Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ మీరు వివాహం చేసుకోవాలన్నా చేసుకోలేరు

ఇక్కడ మీరు వివాహం చేసుకోవాలన్నా చేసుకోలేరు

జంబూకేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

ఆదిదంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుడి సన్నిధానంలో వివాహం చేసుకొంటే తమ సంసారం చక్కగా సాగుతుందని అందరూ విశ్వసిస్తారు. అందుకోసం ఎంత దూరమైనా, ఎన్ని వ్యయ, ప్రయాసలు ఎదురైనా వారు కొలువై ఉన్న దేవాలయంలో వివాహం చేసుకొంటారు. అయితే దేశంలో ఒకే ఒక దేవాలయంలో మాత్రం వివాహం నిషిద్ధం. ఆ దేవాలయం ఎక్కడ ఉంది? వివాహం జరిపించడం ఎందుకు నిషేదం? ఆ దేవాలయానికి ఎలా వెళ్లాలి? తదితర వివరాలన్నీ మీ కోసం...

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

దేవాలయాల నిలమైన తమిళనాడులో జంబుకేశ్వరాలయం అత్యంత విశిష్టమైనది. ఈ దేవాలయం సుమారు 1800 ఏళ్ల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. చోళరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఉన్న శ్రీ రంగ ద్వీపంలో ఉంది.

రూ.1000 కోట్లతో దుర్గామాత పూజవేదికలు ఎక్కడో తెలుసా?రూ.1000 కోట్లతో దుర్గామాత పూజవేదికలు ఎక్కడో తెలుసా?

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

ఈ ఈ జంబుకేశ్వరాలయం పంచ భూత లింగాల్లో ఒకటి. ఈ జంబుకేశ్వరాలయం పంచభూతాల్లో ఒకటైన నీటికి ప్రతీకగా చెబుతారు. అందువల్లే ఈ దేవాలయం చుట్టు పక్కల ఎటువంటి నీటి కొరత ఉండదని చెబుతారు. ఈ దేవాలయానికి సంబంధించిన అనేక కథలు ప్రాచారంలో ఉన్నాయి.

ఈ సరస్సులోపల ఉన్న లక్షల కోట్ల నిధిని సొంతం చేసుకోవాలా?ఈ సరస్సులోపల ఉన్న లక్షల కోట్ల నిధిని సొంతం చేసుకోవాలా?

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

ఒక రోజు పార్వతీ దేవి ఆ పరమశివుడు లోక కళ్యాణం కోసం చేస్తున్న తపస్సును హేళన చేస్తుంది. దీంతో పరమేశ్వరుడు పార్వతిదేవికి తగిన గుణపాఠం చెప్పాలనుకొంటాడు. దీంతో పార్వతీదేవిని భూ లోకం వెళ్లి అక్కడ ఒక సాధారణ జీవితం గడపాలని శాపం పెడుతాడు.

నగ్న యక్షిణి ఎంత అందంగా ఉందోనగ్న యక్షిణి ఎంత అందంగా ఉందో

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

చివరికి పార్వతీ దేవి తన తప్పును తెలుసుకొని క్షమించాలని వేడుకొంటుంది. దీంతో శాప విమోచనం కూడా సూచిస్తారడు. దీని ప్రకారం పార్వతీ దేవి భూలోకానికి వచ్చి కావేరి నదీ తీరానికి చేరుకొంటుంది. అక్కడ ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ వివలింగానికే పూజలు చేయడం ప్రారంభిస్తుంది.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

పార్వతీ దేవి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ ఓ గురువు రూపంలో ప్రత్యక్షమయ్యి ఆమెకు జ్జానబోధ చేస్తాడు. అలా పార్వతీ పరమేశ్వరులు ఈ దేవాలయంలో గురు, శిష్యులుగా కొన్నాళ్లు ఉన్నారు. గురుశిష్యుల పవిత్ర బంధాన్ని గుర్తు చేస్తుకొంటూ ఇక్కడ వారిరువురికీ కళ్యాణం జరిపించరు. అంతేకాకుండా ఇతరులు ఎవరూ ఈ దేవాలయంలో వివాహం చేసుకోవడానికి అనుమతించబోరు. తరతరాలుగా ఈ ఆచాలరం కొనసాగుతూ వస్తోంది.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

