Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయం సుప్రీం కోర్టుతో సమానం?

ఈ దేవాలయం సుప్రీం కోర్టుతో సమానం?

మంగళూరుకు దగ్గర్లో ఉన్న కథనూర్ నల్వార్ దేవాలయానికి సంబంధించిన కథనం.

కేరళ కర్నాటక ప్రజలు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. ఇక్కడి దేవాలయాన్ని కోర్టుగా భావిస్తారు. సుప్రీం కోర్టులో కూడా పరిష్కారానికి నోచుకోని కేసులు ఈ దేవాలయంలో పరిష్కరించబడుతాయని చెబుతారు. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. అటువంటి విభిన్న క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం...

ఆ క్షేత్రం ఏది

ఆ క్షేత్రం ఏది

P.C: You Tube

కర్నాటక సరిహద్దులోని కాసరగూడ్ లో ఉన్న ఈ క్షేత్రాన్ని కానత్తూరు అని పిలుస్తారు. స్థానికంగా కానత్తూర్ నాలుగు దేవతల క్షేత్రంగా పిలుస్తారు. ఈ క్షేత్రం పేరు వింటూనే కొంతమంది భయపడుతారు. అంతటి పవర్ ఫుల్ క్షేత్రం ఈ దేవాలయం.

రాంచిలో చూడదగినవి, తినదగినవి ఇవేరాంచిలో చూడదగినవి, తినదగినవి ఇవే

అబద్దం చెబితే మరణమే

అబద్దం చెబితే మరణమే

P.C: You Tube

విష్ణుమూర్తి, రక్తేశ్వరీ, రక్తచాముండి, ఉగ్రమూర్తి ప్రధాన దైవమూర్తులు. అందుకే ఈ క్షేత్రాన్ని నాలుగు దేవతల క్షేత్రంగా పిలుస్తారు. కోర్టులో ఎటువంటి పరిష్కారం లభించని క్షేత్రాలకు ఇక్కడ పరిష్కారం లభిస్తుందని చెబుతారు.

ప్రేతాత్మలకు విమోచనం

ప్రేతాత్మలకు విమోచనం

P.C: You Tube

ప్రేతాత్మల విమోచనం ఇక్కడ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి మాత్రమే ఆ సొమ్ము చేరుతుందని చెబుతారు. వివాహ సమస్యలకు కూడా ఈ క్షేత్రంలో పరిష్కారం లభిస్తుందని చెబుతారు. ఇటువంటి అనేక కేసులకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది.

ఈ క్షేత్రం నుంచే నోటీసు

ఈ క్షేత్రం నుంచే నోటీసు

P.C: You Tube

ఏదేని కేసుకు సంబంధించి కక్షిదారు ఈ క్షేత్రంలో ఫిర్యాదు చేస్తాడు. దీంతో ఆ క్షేత్రం నిర్వాహకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవతలి వైపువారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందిన తక్షణం నోటీసులో పేర్కొన్న రోజున ఇరువైపుల వారు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి రావాల్సి ఉంటుంది.

పార్వతీ దేవి నాట్యంలో ఓడిపోయింది ఇక్కడేపార్వతీ దేవి నాట్యంలో ఓడిపోయింది ఇక్కడే

తప్పు చేసిన వాడికి శిక్ష

తప్పు చేసిన వాడికి శిక్ష

P.C: You Tube

ఒకవేళ ఈ క్షేత్రం నుంచి వచ్చిన నోటీసుని నిర్లక్ష్యం చేస్తే ఈ క్షేత్రానికి సంబంధించిన నిర్వాహకులు మరో నోటీసును పంపుతారు. ఇలా మొత్తం మూడు నోటీసులను పంపుతారు. మూడు సార్లు నోటీసుకు స్పంధించకుంటే ఈ క్షేత్ర నిర్వాహకులు ఇక్కడి దేవతలకు చెబుతారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే నోటీసును నిర్లక్షం చేసినవారిని ఆ దేవుడే శిక్షిస్తాడు. ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

అన్ని కులాలు, మతాల వారు

అన్ని కులాలు, మతాల వారు

P.C: You Tube

హిందూ, ముస్లీం, క్రైస్తవులు ఇలా అన్ని రకాల కులాలు మతాలవారు ఈ క్షేత్రానికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వారు ఈ క్షేత్రంలో ఇచ్చే తీర్పును ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. లేదంటే ఖచ్చితంగా ఆ దేవతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

పాదరక్షలను కానుకగా తీసుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?పాదరక్షలను కానుకగా తీసుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

కడియాళి మహోత్సవం

కడియాళి మహోత్సవం

P.C: You Tube

ఈ క్షేత్రంలో కడియాళి మహోత్సవంలో దేవతలను నేరుగా చూడవచ్చు. కానత్తూరు క్షేత్రంలో ఈ నలుగురు దేవతలకు భూతారాధన చేస్తారు. ఇక్కడి సంప్రదాయాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

దేవుడి క`ప

దేవుడి క`ప

P.C: You Tube

ఇక్కడ జరిగే కళియాట నాట్యం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నాట్యం చేసేవారు ఒక వారం పాటు శాఖాహారాన్ని భుజిస్తారు. ఇక ఈ నాట్యం చేసే ముందు రోజు ద్రవ ఆహారాన్ని మాత్రం తీసుకొంటారు.

వీరికే మంగళ హారతులు

వీరికే మంగళ హారతులు

P.C: You Tube

వీరు ధరించే ఆభరణాలు, దుస్తులు చాలా బరువుగా ఉంటాయి. సామాన్యులు వాటిని మోయలేరని చెబుతారు. అందువల్లే ఈ నాట్యం చేసేవారిని దైవ సమానులుగా పూజిస్తారు. వీకి భక్తులు మంగళహారతులు ఇస్తారు.

ఇక్కడ లింగమయ్య ఆవు పొదుగు రక్తాన్ని అభిషేకంగా కోరుకొన్నాడు?ఇక్కడ లింగమయ్య ఆవు పొదుగు రక్తాన్ని అభిషేకంగా కోరుకొన్నాడు?

ముడుపులు ఖచ్చితంగా చెల్లించాలి

ముడుపులు ఖచ్చితంగా చెల్లించాలి

P.C: You Tube

సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ కోర్కెలు కోరిన వారు అవి తీరిన తర్వాత తప్పకుండా ముడుపులు చెల్లిస్తారు. ఈ ముడుపులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X