Search
  • Follow NativePlanet
Share
» »నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారి దేవాలయం జ్వాలాముఖి క్షేత్రం

నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారి దేవాలయం జ్వాలాముఖి క్షేత్రం

కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం 'జ్వాలముఖి'. ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 610మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా -ధర్మశాల హైవేపై, కాంగ్రా పట్టణానికి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఇది 51శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది.

ఇక్కడ ఈ జ్వాలేకాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారి అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా ముఖి ఆలయం.

జ్వాలాముఖి గురించిఅనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

జ్వాలాముఖి గురించిఅనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

దక్షయజ్ఝం తర్వాత సతీదేవి తనను తాను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం.

PC: Temple official site

జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట

జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట

జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట, అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు సైతం భంగపాటుకు గురికాక తప్పలేదు.

PC: Temple official site

శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు

శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు

జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడలనుంచి, చిన్న నీటి కుండం గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు. శ్రీయంత్రం ఉన్న ప్రదేశంలో ఎర్రని శాలువతోను బంగారు ఆభరణాలతోనూ కప్పి ఉంచుతారు. శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ అమ్మవారి మందిరంలో సిక్క మతస్థులు వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తుంటుంది. అలాగే నూతన వధూవరులు అమ్మవారి దర్శనార్థం రావడం కూడా ఉంది.

ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు

ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు

గోరఖ్ నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంటారు, మందిర ప్రాంగణంలో ఉన్న గోరఖ్ నాథ్ మఠం దగ్గర కింద రాతి నుండి వస్తున్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద పెద్ద పళ్లేలలో పళ్ళు, పూలు, పసుపు కుంకుమ ఎర్రవస్త్రంతో పాటు తీపి వంటకాలను సమర్పిస్తుంటారు. అమ్మవారి భక్తులలో అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది.

PC:commons.wikimedia.org

స్థలపురాణం

స్థలపురాణం

పూర్వం కటోచ్ వంశానికి చెందిన ‘మహారాజా భూమా చంద్’ దుర్గాదేవికి పరమభక్తుడు. ఒక రోజు భూమా చంద్ కు స్వప్నంలో అమ్మవారు కనిపించి తాను జ్వాల’గా ఆ అడవులలో పూజా నైవేద్యాలు లేక పడి ఉన్నట్లు తనను వెలికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించవలసిందిగా సెలవివ్వగా మహారాజు ఆ అడవులలో వెతికి అమ్మవారిని కనుగొన్నారు. ఆమెకు దేవాలయం కట్టించి నిత్యపూజలు నిర్వహించసాగాడు.ఇప్పటి అక్కడ ‘జ్వాల’తప్ప మరే విగ్రహమూ కనిపించకపోవడం విశేషం.

PC:commons.wikimedia.org

సిక్కుల మతగురువు ‘గురునానక్’

సిక్కుల మతగురువు ‘గురునానక్’

సిక్కుల మతగురువు ‘గురునానక్' ఈ ప్రదేశానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో తపస్సు చేసుకుంటుండగా. గురునానక్ పై శతృత్వము పెంచుకున్న అక్బర్ , నానక్ దేవతగా పూజలు చేస్తున్న జ్వాలలను ఆర్పాలని ఆ ప్రదేశం మొత్తాన్ని కొన్ని నెలల పాటు నీళ్లతో నింపి ఉంచుతాడు. కొన్ని నెలల తర్వాత కూడా మంటలు ప్రజ్వలిస్తూ ఉండటాన్ని చూసిన అక్బరు, నానక్ ను మహాపురుషుడిగా అంగీకరించి, అమ్మవారికి బంగారు ‘ఛత్రి'ని సమర్పించి అమ్మవారికి క్షమార్పణ అడిగి ఢిల్లీ తిరిగి వెళ్లిపోతాడు.

PC:commons.wikimedia.org

దౌలధర్ పర్వతాల దిగువున

దౌలధర్ పర్వతాల దిగువున

దౌలధర్ పర్వతాల దిగువున ..ధర్మశాల..సిమ్లా రోడ్డ్ మార్గం పక్కనే ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు.అమ్మవారికి ' దుర్గా శప్తశతి ' పారాయణతో అయిదు దశలుగా పూజలు , హారతి , హోమాలు నిర్వహిస్తారు . ప్రతీ రోజు 11-30 నుంచి 12-30 వరకు మద్యాహ్నపు హారతి కోసం మూసివేస్తారు . మిగతా సమయం అంటే రాత్రి 8-30 వరకు మందిరం తెరిచే వుంటుంది .

PC: Ashish Gupta

 నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నుడుమ నిత్యాగ్నిహోత్రంలా

నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నుడుమ నిత్యాగ్నిహోత్రంలా

నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నుడుమ నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాద్ ఆలయం, జ్వాలామయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తుంటారు.

PC:commons.wikimedia.org

815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో

815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో

ఘోరక్ నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొందినట్లు వారి శిష్యులు చెప్తారు. 815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో సహా పాలరాతి మందిరంను నిర్మించాడు. పెద్ద పెద్ద మంటపాలలో ఓ పక్క సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. మరో ప్రక్క మంటపంలో నేపాలీ రాజు బహూకరించిన పెద్ద ఇత్తడ గంట ఉంచారు. ఈ మందిరంలో ముఖ్యంగా ఏడు జ్వాలలను దర్శించుకోవాలి అదే అమ్మవారి రూపం.

PC:commons.wikimedia.org

 సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు

సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు

దేవీ భాగవతం ప్రకారం సతీదేవి దక్షవాటికలో ఆత్మత్యాగం చేసుకున్న తరువాత సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అవి అష్టాదశ పీఠాలుగాను , 51 వ పీఠాలుగాను , 108 పీఠాలుగాను వుద్భవించేయి . ఆ 51 పీఠాలలో సతీ దేవి యొక్క ' నాలుక ' పడ్డ ప్రదేశం యీ జ్వాలాముఖి క్షేత్రం .

PC:commons.wikimedia.org

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం: దేవాలయం ఉన్న ప్రదేశానికి రోడ్ మార్గం కనెక్ట్ అయ్యి ఉన్నది. రాష్ట్రంలో పంజాబ్, హర్యానా నుండి అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాంగ్రాకు ఫ్రీక్వెంట్ గా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం: గౌజ్ రైల్ హెడ్ సమీపంలోని పథాన్ కోట రైల్వే స్టేషన్. ఇది 123 కిమీ దూరంలో ఉంది.

విమాన మార్గం: కాంగ్రా కు సమీపంలో దర్మశాల ఎయిర్ పోర్ట్ దగ్గరగా ఉంది. అక్కడి నుండి సుమారు 47కిలోమీటర్ల దూరంలో ఆలయం చేరుకోవచ్చు.అక్కడి నుండి క్యాబ్ లేదా బస్ లో ప్రయాణం చేయవచ్చు. అలాగే చంఢీగడ్ ఎయిర్ పోర్ట్ సుమారు 200కిలో మీటర్ల దూరంలో ఉంది.

PC: Ashish Sharma

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more