» »600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి - బీదర్ లోని ఝర్ణీ నరసింహక్షేత్రం

600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి - బీదర్ లోని ఝర్ణీ నరసింహక్షేత్రం

Written By: Venkatakarunasri

బీదర్ ... కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ అవతరణప్పుడు (నవంబర్ 1, 1956) మైసూర్ రాష్ట్రం (ఇప్పటి కర్ణాటక) లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో కన్నడ, తెలుగు తో పాటు మరాఠా భాష కూడా మాట్లాడుతారు.

హైదరాబాద్ సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. చరిత్ర బహమనీ సుల్తాన్ అహ్మద్ షా బీదర్ ను రాజధానిగా చేసుకొని పాలించాడు. ఇక్కడ కోటను నిర్మించుకొని, నివాసం ఉండి బహమనీ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం.

హైదరాబాద్ నుండి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి చేరుకోవటానికి పట్టే సమయం : 3 గంటలు. బెంగళూరు నుండి 700 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉన్నది. బీదర్ కు గల పేర్లు : విదురానగరం - మహాభారత కాలంలో, అహ్మదాబాద్ బీదర్ - అహ్మద్ షా పరిపాలన కాలంలో, బెడద కోట నిక్ నేమ్ : ది సిటి ఆఫ్ విష్పరింగ్ మాన్యుమెంట్స్

600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి - బీదర్ లోని ఝర్ణీ నరసింహక్షేత్రం

తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం

తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం

మనదేశం ఆత్యాధ్మిక నిలయం.మనస్సు ప్రశాంతంగా వుండటానికి మనము ఆలయాలను సందర్శిస్తూవుంటాం. అటువంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం ఝరణీ నరసింహక్షేత్రం.

ఈ క్షేత్రంలో స్వామివారు ఎప్పటినుండి కొలువైవున్నారు?

ఈ క్షేత్రంలో స్వామివారు ఎప్పటినుండి కొలువైవున్నారు?

క్రీ.పూ 400 ల సం ల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువైవున్నారని చెబుతున్నారు.మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోటానికి ఒక ప్రత్యేకత వుంది.

PC: youtube

గుడి ఎక్కడ వుంది ?

గుడి ఎక్కడ వుంది ?

చుట్టూ కొండలు పచ్చని ప్రశాంతవంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు దగ్గరలో గల మంగళ్ పేట్ లో నరసింహక్షేత్రం వెలసింది.

PC: youtube

ఎలా దర్శించుకోవాలి?

ఎలా దర్శించుకోవాలి?

ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి ఝరణీ నరసింహస్వామిని దర్శించుకోవాలి.

PC: youtube

ఎందుకు జాలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తారు?

ఎందుకు జాలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తారు?

స్వామి వారి పాదాల నుండి నీరు ప్రవహిస్తుండడంతో జాలా నరసింహస్వామి ఆలయమని పిలుస్తున్నారు.

PC: youtube

ఇతిహాసాల ప్రకారం

ఇతిహాసాల ప్రకారం

అయితే మన పెద్దలు పురాణాలఇతిహాసాల ప్రకారం ఈ గుహలో తపస్సు చేస్తూ వుండగా జలాసురుడు అనే రాక్షసుడు అయన తపస్సును భగ్నం చేయడానికి రాగా లక్ష్మీనరసింహుడు వచ్చి రాక్షసుడ్ని సంహరిస్తూవుండగా తన చివరి కోరికగా లక్ష్మీనరసింహుడుని ఇక్కడే కొలువుండాలని కోరాడట.

PC: youtube

జలనరసింహుడు అనే పేరు ఎలా వచ్చింది?

జలనరసింహుడు అనే పేరు ఎలా వచ్చింది?

జలాసురుడు తన పేరుతో కలిపి భక్తులు పిలిచేవిధంగా వుండాలని చెప్పడంతో ఆ పుణ్యక్షేత్రాన్ని జలనరసింహుడుగా కొలవబడుతున్నారు.

PC: youtube

జలాసురుడు గురించి

జలాసురుడు గురించి

ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట .

PC: youtube

లక్షీ నరసింహ స్వామి

లక్షీ నరసింహ స్వామి

అప్పుడు లక్షీ నరసింహ స్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసింహ స్వామి .

PC: youtube

జలానరనరసింహుడు

జలానరనరసింహుడు

ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసింహ స్వామి అక్కడ వెలిశి ' జలానరనరసింహుడు ' గా కొలవబడుతున్నాడు .

PC: youtube

జాలా నరసింహుని సందర్శన ఎలా చేసుకోవాలి

జాలా నరసింహుని సందర్శన ఎలా చేసుకోవాలి

జలా అంటే నీరు కాబట్టి , నరసింహ స్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు.

PC: youtube

హైదరాబాద్ నుండి ఎంత దూరంలో వుంది?

హైదరాబాద్ నుండి ఎంత దూరంలో వుంది?

ఈ పుణ్య క్షేత్రం హైదరాబాదుకు 140 కి.మీ ల దూరంలో కలదు. ఝరణీ నరసింహక్షేత్రాన్ని మీరెప్పుడైనా సందర్శించుకున్నారా?

PC: youtube

జహీరాబాద్ మార్గం

జహీరాబాద్ మార్గం

జహీరాబాద్ మార్గంలో హైదరాబాద్ నుండి ఝరణీ నరసింహక్షేత్రం చేరుటకు 3 గంటల 20 నిమిషాలు పడుతుంది.

pc:google maps

మెదక్, నాచారం మార్గం

మెదక్, నాచారం మార్గం

మెదక్, నాచారం మార్గంలో 4 గంటల 18నిమిషాలు పడుతుంది.

pc:google maps

బీదర్ కు ఎలా వెళ్ళాలి?

బీదర్ కు ఎలా వెళ్ళాలి?

రూట్ మ్యాప్

PC: youtube

విమాన సదుపాయం

విమాన సదుపాయం

బీదర్ కు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి బస్సుల ద్వారా గానీ, టాక్సీ ల ద్వారా గానీ బీదర్ చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయంకి దేశంలోని విమానాలే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి విమానాలు వస్తుంటాయి. ఈ విమానాశ్రయం బీదర్ కు సుమారుగా 140 కి. మీ. దూరంలో ఉన్నది. బసవకల్యాణ్ అనేది బీదర్ కి 77 కి. మీ. దూరంలోని మరొక దేశీయ విమానాశ్రయం.

రైలు సదుపాయం

రైలు సదుపాయం

బీదర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలచే అనుసంధానించబడింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళుతుంటాయి.

బస్సు సదుపాయం

బస్సు సదుపాయం

ఈ పట్టణం గుండా 9 వెళుతుంది. కనుక బస్సులకు ఎటువంటి ఢోకా లేదు. హైదరాబాద్ నుంచి బీదర్ కి మూడు గంటల ప్రయాణం. గవర్నమెంట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులు కూడా దొరుకుతాయి. బెంగళూరు, బసవకల్యాణ్, బీజాపూర్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు తిరుగుతూనే ఉంటాయి.