Search
  • Follow NativePlanet
Share
» »కమనీయ దృశ్యం ... కనిగిరి దుర్గం !

కమనీయ దృశ్యం ... కనిగిరి దుర్గం !

By Mohammad

రాజులు పోయినా, రాజ్యాలు పోయినా గత సంస్కృతి, వైభవాలకు ప్రతిరూపాలుగా నిలిచాయి చారిత్రక కట్టడాలు. ఇప్పట్లో కోట్లు వెచ్చించినా కట్టలేని అలాంటి కట్టడాలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వాటిని రేపటి తరానికి వారసత్వంగా అందించాల్సిన బాధ్యత ఎంతనైనా నేటి తరానికి ఉంది. అటువంటి కోవకు చెందినదే 'కనిగిరి' దుర్గం.

ప్రకృతితో దోబూచులాడే ఈ దుర్గం నాటి నుండి నేటి వరకు గత వైభవానికి గుర్తుంగా వెలుగొందుతుంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 80 కిలోమీటర్ల దూరంలో కనిగిరి దుర్గం కలదు. ఒకప్పుడు దీనిని కనకగిరి (బంగారుకొండ) అని పిలిచేవారు. దీని పూర్తి పేరు కనకగిరి విజయ మార్తాండ దుర్గము.

కనిగిరి దుర్గానికి వెళ్లే మార్గం

కనిగిరి దుర్గానికి వెళ్లే మార్గం

చిత్రకృప : Anil Adidam

చరిత్ర

కవి, రాజు నన్నె చోడుడు నెల్లూరులోని ఉదయగిరి ని పాలించేటప్పుడు కనిగిరి సమాంత రాజ్యంగా ఉండేది. క్రీ.శ. 13-14 వ శతాబ్దంలో యాదవ రాజైన కాటమరాజు, మనుమసిద్ధులను ఓడించి కనిగిరి ని పాలించాడని ప్రతీతి. అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు ఈ దుర్గాన్ని పాలించాడు.

<strong>భైరవకోన - అద్భుత గుహాలయాలు !</strong>భైరవకోన - అద్భుత గుహాలయాలు !

కనిగిరి కొండ పై నిర్మించిన చారిత్రక కట్టడాలతో ముఖ్యమైనవి : కనిగిరి కోట, బావులు, జీర్ణావస్థలో ఉన్న రెండు దేవాలయాలు. కొండపై చదరపు మైలు వరకు విశాలమైన చదును నేల ఉంది. అప్పట్లో ఇక్కడ ఒక పట్టణం ఉండేదని చెబుతారు.

కొండపైన దృశ్యం

కొండపైన దృశ్యం

చిత్రకృప : Anil Adidam

కనిగిరి దుర్గం లో చూడవలసినవి

కనిగిరి దుర్గంలో ఉన్న చెన్నముక్క బావి, సింగరప్ప దేవాలయాలు సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీరి కాలంలోనే నిర్మించిన కోటబురుజులు, ప్రహరీ, లోదుర్గంలోని మందుకొట్టాలు, చెన్నమ్మబావి, గుర్రపుశాలలు, ఏనుగుల బావి, మండాలు చరిత్ర మరవని దృశ్యాలు. మొదట్లో లోదుర్గం చుట్టూ 26 కిలోమీటర్ల మేర కోటగోడ ఉండేది. కానీ నేడు 20 కిలోమీటర్ల మేర ఉండి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది.

ప్రధాన ద్వారము

లోదుర్గానికి తూర్పు వైపున కోటగోడకి ఉన్న ప్రధాన ద్వారము

చిత్రకృప : Anil Adidam

ప్రధాన ద్వారం

బొగ్గుల గొంధి ప్రాంతంలో ఉన్న కోటగోడ ప్రధాన ద్వారం ద్వారా రాజులు రాకపోకలు సాగించేవారు. కోటకు నాలుగువైపులా ఉండే నాలుగు కోట బురుజుల్లో 3 బురుజులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. లోదుర్గంలోని దుర్గమ్మ గుడి, సీతారాముల గుడి నాడు కట్టించినవే. ఇవి గత వైభవాలకు గుర్తులుగా నిలిచాయి.

<strong>నెమలిగుండ్ల రంగనాయక ఆలయం కేరాఫ్ నల్లమల అడవి !</strong>నెమలిగుండ్ల రంగనాయక ఆలయం కేరాఫ్ నల్లమల అడవి !

కోటలోని ఇతర ఆకర్షణలు : మందుకొట్లు, మండెం, ఏనుగులబావి, గుర్రపుశాలలు, నీటి కొలనులు, సువిశాల ప్రాంగణం, కొలనులో నీటి చలమలు, తాబేలు రాయి, ఉగ్గుగిన్నె రాయి, డైనోసార్ రాయి, పాయు రాయి, చింతకాయ రాయి, అక్కాచెల్లెళ్ల రాయి, చేప రాయి మొదలైనవి.

దుర్గములోని ఆలయాలు

దుర్గములోని ఆలయాలు

చిత్రకృప : Anil Adidam

మందుల కొట్లు

40 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండే మూడు అరలుగల మందుల కొట్లు ఆనాటి రాజుల యుద్ధ సామర్ధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. కోటలో 2 కిలోమీటర్లు వ్యాపించి ఉండే నేలగొయ్యి, రహస్య గొయ్యి, నాగుల పొదలు సైతం నేటికి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

సందర్శకులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి దుర్గంను సందర్శిస్తున్నారు. వేసవికాలం, పబ్లిక్ హాలిడేస్, వారాంతంలో వీరికి తాకిడి అధికం. హైదరాబాద్, విజయవాడ మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సాహసికులు ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాలను చేపడుతుంటారు.

కొండ పై నుండి అద్భుత ప్రకృతి దృశ్యం

కొండ పై నుండి అద్భుత ప్రకృతి దృశ్యం

చిత్రకృప : Anil Adidam

కనిగిరి దుర్గానికి ఎలా చేరుకోవాలి ?

కనిగిరి దుర్గం నకిరేకల్ - మాచర్ల - తిరుపతి జాతీయ రహదారి పై, చెన్నై - విజయవాడ, బెంగళూరు - విజయవాడ హై వే మీద ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నుంచి బస్సులలో వచ్చి ఒంగోలు లో దిగి, అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులలో కనిగిరి చేరుకోవచ్చు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ బస్సు సర్వీసులు కనిగిరి కు ఉన్నాయి.

<strong>మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !</strong>మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !

సమీప రైల్వే స్టేషన్ లు : సింగరాయ కొండ (62 KM), దొనకొండ (50 KM), ప్రకాశం (80 KM).

సమీప విమానాశ్రయం : విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ (200 KM), తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X