Search
  • Follow NativePlanet
Share
» »కృష్ణాబాయి దేవాలయంలో గోముఖ తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి..

కృష్ణాబాయి దేవాలయంలో గోముఖ తీర్థంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి..

నదీతీరం పొడవునా తీర్థాల..! దేవుళ్లతో సమానంగా జీవ నదుల్నీ పూజించారు మన పూర్వికులు. అందుకే, పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ నదుల ఒడ్డునే వెలిశాయి. ఇక, మహాబలేశ్వరం నుంచి హంసలదీవి వరకూ కృష్ణమ్మ ప్రవాహాన్ని ఆనుకుని ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉండటం ఒక విశేషమైతే కృష్ణానది పేరుతోనే ఓ ఆలయం ఉండటం మరింత విశేషం. ఇవి... నదుల ఆలయాలు మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోటే ఓ ఆలయం ఉంది. అందులో చెక్కిన గోవు ముఖంలోనుంచి వచ్చే నీటి ధారే కొండలూ కోనలూ దాటి కృష్ణానదిగా ప్రవహిస్తుంది. నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతాయి. కానీ కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. మరి ఈ పవిత్ర ప్రదేశం యొక్క విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

1. కృష్ణానది:

1. కృష్ణానది:

కృష్ణానది మహారాష్ట్రంలోని మహాబలేశ్వరం మహాదేవుని ఆలయం వద్దగల గోముఖం నుండి వెలువడుతుంది. ఈ ప్రదేశం ఎంతో పరమ పవిత్రమైనది. ఇక్కడ కృష్ణానదిని కృష్ణాబాయి అని పిలుస్తారు. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ, వేణీ, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు సంగమిస్తాయని నమ్మకం. ఈ గుడిలోని గోముఖం నుంచి వచ్చే ధార ఆ అయిదు నదులకూ ప్రతిరూపమని చెబుతారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు.

2. గోముఖం నుండి:

2. గోముఖం నుండి:

ఈ గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణానది అతివేగంతో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూలగా నుండి నలభై అయిదుమైళ్ళ ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూలగా నుండి నలభై అయిదుమైళ్ళు ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్రం గుండా మరో పదిమైళ్ళ సాగి వేణీ నదిని కలుపకుని కృష్ణవేణీనదిగా ఖ్యాతి చెందినది. తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150మైళ్ళు ప్రవహించిన కృష్ణనది కర్ణాటకలో కలుస్తుంది.

3. మహబలేశ్వరంలోని కొండమీదున్న కృష్ణవేణి

3. మహబలేశ్వరంలోని కొండమీదున్న కృష్ణవేణి

మహబలేశ్వరంలోని కొండమీదున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుంచి వెలువడే నీటిధార సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మహబలేశ్వరంలోని కొండమీదున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుంచి వెలువడే నీటిధార సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

4. అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను పవిత్రజలంగా భావించి

4. అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను పవిత్రజలంగా భావించి

అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను పవిత్రజలంగా భావించి, భక్తులు తలపై చల్లుకుంటారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళ్తే ఆలయాల కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘వై' అనీ, ‘వాయి' అనీ పిలుస్తారు.వాయిలో దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది.

5. ఇక్కడ వందకు పైగా దేవాలయాలున్నాయి

5. ఇక్కడ వందకు పైగా దేవాలయాలున్నాయి

ఇక్కడ వందకు పైగా దేవాలయాలున్నాయి. అన్నీ ప్రముఖ ఆలయాలతో కొలువుతీరి ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిలో గణపతి ఘాట్‌ దగ్గరున్నవాటిలో దాదాపు 10 అడుగుల ఎత్తున్న గణేశుని విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే. ఈ ఆలయాలలో ఒక ఆలయాన్ని మహారాష్ట్రకు చెందిన గణపతిరావు భికాజీ అనే భక్తుడు క్రీ.శ. 1762లో నిర్మించాడని టూరిస్టు గైడ్లు వివరిస్తుంటారు. ఇక్కడి కాశీవిశ్వేశ్వరాలయం కూడా దర్శనీయ స్థలమే.

