Search
  • Follow NativePlanet
Share
» »అత్యంత మహిమగల కార్యసిద్ది హనుమాన్: ఇక్కడ చెట్టుకు కొబ్బరికాయ కడితే మీకోరికలు 41 రోజుల్లోసిద్దిస్తాయి

అత్యంత మహిమగల కార్యసిద్ది హనుమాన్: ఇక్కడ చెట్టుకు కొబ్బరికాయ కడితే మీకోరికలు 41 రోజుల్లోసిద్దిస్తాయి

జీవితం ఆనందమయంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం కష్టమైనా కొన్ని కార్యాలను సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార పరమైన .. ఉద్యోగ పరమైన .. శుభకార్యాలకు సంబంధించిన కార్యాలను మొదలెడుతుంటారు. ఆ కార్యాలు సఫలీకృతం కావాలని ఎంతగానో ఆశపడుతుంటారు. అయితే తలపెట్టిన ఏ కార్యమైనా నెరవేరాలంటే, శక్తి సామర్థ్యాలు వుంటే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. ఆ శక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా వుండాలని కొంతమంది మాత్రమే గ్రహిస్తుంటారు.

ఏ కార్యాన్ని ఆరంభిస్తున్నా .. అనుగ్రహించమని ముందుగా భగవంతుడిని కోరుకోవాలనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాల్లోని కొన్ని ఘట్టాలు చెబుతున్నాయి. మహాబలవంతుడైన హనుమంతుడు కూడా, సీతమ్మవారి అన్వేషణ సమయంలో సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో దాటగలనని అనుకోలేదు. సముద్రాన్ని లంఘించడానికి ముందుగా ఆయన ఇంద్రాది దేవతలను పూజించి, కార్యసిద్ధి కలిగేలా అనుగ్రహించమని ప్రార్ధించి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు తనకి అప్పగించిన కార్యాన్ని సాధించగలిగాడు.

రామ కథా గానంలో తన్మయుడు, శివాంశ సంభూతుడు, రాక్షసాంతకుడు మారుతి. మనోజవుడు, వాయువేగుడు, ఇంద్రియవిజేత, బుద్ధిమంతుడు వాయునందుడు, వానర సేనలో ముఖ్యుడు, శ్రీరామదూత అయన ఆంజనేయ స్వామిని స్మరించడం వలన బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, భయం లేకుండుట, రోగాలు లేకుండా, పటిష్టమైన వాక్కు లభిస్తాయ. నలభై ఒక్క రోజుల పాటు- స్వామివారి తోకకు రోజుకొక చందనపూత పూసి, కుంకుమ బొట్టు చొప్పున పెట్టి పూజిస్తే, నలభై రోజుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. అలా హనుమంతునకి అంకితం చేసి ఒక ప్రత్యేక ఆలయం గిరినగర్ లో ప్రసిద్ది చెందినది.

కర్ణాటక రాష్ట్రంలో హనుమంతుని దేవాలయాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో బెంగళూరు గిరినగర్ లో ఉన్న ఈ ఆలయాన్ని హనుమంతునికి అంకితం చేయబడినది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ దేవాలయంలో మీరు భక్తితో ఏకోరిక కోరినా నెరవేరుతాయి. మరి ఈ ప్రత్యేకమైన హనుమంతుని ఆలయం విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ దేవాలయం ఎక్కడ ఉంది

ఈ దేవాలయం ఎక్కడ ఉంది

కర్ణాటకలో బెంగుళూర్ నైరుతి దిక్కున గిరినగర్ గుడియ నోదురన్నలో దత్తపీఠం లో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఉంది. రోజూ వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. భక్తితో ఈ హనుమాన్ ను కొలిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.

