Search
  • Follow NativePlanet
Share
» »జోగ్ అందాలను చూడటానికి సమయం ఆసన్నమయ్యింది

జోగ్ అందాలను చూడటానికి సమయం ఆసన్నమయ్యింది

కర్నాటకలోని అందమైన జోగ్ జలపాతానికి సంబంధించిన కథనం.

ప్రకృతి అందాలకు కర్నాటక నెలవు. విభిన్న భౌగోళిక పరిస్థితులు కలిగిన ఈ దక్షిణాదిరాష్ట్రంలో ఒక పక్క సముద్ర తీర ప్రాంతం ఉంటే మరోవైపు ఎతైన కొండ కోనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ కనుమల్లో ప్రకృతిలో ఎన్ని అందాలుంటే అన్నీ కూడా ఇక్కడ మనకు కంటికి ఇంపుగా కనిపిస్తాయి.

ముఖ్యంగా అంతెత్తు నుంచి దూకే జలపాతాలు, ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకొన్న అడవులు, చెంగుచెంగున ఎగిరే లేడి పిల్లలు, పురవిప్పి నాట్యమాడే నెమళ్లు ఇలా ఎన్నో అందాలను ఆస్వాధించవచ్చు. ఇక కర్నాటకలో ఇప్పుడిప్పుడే వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క కర్నాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న జోగ్ జలపాతం తన హొయలను చూపించడానికి సిద్ధమవుతోంది.

శరావతి నదిలో నీటి మట్టం క్రమంగా పెరిగే కొద్ది ఈ జలాపాతం హోరు కూడా పెరుగుతూనే ఉంది. దీంతో కర్నాటక రాష్ట్ర పర్యాటక మకుటంగా పేర్కొనే ఈ జలపాతం గురించిన క్లుప్తమైన వివరణ మీకోసం. ఈ వర్షాకాలం ముగిసేలోపు ఓ వీకెండ్ అక్కడకు వెళ్లి హాయిగా సేద తీరవచ్చు.

ఎత్తైన జలపాతం

ఎత్తైన జలపాతం

P.C: You Tube

భారత దేశంలో అతి ఎతైన జలపాతాల్లో జోగ్ జలపాతం ప్రథమ వరుసలో ఉంటుంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా, సాగర తాలూకాలో ఉంది. శరావతి నది 253 మీటర్లు అంటే 829 అడుగుల ఎత్తు నుంచి పడటం వల్ల ఈ జలపాతం ఏర్పడుతుంది. ఈ జలపాతానికి గేరుసొప్ప, జోగోడా గుండి అనే పేర్లు కూడా ఉన్నాయి.

నాలుగు పాయలుగా

నాలుగు పాయలుగా

P.C: You Tube

జోగ్ జలపాతం పై నుంచి కిందికి పడే సమయంలో నాలుగు పాయలుగా విడిపోతుంది. ఆ పాయలు పడే వేగం, ఆ సమయంలో చేసే శబ్దం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటికి రాజ, రోవర్, రాకెట్, రాణి అనే పేర్లుపెట్టారు.

ఆ పేర్లే ఎందుకంటే

ఆ పేర్లే ఎందుకంటే

P.C: You Tube

రాజ.....ఈ పాయ చాలా నిర్మలంగా, సౌమ్యంగా ఉంటుంది.

రోరర్....ఈ పాయ పెద్ద పెద్ద రాళ్ల మధ్య శబ్దాలు చేస్తూ కిందికి దుముకుతూ ఉంటుంది.

రాకెట్....అత్యంత వేగంతో సన్నటి ధారలాగా ఉంటూ చూడటానికి రాకెట్ వలే కనిపిస్తుంది.

రాణి... ఈ పాయ వయ్యారాలు పోతూ కిందికి పడుతూ ఉంటుంది.

జలక్రీడల ద్వీపం

జలక్రీడల ద్వీపం

P.C: You Tube

జోగ్ జలపాతానికి దగ్గర్లో అంటే దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో హెన్నెమరాడు అనే ద్వీపం ఉంది. ఇక్కడ బోటింగ్ తో పాటు వివిధ రకాల జలక్రీడలు అందుబాటులో ఉంటాయి. పెద్దలు కూడా తమ వయస్సును మరిచిపోయి ఇక్కడ జలక్రీడలు ఆడటానికి ఉత్సాహం చూపుతారు.

వాయు మార్గం

వాయు మార్గం

P.C: You Tube

జోగ్ జలపాతానికి 130 కిలోమీటర్ల దూరంలో హుబ్లీ విమానాశ్రయం ఉంది. ఇక మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి జోగ్ జలపాతానికి మధ్య దూరం 135 కిలోమీటర్లు. అదే బెంగళూరు అంతర్జాతీయ విమాశ్రం నుంచి జోగ్ జలపాతాన్ని చేరుకోవడానికి 340 కిలోమీటర్లు ప్రయాణించాలి.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

P.C: You Tube

జోగ్ జలపాతానికి దగ్గర్లో తలగప్ప, సాగర రైల్వేష్టేషన్లు ఉన్నాయి. ఇవి వరుసగా 30, 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. బెంగళూరు నుంచి సాగర, శివమొగ్గ వరకూ నేరుగా ప్రభుత్వ, ప్రేవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి కూడా జలపాతం వద్దకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X