Search
  • Follow NativePlanet
Share
» »కోటి శిల్పాలు తమ హావభావాలతో కనువిందు చేస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపించే కైలాషహర్

కోటి శిల్పాలు తమ హావభావాలతో కనువిందు చేస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపించే కైలాషహర్

అదొక మహారణ్యం. పర్వతాలు చుట్టుముట్టిన లోయలు కలిగిన ప్రాంతం. అంతే కాదు మీకు ఒక మహా అద్భుతం కనబడుతుంది ఇక్కడ అడుగడుగునా ఓ అందమైన శిల్పం. అలా సుమారు కోటి శిల్పాలు అక్కడకు అడుగుపెట్టిన వారినందరినీ పలకరిస్తున్నట్లుగా కనబడుతాయి. తమ హావభావాలతో కనువిందు చేస్తాయి. ఆ ప్రాంతమే ఉనకోటి. త్రిపుర రాష్ట్రంలో అత్యంత పురాతన శైవక్షేత్రం ఇది. బెంగాలీలో ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థం. అలాగే ఈ ఉనకోటిలో కైలాషహర్ అనే చారిత్రక నగరం కూడా ఉంది. ఉనకోటినినే కైలాషహర్ అని ఎందుకు పిలుస్తున్నారు. అసలు ఇంత చిన్న రాష్ట్రంలో ఇన్ని శిల్పాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకుందాం..

త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల

త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల

త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో త్రిపురకు కైలాషహర్ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది త్రిపు రాష్ట్ర దక్షిణమొన వరకూ విస్తరించి ఉంది. బంగ్లా దేశ్ తో దాని సరిహద్దును పంచుకుంటోంది. కైలాషహర్ ఒక చారిత్రక నగరం. 7 వ శతాబ్దం AD నుండి చాలా తరాలు నాటినది చెబుతారు. ఉనకోటి (కైలాషహర్ )కొన్ని శతాబ్దాల కాలం నాటి పాత రాతి శిల్పకళకు ప్రసిద్ది. ఉనకోటికి కైలాషహర్ కు చాలా దగ్గరి సంబంధాలున్నాయి. కైలాషహర్ యొక్క అసలు పేరు చ్చంబుల్నగర్ అని పిలుస్తారు.

PC:youtube

కొంతమంది కైలషహర్

కొంతమంది కైలషహర్

కొంతమంది కైలషహర్ అనే పేరును 'హర' (శివ మరొక పేరు) మరియు మౌంట్ కైలాష్ (శివ హోమ్) నుండి వచ్చిందని చెప్పుతారు. ఆ తర్వాత కైలషహర్ అనే పేరు 'కైలాష్-హార్' నుండి వచ్చింది అని భావిస్తారు. ప్రసిద్ధి చెందిన త్రిపుర రాజు ఆది-ధర్మఫా ఇక్కడ 7 వ శతాబ్దంలో గొప్ప యజ్ఞాలను నిర్వహించేవారు.

PC:youtube

ఉనాకోటి అంటే స్థానిక భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం

ఉనాకోటి అంటే స్థానిక భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం

ఉనాకోటి అంటే స్థానిక భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం. ఇక్కడ ఉన్న కొండ మీద ఒకటి తక్కువ కోటి దేవతామూర్తులు కనిపించడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ శిల్పాలను బహుశా 7 లేక 8వ శతాబ్దంలో చెక్కి ఉంటారని ఓ అంచనా! కానీ వీటి వెనక ఉన్న సందర్భం మాత్రం అస్పష్టం. ఆ మాట అంటే స్థానికులు ఒప్పుకోరు. వారి దృష్టిలో ఈ శిల్పాల వెనక ఓ అద్భుతమైన నేపథ్యం ఉంది.

