Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళ్లండి చౌడేశ్వరీ అనుగ్రహం పొందండి?

ఇక్కడికి వెళ్లండి చౌడేశ్వరీ అనుగ్రహం పొందండి?

కోలారు చౌడేశ్వరీ దేవాలయం గురించి కథనం.

ఇక్కడ ప్రజలు ఈ దేవత చాలా మహిమకలిగిన దేవతగా నమ్ముతారు. వేపచెట్టులో అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఇక్కడి అమ్మవారిని మన:స్ఫూర్తిగా వేడుకొంటే కోర్కెలు తీరుతాయని స్థానికులు చెబుతారు. ఇటువంటి దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం....

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

P.C: You Tube

కోలారు జిల్లా బెగ్గలి హోసళ్లి గ్రామంలోనే ఈ అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడి అమ్మవారిని చౌడేశ్వరీ దేవిగా కొలుస్తారు. బెంగళూరు నుంచి కోలారు వెళ్లే మార్గంలో ఈ దేవాలయం వస్తుంది.

 చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

P.C: You Tube
వందల ఏళ్లు క్రితం నిర్మించిన ఈ దేవాలయంలో చౌడేశ్వరీ విగ్రహంతో పాటు సప్తమాత`కల విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా పురాతనమైన ఈ దేవాలయాన్ని పడగొట్టి నూతన మంటపాన్ని నిర్మించాలని
గ్రామస్తులు అనుకొన్నా నెరవేరలేదు.

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

P.C: You Tube
చివరికి బైయణ్ణ అనే వ్యక్తి అమ్మవారిని వేడుకొంటే అమ్మవారు ఆయన కలలో వచ్చారు. అటు పై తనకు దేవాలయంతో పాటు మంటపాన్ని ఎలా నిర్మాంచాలో చెప్పారు. దాని ప్రకారమే దేవాలయాన్ని, మంటపాన్ని నిర్మించారు.

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

P.C: You Tube

అయితే పాత విగ్రహాన్ని ధర్మస్థలంలోని నేత్రావతి నదిలో వదలాలని నిర్ణయించారు. అయితే నూతన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించడానికి వెళితే అమ్మవారు గర్భగుడిలోకి వెళ్లలేదని చెబుతారు.

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

చౌడేశ్వరీ దేవాలయం, కోలారు

P.C: You Tube
అటు పై అశరీర వాణి ద్వారా పాత విగ్రహాన్ని నదిలో వదలకూడదని అక్కడే ఉన్న వేపచెట్టు తొర్రలో ఉంచాలని అమ్మవారు చెప్పారు. భక్తులు కూడా అదేవిధంగా చేశారు. అందుకే ఈ దేవాలయంలో మనకు రెండు అమ్మవారి విగ్రహాలు కనిపిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X