Search
  • Follow NativePlanet
Share
» »ఐపీఎల్ మొదలయ్యింది..ఏ స్టేడియం ఎక్కడ ఉందో తెలుసా

ఐపీఎల్ మొదలయ్యింది..ఏ స్టేడియం ఎక్కడ ఉందో తెలుసా

ఐపీఎల్ జరుగుతున్న క్రికెట్ స్టేడియంలకు సంబంధించిన కథనం.

By Kishore

ఇండియాలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడ క్రికెట్. దీనికి ఆధునికతను జోడించి ప్రజలకు మరింత వినోదాన్ని అందించే పోటీలే ఐపీఎల్. ఈ ఐపీఎల్ ఇప్పటికే మొదలయ్యింది. ఈ పోటీలు దేశంలోని వివిధ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలలో జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు అన్నీ ప్రముఖ పర్యాటక కేంద్రాలే ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి చోట్ల జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను చూడటానికి వేరే నగరాల నుంచి కూడా క్రికెట్ ప్యాన్స్ వస్తుంటారు. మరోవైపు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని అనుసరించి సదరు స్టేడియంలను కూడా అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న ప్రాంతాలు అక్కడ ఉన్న స్టేడియంలకు సంబంధించిన వివరాలు మీ కోసం

ఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనేఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనే

1. ఎం. చిన్నస్వామి స్టేడియం

1. ఎం. చిన్నస్వామి స్టేడియం

Image Source:

ఎం. చిన్నస్వామి స్టేడియం లేదా కర్నాటక స్టేట్ క్రికెట్ అసోషియేషన్ (కే.ఎస్.సీ.ఏ) స్టేడియం అని అంటారు. ఈ స్టేడియం కర్నాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఏకైక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. సుమారు 55 వేల సీటింగ్ కెపాసిటీ దీని సొంతం. నగర నడిబొడ్డున ఉన్న ఈ స్టేడియంకు దగ్గరగా కబ్బన్ పార్క్, ఎం.జీ రోడ్ వంటి ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి.

2. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం

2. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం

Image Source:

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉంది. 2003 లో నిర్మించిన ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 60 వేలు. హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ ఛార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, పార్క్, బిర్లా టెంపుల్ తదితర ప్రాంతాలు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

3. వాంఖేడా క్రికెట్ స్టేడియం

3. వాంఖేడా క్రికెట్ స్టేడియం

Image Source:

వాంఖేడా క్రికెట్ స్టేడియం ముంబైలో ఉంది. భారత దేశంలోని అత్యంత పురాతనమైన మైదానాల్లో వాంఖేడా క్రికెట్ స్టేడియం మొదటి వరుసలో నిలుస్తుంది. సుమారు 34 వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం సచిన్ వంటి క్రికెట్ దిగ్గజాన్ని అందించింది. అదే విధంగా 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది ఇక్కడే. ఇక క్రికెట్ దిగ్గజమైన సచిన్ తన చివరి మ్యాచ్ ఈ స్టేడియంలోనే ఆడారు. ముంబైతో పాటు చుట్టు పక్కల ఎన్నో చూడదగిన పర్యాటక కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.

4. ఫిరోజ్ షా స్టేడియం

4. ఫిరోజ్ షా స్టేడియం

Image Source:

ఢిల్లీలో ఉన్న ఈ స్టేడియం 1948 లో ఏర్పాటు చేశారు. భారత దేశంలోని అత్యంత పురాతన స్టేడియాల్లో ఫిరోజ్ షా కోట్ల స్టేడియం కూడా ఒకటి. భారత దేశ టెస్ట్ క్రికెట్ కు ఈ స్టేడియాన్ని లక్కీ అని అంటారు. ఐపీల్ లోని ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఇది హోం పిచ్.

5. వీర్ నారయణ సింగ్ అంతర్జాతీయ మైదానం, రాయ్ పూర్

5. వీర్ నారయణ సింగ్ అంతర్జాతీయ మైదానం, రాయ్ పూర్

Image Source:

రాయ్ పూర్ లోని ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉన్న ఈ వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ మైదనం 2008లో నిర్మించారు. సుమారు 50 వేల సీటింగ్ కెపాసిటీ దీని సొంతం. 2010 లో మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది.

6. ఎంసీఏఎస్ స్టేడియం

6. ఎంసీఏఎస్ స్టేడియం

Image Source:

మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంను పూణే శివారులో నిర్మించారు. 2011లో నిర్మించిన ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 36వేలు. కింగ్స్ పంజాబ్ జట్టుకు హోం పిచ్. ఇక్కడ మొదటి టీ 20 మ్యాచ్ 2012లో జరిగింది.

7. సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రాజ్ కోట్

7. సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రాజ్ కోట్

Image Source:

గుజరాత్ లోని రాజ్ కోటలో ఉనక్న ఈ స్టేడియం మొత్తం సౌర్య విద్యుత్ ను ఏర్పాటు చేశారు. మొత్తం సీటింగ్ కెపాసిటీ 28 వేలు. రాజ్ కోట్ తో పాటు చుట్టు పక్కల ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

8. విదర్భ క్రికెట్ అసోషియేషన్

8. విదర్భ క్రికెట్ అసోషియేషన్

Image Source:

మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో విదర్భ క్రికెట్ స్టేడియం ఉంది. దీనిని వీసీఏ అని పిలుస్తారు. ఈ స్టేడియంను 2008 లో ఏర్పాటు చేశారు. మొత్తం సీటింగ్ కెపాసిటీ 45 వేలు. ఈ స్టేడియంలో 2017లో 5 టెస్ట్ మ్యాచ్ లు, ఏడు వన్ డే మ్యాచ్ లు 11 టీ20 మ్యాచ్ లు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X