Search
  • Follow NativePlanet
Share
» »పరమపావనమైన కాశీ క్షేత్రంతో సమానమైన ఈ క్షేత్రాన్ని సందర్శించారా?

పరమపావనమైన కాశీ క్షేత్రంతో సమానమైన ఈ క్షేత్రాన్ని సందర్శించారా?

కళశ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. కళశేశ్వర రూపంలో ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు.

కర్నాటకలోని కళశ క్షేత్రం గురించి తెలుసా? ఇక్కడే ఆ పరమశివుడు ఒక కళశం నుంచి ఉద్భవించి భక్తుల పాలిట కొంగుబంగారంలా విరాజిల్లుతున్నాడు. ఈ కళశ పుణ్యక్షేత్రం చుట్టూ ఎల్లప్పుడూ పచ్చదనంతో నిండిన పశ్చిమకనుమలు ఉండటంతో ఇది ప్రముఖ ధార్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకలోని కళశేశ్వర స్వామి దేవాలయం భారత దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం భద్రా నది ఒడ్డున ఉంది. ఇక్కడ వశిష్టమహర్షి, అగస్త్య మహర్షి తపస్సు చేశారని చెబుతారు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

మైత్రావణ్ర పేరు గల ఐదుగురు మునులు తమ తమస్సుకు అవసరమైన స్థలం కోసం వెదుకుతూ భద్రనది ఒడ్డుకు వస్తారు. ప్రస్తుతం కళశ క్షేత్రం ఉన్న ప్రాంతం వారికి నచ్చుతుంది. దీంతో అక్కడ తపస్సు చేయడం ప్రారంభిస్తారు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

అయితే మైత్రావణ్ర మునులు తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు అప్సరసను పంపిస్తాడు. అప్సరస ఆగమనంతో ఆ మునుల తపస్సు భగ్నమవుతుంది. అయితే ఆ మునుల తప:శక్తి వ`థా కాకూడదని దైవతలు ఒక కళశం స`ష్టించి అందులో ఆ శక్తిని దాస్తారు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

అటు పై పరమేశ్వరుడు తన శక్తిలో కొంత ఆ కళశంలోకి ప్రవేశపెట్టి దేవతల కోరిక మేరకు అక్కడే కొలువుండిపోతాడు. దీంతో ఇక్కడ కొలువై ఉండిన పరమేశ్వరుడిని కళశేశ్వరస్వామిగా పేర్కొన్నారు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

మహాద్వారానికి ఎదురుగా ఉన్న మెట్ల ద్వారం గుండా వెలితే శివుడి దర్శనం అవుతుంది. అక్కడే రెండు ఏనుగులు ఉంటాయి. వాటిని ఈశ్వరుడికి ప్రతి రూపంగా భావించి పూజలు కూడా చేస్తారు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

పర్వతీ పరమేశ్వరులకు జరిగిన వివాహం చూడటానికి ముక్కోటి దేవతలు భూమి పైకి ఒకేసారి వస్తారు. దీంతో భూమి ఒక వైపునకు కుంగిపోతుంది. దీంతో పరమేశ్వరుడి సూచనమేరకు అగస్త్య మహాముని భూమికి మరోవైపునకు వెలుతాడు. దీంతో భూమి మరలా తన స్థితికి చేరుకొంటుంది.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

అయితే అగస్త్య మహామునికి తాను ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహం చూడలేదన్న బాధ ఉండిపోతుంది. దీంతో ఈ కళశ క్షేత్రం నుంచే తమ వివాహాన్ని ప్రత్యక్ష్యంగా చూసే సదుపాయాన్ని ఈశ్వరుడు కల్పిస్తాడు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

ఇక్కడ ప్రతి ఏడాది మూడు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అవి రుద్రాభిషేకం, గిరిజా కళ్యాణం, కళేశ్వర జాత్ర. కాశీకి వెళ్లిన పుణ్యం ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల కలుగుతుందని చెబుతారు.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

భద్రనది పై ఒక చిన్న గుట్టమీద ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో హొయ్సళ శైలి కనిపిస్తుంది. దూరం నుంచి చూసేవారికి ఈ దేవాయ గోపురం ఒక కళశం ఆకారంలో కనిపించడం విశేషం.

కళశేశ్వర స్వామి, కళశ

కళశేశ్వర స్వామి, కళశ

P.C: You Tube

ఇక్కడ భక్తులు ఉండటానికి అవసరమైన వసతి గ`హం ఉంది. ఇందులో ఒకేసారి ఐదు వేల మంది సేదదీరవచ్చు. అదే విధంగా మధ్యహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకూ ఉచిత భోజన సదుపాయం ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X