» »అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

Posted By: Venkata Karunasri Nalluru

పరుశురామక్షేత్రాలలో ఆఖరిది గోకర్ణ. గోకర్ణ స్థలపురాణం రామాయణం కాలం నాటిది. శివుణ్ణి ప్రార్థించి ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళుతుండగా బాల బ్రాహ్మణ వేషంలో వచ్చిన గణపతి ఆత్మ లింగాన్ని కిందపెడతాడు అదే పురాణగాథ. ఇక్కడ స్వామివారు మహాబలేశ్వర స్వామిగా కొలువై పూజలందుకుంటున్నాడు.

చిదంబర రహస్యం

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు దగ్గర్లో ఉన్న కోటితీర్థం రేవులో స్నానం చేసి శివాలయానికి వెనుకభాగంలో ఉన్న వినాయకుని తొలుత దర్శించుకుంటారు. అటు తర్వాతే శివుని దర్శించుకుని ఆయనకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

PC :gokarna official website

క్షేత్రంలోని ప్రత్యేకతలు

ఈ క్షేత్రంలో ప్రతి అరవై ఏళ్లకోసారి శివలింగానికి చుట్టూ ఉన్న రాళ్లను తొలగించి పూర్తి లింగానికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ క్షేత్రానికి ఉన్న మరో విశేషం ఈ ఆలయంలోకి విదేశీయులకు ప్రవేశం నిషిద్ధం.

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

PC :gokarna official website

ఈ ఆలయానికి దగ్గర్లోనే ఉన్న అరేబియా సముద్రం ప్రకృతి అందాలకు నిలయంగా ఉంటుంది. ఇక్కడున్న నాలుగు బీచ్‌లు పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని సొంతం చేస్తాయి. వీటిలో ఓం అనే బీచ్ చాలా ముఖ్యమైంది. పైనుంచి చూస్తే ఓంకారం ఆకారంలో కన్పించడం ఈ బీచ్ ప్రత్యేకత.

ఈ బీచ్‌లో కొంతభాగం సముద్రంలోకి చొచ్చుకుపోయి ఉంటుంది. గోవాకు సమీపంలో ఈ గోకర్ణం ఉండడం వల్ల అనేకమంది విదేశీ పర్యాటకులు ఈ బీచ్‌లను సందర్శిస్తుంటారు.

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

PC :gokarna official website

వసతి, సౌకర్యాలు

గోకర్ణంలో వసతి, సౌకర్యాలు కాస్త ఖరీదైనవనే చెప్పవచ్చు. చిన్న చిన్న లాడ్జీలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. వీటితోపాటు ఇక్కడ సముద్ర తీరప్రాంతంలో కట్టబడిన స్వస్వరా రిసార్ట్ అనేది ముఖ్యమైంది. ఇక్కడ అన్ని సౌకర్యాలతో పాటు యోగా, ధ్యానం లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

అత్మలింగ సాక్షాత్కారం గోకర్ణం క్షేత్ర దర్శనం

PC :gokarna official website

రవాణా సౌకర్యాలు

కర్ణాటకలోని హుబ్లీ నుంచి దాదాపు 195 కిలోమీటర్ల దూరంలో ఈ గోకర్ణం క్షేత్రం ఉంది. హుబ్లీ నుంచి గోకర్ణం చేరాలనుకునే వారు అంకోలా అనే ప్రాంతాన్ని చేరుకుని అక్కడి నుంచి గోకర్ణంకు వెళ్లాల్సి ఉంటుంది.