ప‌డ‌తారు. అలా కోరిక నెరవేరిన తర్వాత, వారు తమ కృతజ్ఞతను తెలియ‌జేస్తూ.. ఆలయ ప్రాంగ‌ణంలో 108 ప్రదక్షిణలు చేసి, త‌మ కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేస్తూ ఉంటారు.

chilkurbalajitemple

ఏడాది పొడవునా భక్తులు..

ఆల‌యంలో నిత్యం మంత్రాల పఠనం మరియు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూనే ఉంటాయి. ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాలు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ప్ర‌శాంత‌త‌ను చేరువ చేస్తాయి. చిలుకూరి బాలాజీ ఆలయాన్ని ప్రతి వారం 75,000 నుండి లక్ష మంది భక్తులు సందర్శిస్తారని అంచనా. ఏడాది పొడవునా భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నప్పటికీ, ఆనకోట, బ్రహ్మోత్సవాలు మరియు పూలంగి సందర్భంగా సందర్శకుల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుంది.

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని అనేక మంది గొప్ప ఆధ్యాత్మిక మరియు మత గురువులు కూడా సందర్శిస్తారు. అలాంటివారిలో కొంద‌రిని ప్ర‌స్థావిస్తే.. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని శ్రీ అహోబిల మఠానికి చెందిన జీర్, శ్రీ వల్లభాచార్య సంప్రదాయానికి చెందిన తిలకయత్‌లు తరచుగా సందర్శిస్తారు. శృంగేరి మఠానికి చెందిన జగద్గురు శ్రీ శంకరాచార్యులు ఇలా చాలామంది గురువులు ఆల‌య సంద‌ర్శ‌నకు వ‌స్తుంటారు.

చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు తరువాత సాయంత్రం 4 నుండి 6 వరకు ఉంటుంది. ఇది వారం అంతా తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఆలయం వెలుపల చాలా చిన్న చిన్న హోట‌ళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. విడిది కోసం అయితే, ఆలయానికి చాలా సమీపంలో ఉన్న తెలంగాణ టూరిజంకు చెందిన‌ హరిత హోటల్‌కి వెళ్లవచ్చు.

Read more about: chilukur balaji temple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X