PC:youtube

ఓసారి శివుడు కోటిమంది దేవతలతో కలసి కైలాసానికి

ఓసారి శివుడు కోటిమంది దేవతలతో కలసి కైలాసానికి

ఓసారి శివుడు కోటిమంది దేవతలతో కలసి కైలాసానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించి, కాసేపు విశ్రమించాలనుకున్నాడు. ఆయన వెంట వచ్చిన దేవతలందరూ కూడా ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుని కాసింత సేద దీరాలను కున్నారు. అందుకు శివుడు సమ్మతిస్తాడు. అయితే మర్నాడు సూర్యోదయానికి ముందే అక్కడి నుంచి బయలుదేరాలని, లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని షరతు విధిస్తాడు. దేవతలందరూ తీవ్రమైన అలసట కారణంగా గాఢనిద్రలో మునిగిపోవడంతో సూర్యోదయానికి ముందు మేలుకో లేకపోతారు. దాంతో శివుడు వారిని అక్కడే శిలలై పడి ఉండండని శపిస్తాడు.

PC:youtube

మరో కథనం ఏమిటంటే...

మరో కథనం ఏమిటంటే...

అప్పట్లో ఈ ప్రాంతంలో కల్లు కంహార అనే శిల్పి ఉండేవాడు. అతను శక్తి ఉపాసకుడు. ఓసారి శివగణాలతో పార్వతీ పరమేశ్వరులు ఈ మార్గం గుండా పయనిస్తున్నారు. అది తెలిసి అక్కడికి చేరుకున్న కల్లు కుమ్‌హార్‌ తననూ వారితో తీసుకు వెళ్లమని ప్రార్థించాడు. అందుకు పరమేశ్వరుడు సమ్మతించలేదు.

PC:youtube

PC:youtube

తన భక్తుడు కావడంతో

తన భక్తుడు కావడంతో

తన భక్తుడు కావడంతో తెల్లవారేలోగా కోటి శిల్పాలను చెక్కగలిగితే శివుణ్ణి ఎలాగైనా ఒప్పించి తమతో తీసుకు వెళ్లేలా చేస్తానని పార్వతి చెప్పింది. అతను ఆనందంతో విగ్రహాలు చెక్కడం మొదలు పెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ అవి కోటికి ఒకటి తక్కువగా ఉన్నాయి. తెలతెలవారుతుండగా కల్లుకుమార్‌ తన లక్ష్యానికి చేరువ కాసాగాడు. దాంతో అతనిలో తన నైపుణ్యం మీద అహంకారం జనించింది. ఆ అహంకారంలో అతను దేవతా శిల్పం బదులుగా, తన ఆకృతిని పోలిన శిల్పాన్నే చెక్కాడు. ఇంకేముంది! నిబంధన కాస్తా నీరుగారిపోయింది.

PC:youtube

పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు

పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు

దాంతో పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు. అసలు విషయం ఏమిటంటే, తాను చాలా గొప్పశిల్పినని అతనికి అహంభావం. పైగా బొందితో కైలాసానికి వెళ్లాలన్న కోరిక చాలా అసంబద్ధమైనది, అందుకే పరమేశ్వరుడతన్ని అనుగ్రహించలేదు.

PC:youtube

ఇక శిల్పాల విషయానికి వస్తే

ఇక శిల్పాల విషయానికి వస్తే

ఇక శిల్పాల విషయానికి వస్తే, ఇవి 30-40 అడుగుల ఎత్తున ఉంటాయి. అయితే అన్నీ అసంపూర్తిగా ఉంటాయి. వీటి పళ్లు, కళ్లు అలంకరణ, హావభావాలు అన్నీ కూడా అక్కడి గిరిజనులను ప్రతిబింబిస్తుంటాయి. ఈ పర్వత ప్రదేశంలోని ప్రతి మూలకూ వెళ్లడానికి ఎగుడుదిగుడుగా, అడ్డదిడ్డంగా రిబ్బన్‌ ఆకారంలో మెట్లు, పర్వతాలను అనుసంధానిస్తూ వంతెనలూ ఉన్నాయి. ఇక్కడ కాలు పెట్టగానే ఇంతటి అద్భుతమైన సుందరప్రదేశాన్ని ప్రపంచం ఎందుకు విస్మరించిందా అనిపిస్తుంది.