6. సంగమేశ్వరం... ముక్తిప్రదాయకం

6. సంగమేశ్వరం... ముక్తిప్రదాయకం

ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ప్రముఖమైందే. సంగమేశ్వరం... ముక్తిప్రదాయకం! కృష్ణ, మలప్రభ, ఘటప్రభ నదుల సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ‘కూడల సంగమ' కర్ణాటకలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి. బెంగళూరుకి సుమారు 450 కి.మీ దూరంలో ఉన్న ఈ సంగమేశ్వరాలయం వీరశైవులకు పుణ్యక్షేత్రంగా ఖ్యాతికెక్కింది. దీన్ని పదో శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.

7. సిద్ధపురుషుడూ అయిన బసవేశ్వరుడు

7. సిద్ధపురుషుడూ అయిన బసవేశ్వరుడు

పన్నెండో శతాబ్దపు సంఘ సంస్కర్త, సిద్ధపురుషుడూ అయిన బసవేశ్వరుడు ఇక్కడే శివుడి గురించి తపస్సు చేసి, శివునిలో ఐక్యమైనట్లు స్థల పురాణం చెబుతోంది. భక్తులు మూడు నదుల సంగమంలో స్నానాదులు చేసి ఈ స్వామిని భక్తితో పూజిస్తే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. ఏటా జనవరిలో బసవ క్రాంతి సందర్భంగా ఇక్కడ శరణ మేళా జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచీ వీరశైవులు వస్తుంటారు.

8. శ్రీక్షేత్ర మహూలీ దేవాలయాలు కూడా చరిత్ర ప్రసిద్ధి

8. శ్రీక్షేత్ర మహూలీ దేవాలయాలు కూడా చరిత్ర ప్రసిద్ధి

సతారా జిల్లాలో గల సంగం మహూలీ, శ్రీక్షేత్ర మహూలీ దేవాలయాలు కూడా చరిత్ర ప్రసిద్ధి గాంచినవే. కృష్ణా, వెణ్ణా నదుల సంగమ స్థానమైన శ్రీక్షేత్ర మహూలీలో సంగమేశ్వర, విశ్వేశ్వర, రామేశ్వర దేవాలయాలు వాస్తు శిల్ప రీత్యా దర్శనీయ క్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. ఇవి మధ్యభారత వాస్తు శైలిలో క్రీ.శ. 14వ శతాబ్దిలో నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. శివాజీపై బీజాపూరు సుల్తాన్‌ దాడి చేసినప్పుడు కృష్ణవేణీ మాత శివాజీకి విజయం చేకూర్చిందని ఒక నమ్మకం ఉంది. అందుకు కృతజ్ఞతగా ఏటా ఇక్కడ కృష్ణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

9. రాగితో పోతపోసిన గణపతి

9. రాగితో పోతపోసిన గణపతి

తర్వాత కృష్ణమ్మ తూర్పు దిశగా సాంగ్లి, నరసోబాడీల గుండా ప్రవహిస్తుంది. సాంగ్లీలో ధోర్లే చింతామణిరావు పట్వర్థన్‌ క్రీ.శ. 1843లో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించి, అందులో రాగితో పోతపోసిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాని తరువాత కొల్హాపూర్‌ తాలూకాలోని నరసింహవాడి (నరసోబాడీ)లో శ్రీనరసింహస్వామి దత్త దేవాలయం మరో దర్శనీయ క్షేత్రం. అక్కడ మేడిచెట్టు కిందున్న నరసింహ సరస్వతి దత్తస్వామి పాదాలను భక్తులు పూజిస్తారు.

10 ఎలా వెళ్లాలి:

10 ఎలా వెళ్లాలి:

మహాబలేశ్వరం వాయి నుండి 32 కిలోమీటర్ల దూరం ఉంది . ఇది రాజ్య రాజధాని ముంబాయ్ నుండి సుమారు 260కిమీ దూరంలో ఉంది. సమీపంలో ప్రముఖ నగరం సతారా నుుండి 45కి.మీ దూరంలో ఉంది మరియు పూనే నుండి 120కిమీ దూరం. మహాబలేశ్వర రాష్ట్ర రహదారి 4 నుండి ప్రయాణించవచ్చు. నగరంలో పూనే, ముంబై, సాంగ్లి మరియు సతార నుండి ఎంఎస్ఆర్టిసి బస్సు సర్వీసులున్నాయి. మహాబాలేశ్వర్ కానీ వాయ్ కానీ చేరుకోవాలంటే పూణే లేక ముంబై లో దిగి అక్కడి నుండి కార్ లేక బస్సులో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రతి అరగంటకి స్వార్గేట్ లేక పూణే స్టేషన్ నుండి బస్సులు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X