Search
  • Follow NativePlanet
Share
» »భార‌త‌దేశ‌పు అత్యంత అందమైన ఓడరేవు నగరాలు

భార‌త‌దేశ‌పు అత్యంత అందమైన ఓడరేవు నగరాలు

భార‌త‌దేశ‌పు అత్యంత అందమైన ఓడరేవు నగరాలు

మ‌న దేశం పురాతన దేవాలయాలు, సందడిగా ఉండే మార్కెట్లు మరియు సంప్రదాయ నగరాలతో నిండిన అద్భుతమైన నేల‌గా చెప్పుకోవ‌చ్చు. వీటితోపాటు భారతదేశ నౌకాశ్రయాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి శతాబ్దాలుగా వాణిజ్య కేంద్రాలుగా పనిచేశాయి.

నేటికీ ప‌ని చేస్తూనే ఉన్నాయి. అలాంటి ఓడరేవు నగరాల‌ను సందర్శించడం ద్వారా ఇతర ప్రాంతాల సంస్కృతులు, ప‌ర్యాట‌క అందాల‌ను మ‌న‌సారా ఆస్వాదించ‌వ‌చ్చు. మ‌న‌దేశంలోని అత్యంత అంద‌మైన ఓడ‌రేవు న‌గ‌రాల విశేషాల తెలుసుకుందాం.

కొల్లం

కొల్లం

దక్షిణ కేరళలో ఉన్న కొల్లం అనేక శతాబ్దాల నాటి వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన సుందరమైన ఓడరేవు నగరం. పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటీష్‌వారి ప్రభావం ఈ పురాతన ఓడరేవును సుసంపన్నం చేశాయి. స్పైస్ రూట్‌లో కొల్లం ప్రముఖ ఓడరేవుగా ఉన్నప్పుడు మార్కో పోలో సందర్శించారు. ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ సందర్శన లేకుండా కొల్లం పర్యటన పూర్తి కాదు. మున్రో ద్వీపాన్ని అస్స‌లు మిస్ చేయకూడదు. అరేబియా సముద్ర తీరం వెంబడి ఉన్న సెయింట్ థామస్ ఫోర్ట్ ఆవ‌ర‌ణ‌లోని తంగస్సేరీ లైట్‌హౌస్‌ను సందర్శించిన అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.

కోల్‌కతా

కోల్‌కతా

పశ్చిమ బెంగాల్ యొక్క ఈ రాజధానిగా ఉన్న ఈ పురాతన ఓడరేవు ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1690లో కోల్‌కతాలో ఒక స్థావరాన్ని ఏర్ప‌రిచింది. ఈ నగరం భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధానిగా కూడా ప్ర‌సిద్ధిపొందింది. మాలిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్‌తో పాటు న్యూ మార్కెట్‌ను సందర్శించడం చాలా ముఖ్యం. నగరంలోని అతి పురాతన మార్కెట్ ఇది. దాదాపు ఇక్క‌డ దొర‌క‌ని వ‌స్తువు ఏదీ ఉండ‌దంటే అతిస‌యోక్తికాదు. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం లేదా బేలూర్ మఠాన్ని సంద‌ర్శించ‌డం అస్స‌లు మిస్ అవ్వకండి.

పాండిచ్చేరి

పాండిచ్చేరి

ఈ పురాతన ఓడరేవు పట్టణం 100 BC నాటి రోమన్ మరియు గ్రీకు వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఇది 1954 వరకు ఫ్రెంచ్ కాలనీగా కొన‌సాగించ‌బ‌డింది. అందుకే ఈ పట్టణం అంతటా దాని వలస చరిత్ర యొక్క అనేక జాడలు తార‌స‌ప‌డ‌తాయి. ఇది క్రిస్టియన్, హిందూ మరియు ముస్లిం నిర్మాణాల‌తో కూడిన ప్రార్థనా స్థలాల స‌ముదాయంతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. పాండిచ్చేరి బైక్ రైడ్ ద్వారా సంద‌ర్శించ‌డం ఓ మంచి అనుభూతిని అందిస్తుంది. ప్రత్యేకించి సముద్రతీర‌పు అందాల‌ను ఆస్వాదించాలంటే ప్యారడైజ్ బీచ్ మంచి ఎంపిక‌.

చెన్నై

చెన్నై

"దక్షిణ భారతదేశానికి గేట్‌వే" అని పిలువబడే చెన్నై రుచికరమైన తినుబండారాలు మరియు అద్భుతమైన దేవాలయాలతో నిండి ఉంటుంది. ఈ నగరం మొదట చిన్న చిన్న గ్రామాల సమూహంగా ఉండేది. కానీ బ్రిటీష్ వారు 17వ శతాబ్దం మధ్యలో దీనిని వాణిజ్య నౌకాశ్రయంగా అభివృద్ధి చేశారు. ఇక్క‌డ చూడదగ్గ చారిత్ర‌క నిర్మాణం 8వ శతాబ్దానికి చెందిన పార్థసారథి ఆలయం. చెన్నైలో అత్యంత ఆకర్షణీయమైన ఆలయం 17వ శతాబ్దానికి చెందిన కపాలీశ్వరార్. వీటితోపాటు కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్ కాంప్లెక్స్‌ని సందర్శించ‌డం మ‌ర్చిపోకూడ‌దు.

కొచ్చి

కొచ్చి

కొచ్చిని అరేబియా సముద్రం యొక్క రాణి అని పిలుస్తారు. భారతీయ, చైనీస్, పోర్చుగీస్, డానిష్, అరబ్ మరియు బ్రిటిష్ సంస్కృతులు ఇప్ప‌టికీ తార‌స‌ప‌డ‌తాయి. స‌రికొత్త మ‌సాలా వాస‌న‌లు విద‌జ‌ల్లే స్థానిక మార్కెట్‌ల‌లో తిర‌గాడ‌టం కొత్త అనుభూతుల‌ను చేరువ చేస్తాయి. పుస్తక దుకాణాలు, టీ దుకాణాలు మరియు ఆర్ట్ గ్యాలరీలను చూడటానికి ప్రిన్సెస్ వీధిలో షికారు చేయండి. చారిత్రాత్మకమైన నిర్మాణాన్ని సంద‌ర్శించాల‌నుకంటే మాత్రం సెయింట్ ఫ్రాన్సిస్ చర్చికి వెళ్లండి. ఇది భారతదేశంలోని పురాతన యూరోపియన్ చర్చిగా పరిగణించబడుతుంది.

విశాఖపట్నం

విశాఖపట్నం

దక్షిణ భారతదేశంలోని ఈ ఓడరేవు నగరాన్ని వైజాగ్ అని పిలుస్తారు. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండీ సులభంగా చేరుకోవచ్చు. ఇక్క‌డి తీర‌ప్రాంతాలు, గుహలు మరియు లోయలతో సహా చారిత్రాత్మక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. పురాత‌న‌ సింహాచలం ఆలయం కూడా సందర్శించదగినది. దీనికి ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ఈ ఆల‌యం క్రీ.శ.1098 నాటిది. ఉప్పొంగే జలపాతాలు, ప్రవాహాలు మరియు కాఫీ తోటలను మ‌న‌సారా ఆస్వాదించేందుకు అనువుగా ఉంటుంది.

Read more about: kollam kolkata pondicherry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X