PC: youtube

కార్యసిద్ది హనుమాన్ దేవాలయంలో కొబ్బరి కాయలు కట్టడం:

కార్యసిద్ది హనుమాన్ దేవాలయంలో కొబ్బరి కాయలు కట్టడం:

ఈ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కట్టే ఆచారం ఒకటి ఉంది. ఈ హనుమాన్ ను దర్శించడానికి వచ్చే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి కార్యాలు నెరవేర్చుకోవడానికి కొబ్బరికాయలను సంకల్పతో కడతారు. ఇలా కట్టడం వెనకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.

PC: youtube

పూర్ణ ఫలం:

పూర్ణ ఫలం:

కొబ్బరి కాయను పూర్ణ ఫలంగా పిలుస్తారు. ఇలా దేవాలయంలో మొక్కుకుని కొబ్బరియా కట్టి ప్రదక్షిణలు చేయడం వల్ల అంతా మంచి జరగుతుంది. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు కొబ్బరియాను అక్కడే కౌంటర్లో తీసుకుని అక్కడే కౌంటర్లో ఇస్తే , ఆ కొబ్బరికాయపై రోజు మరియు తేదీని నమోదుచేస్తారు. తర్వాత వారు ఆ కొబ్బరి కాయ తీసుకుని దేవుని ఎదుట కూర్చొని భక్తితో కోరికను మనస్సులో సంకల్పం చేసుకోవాలి.

PC: youtube

ప్రదక్షిణ

ప్రదక్షిణ

సంకల్పం చేసుకున్న తర్వాత దేవాలయ ప్రదక్షణ చేయాలి. ప్రదక్షిణ తర్వాత అక్కడ నిర్దేశించిన స్థలంలో కట్టాలి. 16వ రోజు, 41 రోజులు , 4రోజులు, ఇలా సూచించిన ప్రకారం ప్రదక్షిణలు చేసి , తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం చేసి తినాలి. ఇలా చేయడం వల్ల కోరిక కోర్కెలు , కార్యసిద్ది దాల్చుతుంది.

PC: youtube

దేవుళ్లు

దేవుళ్లు

ఈ దేవాలయంలో దత్తాత్రేయ, శివుడు, గణపతి మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి.. ఈ దేవాలయం అవధూత దట్టమైన పీఠాలచే నడపడుతోంది. శ్రీ గణపతి సచ్ఛిదానంద స్వామీజీ చేత ఇక్కడ హనుమంతున్ని ప్రతిస్టించడం జరిగింది.

PC: youtube

ఆకు పూజ:

ఆకు పూజ:

ప్రతి శుక్రవారం ఆకు పూజ జరుపుతారు. ఈ పూజలో ముత్తైదువులు పాల్గొంటారు. ఇక్కడ హనుమంతునికి భక్తులకు ఆకులతో తయారుచేసిన హారాలను అందిస్తారు.

మంగళవారం, శనివారాలలో విశేష పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి నాడు "హనుమద్వ్రతం " ఆ రోజున హనుమంతుడు సీతాదేవిని దర్శించాడు. అందుచే ఆ రోజు హనుమంతుని పూజించిన వారి కోర్కెలు నెరవేరి సకల దుఃఖములు నివృత్తియగునని సీతమ్మ తల్లి వరమొసంగించింది .

PC: youtube

నిత్య పూజ:

నిత్య పూజ:

ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్ర సమయాల్లో శ్రీ కార్యసిద్ధి హనుమంతునికి సింధూర పూజ, నిత్య పూజ మరియు హారతి అభిషేకాలు నిత్యం జరుగురతాయి. అలాగే ప్రసాదాలను భక్తులకు పంచబడుతుంది. అలాగే ప్రతి నిత్యం సాయంత్రం మంగళహారతి ఇచ్చి, తర్వాత ప్రసాదంను భక్తులకు అందజేస్తారు.

PC: youtube

హనుమజయంతి :

హనుమజయంతి :

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు 12 రోజుల పాటు జరుపుతారు. ఈ సమయంలో సుమారు 35000 మంది భక్తులు ఈ దేవాలయంను సందర్శిస్తారు.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X