PC:youtube

ఇక్కడి శివుడికి ఉనకోటీశ్వర కాలభైరవుడని పేరు

ఇక్కడి శివుడికి ఉనకోటీశ్వర కాలభైరవుడని పేరు

ఇక్కడి శివుడికి ఉనకోటీశ్వర కాలభైరవుడని పేరు. దాదాపు ముప్ఫై అడుగుల ఎత్తులో చెక్కి ఉంటుంది శివుడి విగ్రహం. ఆయన తలే పదడుగులుంటుంది. ఒకవైపు సింహవాహనంపై పార్వతి, మరోవైపు గంగ ఉంటారు. పాదాల చెంత మూడు పెద్ద పెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్లుగా కనిపిస్తాయి. ఉనకోటీశ్వరుడికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. వినాయకుని విగ్రహం కూడా పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇలా ఎటుచూసినా ఉనాకోటి ఓ భిన్నమైన భక్తి ప్రపంచాన్ని తలపిస్తుంటుంది. అందుకనే వ్యయప్రయాసలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు. పూజారులు ఇక్కడికి దగ్గరలో భక్తులకు అందుబాటులో ఉంటారు.

PC:youtube

 ఇక్కడి రాతి విగ్రహాలకు పైన

ఇక్కడి రాతి విగ్రహాలకు పైన

ఇక్కడి రాతి విగ్రహాలకు పైన చక్కటి పచ్చిక బయళ్లు, కింది భాగాన గలగల పారే సెలయేళ్లు లేదా పైనుంచి కిందికి పరవళ్లు తొక్కుతూ పడే జలపాతాలు ఉంటాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే అశోకాష్టమి ఉత్సవాలకు త్రిపుర నుంచే గాక చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. జనవరిలో కూడా చిన్నపాటి ఉత్సవం నిర్వహిస్తారిక్కడ.

PC:youtube

త్రిపురలో ఆసక్తికరమైన కొన్ని ఇతర పర్యాటక స్థలాలు

త్రిపురలో ఆసక్తికరమైన కొన్ని ఇతర పర్యాటక స్థలాలు

ఉజ్జయంత ప్యాలెస్, త్రిపుర రాష్ట్ర మ్యూజియం, సుకాంత అకాడమీ, లోన్గ్తరై మందిర్, మణిపురి రాస్ లీల, ఉనకోటి, లక్ష్మీ నారాయణ ఆలయం, పురానో రాజ్బరి, నజ్రుల్ గ్రంథాగర్, మబ్బుల చిరుతపులి నేషనల్ పార్క్, రాజ్బరి నేషనల్ పార్క్ ఉన్నాయి.

PC:youtube

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

త్రిపుర రాజధాని అగర్తలాకు న్యూఢిల్లీ, అస్సాం, నాగాలాండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌... ఇలా ఇంచుమించు అన్ని ప్రధాన నగరాల నుంచి ట్రెయిన్లు ఉన్నాయి.

PC:youtube

రైలుమార్గం

రైలుమార్గం

రైలుమార్గంలో వచ్చేవారికి అతి సమీపంలోని రైల్వే స్టేషన్‌ కుమార్‌ఘాట్‌. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉనకోటి శిల్పసౌందర్యాన్ని వీక్షించవచ్చు.

విమానాశ్రయం

విమానాశ్రయం

విమానంలో వచ్చేవారు ఐజ్వాల్‌ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి ఉనకోటికి నేరుగా ట్యాక్సీలు ఉంటాయి. త్రిపుర పర్యాటకాభివృద్ధి శాఖ హెలికాప్టర్‌ ఛార్జీలను అందుబాటు ధరలోనే ఉంచడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X