Search
  • Follow NativePlanet
Share
» »శివలింగం రూపంలో ఉన్న దుర్గా పరమేశ్వరిని చూశారా?

శివలింగం రూపంలో ఉన్న దుర్గా పరమేశ్వరిని చూశారా?

కమలశిల దుర్గాపరమేశ్వరీ దేవాలయం హిందువులకు పరమ పవిత్రమైనది.

శివలింగం రూపంలో ఉన్న దేవతను చూశారా? చూడలేదంటే కుందాపురకు దగ్గర్లో ఉన్న కమలశిలకు ఒకసారి వెళ్లండి. కమలశిల ఉడిపి జిల్లాలోని కుందాపుర నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కమలశిల చుట్టూ అందమైన పర్వతాలు ఉన్నాయి. అంతేకాకుండా పచ్చని చెట్లు కూడా ఉంటాయి. కుబ్జా నది ఈ పుణ్యక్షేత్రం పక్కనుంచే వెలుతుంది

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

గ్రామం మధ్యభాగంలో ఉన్న ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ఈ ప్రాచీన దేవాలయాన్ని బ్రాహ్మీ దుర్గాపరమేశ్వరి దేవాలయం అని పిలుస్తారు. ఇక్కడ శివలింగం కొద్దిగ కమలం ఆకారంలో ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతానికి బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవాలయం అని పేరు.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

లక్ష్మీ, సరస్వతి, పార్వతీ కలయిక రూపమే ఈ బ్రహ్మీ దుర్గా పరమేశ్వరి రూపమని పేర్కొంటారు. పురాణాల ప్రకారం కైలాసంలో పింగళ అనే అందమైన నాట్యగత్తె ఉండేది. ఒకసారి గర్వంతో తాను నర్తించబోనని చెబుతుంది. దీంతో కోపగించుకొన్న పార్వతీ దేవి భూలోకంలో కురూపిగా జన్మించమని శపిస్తుంది.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

తన తప్పును తెలుసుకొన్న ఆ పింగళ తనకు శాపవిమోచనం కలిగించమని కోరుతుంది. తాను లోక కళ్యాణార్థం భూలోకానికి వస్తానని అప్పుడు నీకు శాపవిమోచనం కలిగించే మార్గం చెబుతానని పేర్కొంటుంది. దీంతో పింగళి భూలోకానికి చేరుకొంటుంది.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

ప్రస్తుతం కమలశిల ఉన్న ప్రాంతంలో సుపార్శగుహలో తపస్సు చేస్తూ కూర్చొండిపోతుంది. ఈ తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. అటు పై నీకు శాపవిమోచనం కలగాలంటే నీవు మధురకు వెళ్లాలి. నిన్ను ఆ శ్రీ క`ష్ణుడు తాకిన వెంటనే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెబుతారు.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

అంతేకాకుండా నీవు ఇన్ని రోజులు ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీ పేరు కుబ్జ పేరుతో ఒక నది ఇక్కడ పుట్టి ప్రవహిస్తుందని చెబుతుంది. అటు పై తాను కూడా ఇక్కడ శివలింగం రూపంలో వెలుస్తానని చెబుతుంది.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

అలా కుబ్జానది, ఆ నది ఒడ్డున శివలింగం రూపంలో బ్రాహ్మీ దుర్గాపరమేశ్వరీ దేవత వెలిశారు. అదేవిధంగా ఈ దేవత ఉన్న ఆలయ ప్రాంగణంలో గణపతి, హోసమ్మ దేవి, వీరభద్ర, ఈశ్వర మొదలైన దేవతలు నవగ్రహాలు, విష్ణ తదితర దేవతలు ఉన్నారు.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

P.C: You Tube

ఈ ప్రాంతాన్ని అప్పట్లో పరిపాలించిన హైదర్ఆలి, టిప్పుసుల్తాన్‌ల పేరును గౌరవ సూచకంగా ప్రతి సాయంకాలం సలామ్ పూజ పేరుతో విశేష పూజలను జరుపుతారు. అంతేకాకుండా ప్రతి ఏడాది రథోత్సవం ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు.

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

బ్రహ్మీ దుర్గాపరమేశ్వరి దేవస్థానం

కమలశిల సమీపంలో ఉన్న విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ రెండింటిమధ్య దూరం 125 కిలోమీటర్లు. అక్కడి నుంచి ప్రైవేట్ బస్ లేదా ట్యాక్సీ ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. కుందాపుర ఇక్కడికి దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X