ఇక ఈ దేవాలయానికి సంబంధించి మరో కథనం ప్రకారం పూర్వం మలయాన, పుష్పవంత అనే ఇద్దరు గందర్వులు ఉండేవారు. ఒక విషయంలో వారిద్దరూ గొడవపడుతారు. ఆ కోపంలో విచక్షణ కోల్పోతారు. ఈ క్రమంలో మలయాన పుష్పదంతనుకి భూలోకంలో ఏనుగువై సంచరించాల్సిందిగా శాపం పెడుతాడు.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

అదే విధంగా పుష్పవంత మలయనకు భూలోకంలో సాలెపురుగు వలే సంచరించాల్సిందిగా శాపం పెడుతాడు. అలా ఇద్దరు యక్షలు భూమి పై కావేరి నదీ ఒడ్డున ఏనుగు, సాలేపురుగు రూపంలో చేరుకొంటారు. ఏనుగు దగ్గరల్లోని కావేరి నదినుంచి నిత్యం నీటిని తీసుకువచ్చి ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటుంది.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

ఇక సాలేపెరుగు కూడా ఎండ వేడమి శివలింగాన్ని పడకుండా ఉండాలని లింగం చుట్టూ గూడును కడుతూ ఉంటుంది. అయితే ఈ గూడును చెత్తగా భావించిన ఏనుగు రోజూ తొలగించి తిరిగి నీటితో అభిషేకం చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన సాలేపురుగు ఒకరోజు ఏగుగు తొండంలోకి దూరిపోతుంది.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

దీంతో బాధతో విలవిలాడుతూ ఏనుగు తన కుంభస్థలాన్ని పెద్ద బండరాయికి మోది ప్రాణాలు విడుతుంది. ఇక అదే తొండంలో ఉన్న సాలేపురుగు కూడా ప్రాణాలు వదులుతుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి వారిరువురికి మోక్షం ప్రసాదిస్తాడు.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

దీంతో బాధతో విలవిలాడుతూ ఏనుగు తన కుంభస్థలాన్ని పెద్ద బండరాయికి మోది ప్రాణాలు విడుతుంది. ఇక అదే తొండంలో ఉన్న సాలేపురుగు కూడా ప్రాణాలు వదులుతుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి వారిరువురికి మోక్షం ప్రసాదిస్తాడు.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

జంబూకేశ్వర దేవాలయం వాస్తు, శిల్పకళ రంగనాథ స్వామి దేవాలయం కంటే చాలా బాగుంటుందని చెబుతారు. ఇక్కడ ఐదు ప్రాకారాలు ఉంటాయి. ఐదో ప్రాకారంలోని గోడను పరమశివుడు స్వయంగా నిర్మించినట్లు చెబుతారు. ఇక నాలుగో ప్రాకారంలో 769 స్తంభాలతో పాటు ఒక జల కుండం కూడా ఉంది.

జంబుకేశ్వరాలయం

జంబుకేశ్వరాలయం

P.C: You Tube

మూడో ప్రాకారంలో ఒక గోపురం ఉంది. అయితే ఈ మందిరంలో ఒక స్తంభం పై ఉన్నట్లు మరో స్తంభం పై శిల్పాలు ఉండవు. ఈ శివాలయం తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఉంది. ఇక్కడ స్థానికంగానే ఎయిర్ పోర్ట్ ఉంది. అదే విధంగా స్థానికంగా రైల్వేస్టేషన్ కూడా ఉంది. చెన్నై నుంచి నిత్యం ఇక్కడకు బస్ సౌకర్యం ఉంది.

9 రోజులు 9 దుర్గ రూపాలు. కొలిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయంట?9 రోజులు 9 దుర్గ రూపాలు. కొలిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయంట?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X