Search
  • Follow NativePlanet
Share
» »ఖీచన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !!

ఖీచన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !!

By Mohammad

రాజస్తాన్ లోని జోధ్‌పూర్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారి గ్రామమే ఖీచన్. 4.5 కిలోమీటర్ల దూరంలో వున్న ఫలోదీ ఈ గ్రామానికి సమీప పట్టణ౦. గత కొన్నేళ్ళుగా ఈ గ్రామం ప్రతి ఏడాది ఇక్కడకు వచ్చే అందమైన డేమాయిసేల్లె కొంగలకు ఆతిధ్యమిచ్చే ఒరవడిని అలవర్చుకున్నది. ఖీచన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు విషయానికి వస్తే ..

ఇది కూడా చదవండి : జోధ్‌పూర్ నీలివర్ణపు అద్భుత గాధ !

ఖీచన్ పక్షుల అభయారణ్యం ఖీచన్ గ్రామంలోని ప్రధాన ఆకర్షణ. ఇది ఒక వలస పక్షుల నివాసంగా చెప్పవచ్చు. ఈ అభయారణ్యంలో ఐరోపా నైరుతి ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతం, పోలాండ్, యుక్రెయిన్, కజకిస్తాన్, ఉత్తర దక్షిణ ఆఫ్రికా, మంగోలియా నుండి వచ్చే మూడు రకాల కుర్జన్, కర్కర, కుంచ అనే పక్షుల రకాలు ఉన్నాయి.

ఖీచన్ : కొంగల ఎడారి గ్రామం !

కుంట వద్ద దాహార్తి తీర్చుకుంటున్న డేమాయిసేల్లె కొంగలు

చిత్ర కృప : Marco Duyves

ఐరోపా ఖండంలోని శీతాకాలపు చలి నుండి తప్పించుకోవడానికి భారత దేశానికి వలస వచ్చే ఈ పక్షులను అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్య కాలంలో ఈ అభయారణ్యంలో చూడవచ్చు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ఈ పక్షులు భారతదేశానికి వచ్చినప్పటికీ, కేవలం 4 - 5 వేలు మాత్రమే ఖీచన్లోని ఈ పక్షుల అభయారణ్యానికి వస్తాయి.

కుర్- కుర్ అనే ఒక విలక్షణమైన ధ్వని చేసే కుర్జన్, 4 - 6 కిలోల బరువుతో మూడు అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇవి చేసే ఈ విలక్షణమైన ధ్వని వలన స్థానిక భాషలో వీటిని కుర్జన్ అని పిలుస్తారు. ఈ పక్షికి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఎక్కువ దూరాలకు ఎగరగల సామర్ధ్యం ఉంది. కుర్జన్ లకు గల విలక్షణమైన లక్షణాల వలన ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి.

ఖీచన్ : కొంగల ఎడారి గ్రామం !

ఎక్కువ దూరాలకు ఎగరగల సామర్ధ్యం గల కుర్జన్

చిత్ర కృప : Cornelis Bakker

డేమాయిసేల్లె కొంగల పుట్టుక

కొన్నేళ్ళ క్రితం స్థానిక ప్రజలు కొంత మంది మార్వాడి సమాజంలోని ఒక పక్షి ప్రేమికునితో కలసి ఈ పక్షులకు ప్రతి ఉదయం గింజలు తినిపించడం ప్రారంభించారు. ఫలితంగా భారీ సంఖ్యలో స్థానికంగా కుర్జాస్ అని పిలిచే డేమాయిసేల్లె కొంగలు ఆకర్షితమయ్యాయి. అప్పటి నుండి ఈ పక్షులకు గింజలు తినిపించే ధోరణి కొనసాగింది. ప్రస్తుతం, ఖీచన్ లో రోజుకు 5000 కిలోల గింజలు పక్షుల కోసం వినియోగిస్తున్నారు.

ఖీచన్ : కొంగల ఎడారి గ్రామం !

కుర్జ సంరక్షణ వికాస సంస్థ

చిత్ర కృప : naturgucker.de / enjoynature.net

ఖీచన్ లో ఇంకా ఏమి చూడవచ్చు ??

పర్యాటకులు, స్థానిక ప్రజలు ఇచ్చే నగదు విరాళాలతో ఖీచన్లో ఏర్పాటైన కుర్జ సంరక్షణ వికాస సంస్థ, పక్షి చుఘ ఘర్ ఈ వలస పక్షుల భద్రత, రక్షణ నిర్వహిస్తుంది. ఈ పక్షులను రక్షించే ధ్యేయంతో మార్వారీ కొంగల ఫౌండేషన్ ను కూడా నెలకొల్పారు.

ఖీచన్ ఎలా చేరుకోవాలి ?

ఖీచన్ కు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం : జోధ్‌పూర్ విమానశ్రయం, ఖీచన్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి ట్యాక్సీ ల ద్వారా ఖీచన్ కు చేరుకోవచ్చు. ఈ ఏర్ పోర్ట్ న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, జైపూర్ సంగనేర్ విమానాశ్రయం తో బాగా అనుసంధానించబడింది.

రైలు మార్గం : ఫలోది రైల్వేస్టేషన్, ఖీచన్ కు సమీపంలో 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ ఢిల్లీ - జేవాకర్, బికనేర్ - జైసల్మేర్ ల బ్రాడ్ గేజ్ లైన్ మార్గంలో ఉంది. ఈ రైల్వేస్టేషన్ నుండి జోధ్‌పూర్, జైసల్మేర్, ఢిల్లీ లకు రైళ్ళు ఉన్నాయి.

రోడ్డు మార్గం : ఖీచన్, రాజస్తాన్ లోని ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు మార్గాన్ని కల్గిఉంది. జోధ్‌పూర్ నుండి ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ బస్సుల్లో ఎక్కి ఖీచన్ చేరుకోవచ్చు. సమీప పట్టణమైన ఫలోది నుండి ఆటో రిక్షాలు, ప్రవేట్ వాహనాలు సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి.

ఖీచన్ : కొంగల ఎడారి గ్రామం !

ఖీచర్ రైలు మార్గం

చిత్ర కృప : Daniel Villafruela.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X