» » కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ !

కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ !

Posted By:

కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 1 వ తేదీ నుండి 5 వ తేదీ వరకూ జరుగుతుంది. కోణార్క్ ఓడిషా లోని పూరి జిల్లా లో కలదు. ఈ డాన్స్ ఫెస్టివల్ కు దేశంలోని వివిధ ప్రదేశాలనుండి కళాకారులు కోణార్క్ కు తరలి రావటంతో కోణార్క్ మరోసారి జీవం పోసుకుంటుంది. అరుదైన ఈ నృత్య పండుగలో కళాకారులు వారి ప్రతిభలను చాటుకుంటారు. వివిధ రకాల నృత్యాలు చేసి వారు ఆనందించి ప్రజలను ఆనందింప చేస్తారు. అన్నిటి కంటే అద్భుతంగా చేసేది వారి ఓడిషా డాన్స్ ఒడిస్సీ. కోణార్క్ లో 13 వ శతాబ్దం నాటి సూర్య దేవుడి టెంపుల్ కలదు. దీనిని తూర్పు గంగ వంశానికి చెందిన ఒకటవ నరసింహ దేవ నిర్మించారు. ఈ టెంపుల్ ను సూర్య దేవుడికి రధంగా వివిధ అందమైన చెక్కడాలతో నిర్మించారు. అందమైన ఈ కళాఖండాన్ని నిర్మించేందుకు 13 సుదీర్ఘ సంవత్సరాల కాలం పట్టింది.


దీని నిర్మాణంలో సుమారు 1200 మంది శిల్పులు పాల్గొన్నారు. నేడు మనం చూసేది 13 వ శతాబ్దం నాటి కళా ఖండంలో సగం మాత్రమే. అయితే దీనిలోని నటరాజ మందిరం లేదా డాన్స్ హాల్ మాత్రం చెక్కు చెదరకుండా నేటి వార్షిక కోణార్క్ ఫెస్టివల్ కు అవకాశం కల్పిస్తోంది. ఈ అపురూప రాతి సన్ టెంపుల్ రధాన్ని సందర్శించిన మహాకవి శ్రీ రవీంద్ర నాథ్ టాగోర్ 'ఇక్కడ కల రాతి భాష మానవ భాష కంటే కూడా గొప్పది ' అని కీర్తించారు. నేటికి దాని అవసేషాలలో ఆ మాట వాస్తవంగా వుంటుంది. పన్నెండు రాతి చక్రాలు, పన్నెండు స్తంభాలు, ఏడు జతల గుర్రాలు ఈ టెంపుల్ నిర్మాణంలో భాగాలు. మీరు ఊహించిన ప్రతి ఒడిస్సీ నాట్య భంగిమ, వందల కొలది అపురూప చెక్కడాలు ఇక్కడ మీరు చూడవచ్చు. శిధిలమైన శిల్పాలను అర్కేయోలాజికల్ సర్వే అఫ్ ఇండియా శాఖ కోణార్క్ అర్కియోలాజికల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినది.

ఇంతటి గొప్పవైన కళా ఖండాల నడుమ సూర్య దేవాలయ నేపధ్యంలో ఒక చక్కని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లో కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ గొప్ప ప్రదర్శనలో తన నృత్యాన్ని ప్రదర్శించాలని ప్రతి కళాకారుడు ఉవ్విళ్ళూరు తూంటాడు. ఒరిస్సా ప్రభుత్వం, వారికి ప్రవేశం కల్పించి, ఒడిస్సీ, భారత నాట్యం, మణిపురి, కథక్, చౌ డాన్స్ ప్రోగ్రాం లు నిర్వహిస్తుంది. ప్రపంచ పర్యాటకతను ప్రోత్సహిస్తూ వివిధ కళా వస్తువుల మేళాలు కూడా నిర్వహిస్తుంది. రుచికరమైన స్థానిక ఆహారాలను సేవిస్తూ అద్భుతమైన ఈ నృత్య గీతాల ప్రోగ్రాం లను తనివి తీరా ఆస్వాదించి ఆనందించ వచ్చు.
 కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ !

ఇదే సమయంలో డాన్స్ ఫెస్టివల్ తో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన 'సాండ్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్' కూడా నిర్వహిస్తారు. ఈ పండుగ కూడా ప్రపంచ కళాకారుల ప్రతిభా ప్రదర్శన కలిగి వుంటుంది. ఓడిషా , ఇండియాలో ఒక వేగంగా ఆభివృద్ధి చెందే రాష్ట్రం. కోణార్క్ పూరి నుండి 35 కి. మీ. లు ఒడిష కేపిటల్ అయిన భువనేశ్వర్ సిటీ నుండి సుమారు 65 కి. మీ. ల దూరం కలదు. అక్కడకు చేరేందుకు రవాణా సదుపాయాల అనేకం కలవు. ఈ నాట్య భంగిమల పండుగ లో పాల్గొని ఆనందించేందుకు ముందుగానే మీ ప్రణాలికను సిద్ధం చేసుకోండి.
Please Wait while comments are loading...