Search
  • Follow NativePlanet
Share
» »ఈ శివలింగం విశిష్టత తెలుసా?

ఈ శివలింగం విశిష్టత తెలుసా?

కాంతారేశ్వర దేవాలయం హిందువులకు పరమ పవిత్రమైన దేవాలయం.

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అటువంటి కోవకు చెందినదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం. ఈ దేవాలయంలోని శివలింగం రోజుకు మూడుసార్లు తన రంగును మార్చుకొంటుంది. ఆ దేవాలయం ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్లాలి తదితర వివరాలన్నీ మీ కోసం...

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

రోజుకు మూడుసార్లు రంగును మార్చే శివలింగం ఉన్న దేవాలయం కాంతేశ్వర దేవాలయం. ఈ దేవాలయం ఉడిపి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పడుబిద్రి నుంచి కార్కళకకు వెళ్లే దారిలో కాంతావర అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

 రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

ఈ దేవాలయం ఉన్న ప్రాంతం గతంలో అటవీ ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలోని ప్రక`తి అందాలను చూసిన పార్వతి పరమేశ్వరులు కొద్ది కాలం ఇక్కడ ఉన్నరని స్థలపురాణం చెబుతుంది. కాలక్రమంలో అదే కాంతేశ్వర పుణ్యక్షేత్రంగా మారిపోయింది.

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

సుమారు ఏడో శతాబ్దంలో ఇక్కడ కాంతేశ్వరకు దేవాలయం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవాన్ని కాంతేశ్వర పేరుతో పిలుస్తారు. ఇక్కడ గణేశ, అణ్ణప్ప, అర్థనారీశ్వర తదితర ఉపాలయాలను కూడా మనం చూడొచ్చు.

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

అదేవిధంగా ఇక్కడ జంజవాత అనే రాక్షసుడు నివసించేవాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ తపస్సు చేసేవారిని హింసించేవారు. ఆ మునుల్లో ఒకరైన అంబరీశుడు ఆ రక్షసుడి నుంచి తమను కాపాడమని పరమశివుడని వేడుకొంటారు.

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

భక్తుడి కోరికమేరకు శివుడు ఆ రాక్షసుడిని సంహరించి మునులను కాపాడి ఇక్కడే శివలింగం రూపంలో కొలువై ఉండిపోతాడు. ఇక్కడి శివలింగం రోజులో మూడు సార్లు రంగులను మారుస్తుంది. ఉదయం తెల్లటి రంగులో ఉన్న శివలింగం మధ్యాహ్నం రాగి రంగులోకి సాయంత్రం బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఈ శివలింగం వజ్ర శిలతో తయారయ్యిందని చెబుతారు.

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

వ్యాపారంలో నష్టం రావడం, సంతానప్రాప్తి, కుటుంబ కలహాలు తదితర విషయాల్లో ఇబ్బందులు పడుతున్నవారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే ఉపశమనం కలుగుతుందని చెబుతారు. ఇక్కడి దేవాలయంలోని నంది విగ్రహం కూడా చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

ఈ కాంతేశ్వర సన్నిధానానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అంబరీషుడు తపస్సు చేసిన గుహ మనకు కనిపిస్తుంది. ఇక్కడే ఆ పరమేశ్వరుడు పార్వతీశుడికి దర్శనమిచ్చాడని చెబుతారు.

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

రంగులు మార్చే శివలింగం, ఉడిపి

P.C: You Tube

బెంగళూరు, మంగళూరు నుంచి ఉడిపికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. ఉడిపి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి ట్యాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ఉడిపికి కర్నాటకలోని వివిధ నగరాల నుంచి బస్సులు ఉన్నాయి. ఈ క్షేత్రానికి దగ్గర్లో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X