» »ఇక్కడ కూడా సర్పదోష నివారణ పూజలు

ఇక్కడ కూడా సర్పదోష నివారణ పూజలు

Written By: Beldaru Sajjendrakishore

హిందూ మతంలో పూజాధి కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఒంటికి నలతగా అనిపించినా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం సాధారణ విషయం. ఇందుకు ధనిక, పేద, విద్యావేత్త, నిరక్షరాస్యుడు అన్న భేదాభిప్రాయం లేదు. ఇటువంటి పూజా కార్యక్రమాల్లో కాలసర్పదోష నివారణ పూజలు అత్యంత ముఖ్యమైనవి. ఈ పూజలు జరిపించుకోవడానికి దేశంలో చాలా చోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తికి లేదా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వస్తూ ఉంటారు. ఇందు కోసం కొన్ని నెలల ముందుగానే పూజలు జరిపే రోజును రిజర్వ్ చేసుకుంటున్నారు. మరికొంత మంది తమకు అనుకూలమైన రోజు దొరక్క సదరు పూజాధికార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే గత కొన్ని నెలలలుగా హంపిలోని విరూపాక్ష దేవాలయంలో కూడా ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే పూజాధి కార్యక్రమాల వివరాలతో పాటు స్థానిక పర్యాటక ప్రాంత వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. శైవక్షేత్రాల్లోనే

1. శైవక్షేత్రాల్లోనే

Image source

కాలసర్ప నివారణ పూజలు శైవక్షేత్రాల్లోనే చేస్తారు. అందులోనూ పడమర నుంచి తూర్పునకు జలాలు ప్రవహించే ప్రాంతాల్లో ఈ పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే మిగిలిన శైవ క్షేత్రాలతో పోలిస్తే కాళహస్తి, కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయల్లోనే ప్రజలు ఎక్కువగా కాలసర్ఫ దోష నివారణ పూజలు చేయాలని భావిస్తుంటారు.

2. తుంగభద్ర నది

2. తుంగభద్ర నది

Image source

ఇక హంపిలోని విరూపక్ష దేవాలయం కూడా ఒక ప్రముఖ శైవక్షేత్రమే. ఇక్కడ పరమశివుడు విరాపాక్షుడి రూపంలో కొలవుదీరి ఉంటాడు. ఇక ఈ దేవాలయం పక్కనే తుంగభద్ర నది పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తూ ఉంటుంది.

3.అందుకే ఈ పూజలు

3.అందుకే ఈ పూజలు

Image source

వివాహంలో జాప్యం, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్య తదితర వాటితో బాధపడే వారు ఈ పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని హిందూ పురాణాలు చెబుతాయి. దీంతో చాలా మంది ఈ పూజలను చేయడానికి ఎక్కు వ ఆసక్తి చూపిస్తుంటారు. సినీ సెలబ్రెటీలు కూడా అప్పుడప్పుడు శైవ క్షేత్రాలను సందర్శించి అక్కడ కాలసర్ప నివారణ పూజలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.

4.ఎప్పుడెప్పడు చేస్తారు

4.ఎప్పుడెప్పడు చేస్తారు

Image source

హంపిలోని విరూపాక్ష దేవాలయంలో కాలసర్పదోశ నివారణ పూజలను శని, మంగళవారాల్లో రాహు కాలంలో చేస్తారు. ఈ పూజా కార్యక్రమాలు సుమారు గంట సేపు కొనసాగుతాయి. పూజకు ముందు తుంగభద్ర నదిలో స్నానం చేసి మడి దుస్తులతో పూజకు ఉపక్రమించాల్సి ఉంటుంది.

5.పూజకు ఏమేమి తీసుకెళ్లాలి

5.పూజకు ఏమేమి తీసుకెళ్లాలి

Image source

కాల సర్పదోశ నివారణ పూజకు అవసరమైనవన్నింటినీ స్థానిక పురోహితులే సమకూరుస్తారు. ఇందు కోసం రూ.1000 వరకూ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పూజలో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ లేదా విడివిడిగా కూడా ఈ పూజలో పాల్గొనవచ్చు.

6. ఇది విధానం

6. ఇది విధానం

Image source

నల్లని వస్త్రం పై మినుములు వేసి ఒక నాగ ప్రతిమను పెడుతారు. అదే విధంగా ఎరుపు వస్త్రం పై ఉలువులు వేసి మరో నాగప్రతిమను పెడుతారు. ఈ రెండు ప్రతిమలు రాహు, కేతువులకు ప్రతీకలు. పురోహితులు సుమారు గంటసేపు మనతో వాటికి పూజలు చేయిస్తారు. పూజలు పూర్తైన వెంటనే మనలను విరూపాక్ష, పాపాంబికే, భువనేశ్వరి అమ్మవార్లను దర్శించాల్సి ఉంటుంది. అనంతరం నదికి వెళ్లి పురోహితుడు ఇచ్చిన వస్తువులను అ నదిలో వదిలి వేయాల్సి ఉంటుంది. దీంతో కాల సర్ప దోశ నివారణ పూజలు పూర్తవుతుంది.

7.ఈ దేవాలయంలో ఇంకా ఏ ఏ పూజలు జరుగుతాయి

7.ఈ దేవాలయంలో ఇంకా ఏ ఏ పూజలు జరుగుతాయి

Image source

హంపిలోని విరూపాక్ష దేవాలయంలో ఫిబ్రవరి నెలలో రథోత్సవం బాగా జరుగుతుంది. అదే విధంగా శివరాత్రిన ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో విరూపక్షుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

8.తలక్రిందులుగా నీడ

8.తలక్రిందులుగా నీడ

Image source

ఈ విరూపక్ష దేవాలయంలో రాజ గోపురం నీడ తలక్రిందులుగా పడుతుంది. ఇందుకు గల కారణాలను ఎవరూ చెప్పలేక పోతున్నారు. సంవత్సరంలో ప్రతి రోజూ ఈ అద్భుతాన్ని మనం చూవచ్చు. అదే విధంగా ఉగాదినాడు సూర్య కిరణాలు ప్రధాన ఆలయంలో ఉన్న విరూపాక్షుడికి తాకుతాయి. ఇది విరూపాక్షుడి మహత్యంగా భక్తులు చెబుతుంటారు.

9.ఎక్కడ ఉంది

9.ఎక్కడ ఉంది

Image source

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో హంపి ఉంది. బళ్లారి నుంచి హంపికి దాదాపు రెండు గంటల ప్రయాణం. ఇక బెంగళూరు నుంచి హంపికి 376 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపు ఏడు గంటల ప్రయాణం. దేశంలోని వివిధ నగరాల నుంచి బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానసేవలు ఉన్నయి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హంపి చేరుకోవచ్చరు. బెంగళూరు నుంచి హొసపేటకు రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి హంపికి 13 కిలోమాటర్లు.

10 ఇంకా ఏమేమి చూడవచ్చు.

10 ఇంకా ఏమేమి చూడవచ్చు.

Image source

లక్ష్మినరసింహదేవాలయం, బళ్లారి కోట, కుమారస్వామి దేవాలయం మహానవమి దిబ్బ తదితరాలన్ని మనం హంపితో పాటు బళ్లారీలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు

Read more about: hampi, హంపి