» »పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?

పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?

Written By: Venkatakarunasri

గణగణమ్రోగే గంటలు బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అద్భుతంగా చెక్కిన ఆలయంలోని నిర్మాణాలివి. పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేకతలివి. కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్ళకుకట్టినట్టు చూపించే స్థంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది జగన్నాధ రథయాత్ర.

ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలో ఈ జగన్నాధ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రధయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1077 లో పూరీలో నిర్మించారు. అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది.

Latest : అచలేశ్వర్ లో నరకానికి ద్వారం !

జగన్నాధుడు అంటే లోకాన్ని ఏలే దైవం. కొలువైన ఈ ఆలయంలో ప్రతీదీ చాలా మిస్టీరియస్ గా వుంటుంది. ఈ జగన్నాధ ఆలయం గురించి మీకు తెలియని నమ్మకం కుదరని ఎన్నో నిజాలు వున్నాయి.

పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. జెండా

1. జెండా

ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండా చాలా ఆశ్చర్యకరంగా వుంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు వుంటే అటువైపే వీస్తూ వుంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా జెండా రెపరెపలాడుతూ వుంటుంది.

2. చక్రం

2. చక్రం

పూరీలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనది. మీరు పూరీలో ఎక్కడైనా నిలబడి గోపురం పై వున్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపే తిరిగినట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.

పూరి రధయాత్ర ...జగన్నాధుడి కదిలే రధచక్రాలు !

3. అలలు

3. అలలు

సాధారణంగా తీరప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రంపై నుంచి భూమి వైపుకు వుంటుంది. సాయంత్రం వైపు గాలి భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో దీనికి విభిన్నంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.

కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ !

4. పక్షులు

4. పక్షులు

జగన్నాధ ఆలయం పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.

జగన్నాథ ఆలయం - ఆసక్తికర విషయాలు !

5. గోపురం నీడ

5. గోపురం నీడ

పూరీ జగన్నాధ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఏమాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా. రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు.ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదనమో మరి.

ఇండియా లో ప్రసిద్ధి చెందిన బీచ్ రోడ్లు !

6. ప్రసాదం

6. ప్రసాదం

పూరీ జగన్నాధ ఆలయంలో తయారుచేసే ప్రసాదాన్ని ఎవ్వరూ వేస్ట్ చేయరు.

7. అలల శబ్దం

7. అలల శబ్దం

సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది. అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. కారణం ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు. అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు.

8. రధ యాత్ర

8. రధ యాత్ర

పూరీ జగన్నాధ రధ యాత్రకు రెండు రథాలు లాగుతారు. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్ళను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తరువాత 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుండి మరో రథం దేవుళ్ళను గుండిజా ఆలయానికి తీసుకెళుతుంది.

9. రధాలు

9. రధాలు

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడు విగ్రహాలను ఊరేగిస్తారు. రధం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు వుంటుంది. ఈ రధానికి 16 చక్రాలుంటాయి.

10. బంగారు చీపురు

10. బంగారు చీపురు

రధ యాత్రకు ముందు పూరీ రాజు రధ యాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రధాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధ యాత్ర ప్రారంభమౌతుంది.

11. విగ్రహాలు

11. విగ్రహాలు

ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.

12. గుండీజా ఆలయం

12. గుండీజా ఆలయం

ప్రతీ ఏడాది రధ యాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీజా ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరి. సాయంత్రం 6గం.ల.తరవాత ఆలయం తలుపులు మూసేస్తారు.

13. ప్రసాదంలోని మిస్టరీ

13. ప్రసాదంలోని మిస్టరీ

పూరీ జగన్నాధ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయం సంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టి కుండలలో చేస్తారు. మరో విశేషం ఏమిటో తెలుసా? దేవుడికి సమర్పించక ముందు ఈ ప్రసాదాలలోని ఎలాంటి వాసనా వుండదు. రుచీ వుండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదాల నుంచి ఘుమఘుమలతో పాటు రుచి కూడా వస్తుంది.

14. ఎలా వెళ్ళాలి

14. ఎలా వెళ్ళాలి

1. ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.

2. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్‌ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.

3. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

4. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.

5. భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.