Search
  • Follow NativePlanet
Share
» »గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ పొడవైన కోట గోడ మన ఇండియాలోనే: కుంభాల్ ఘర్ కోట

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ పొడవైన కోట గోడ మన ఇండియాలోనే: కుంభాల్ ఘర్ కోట

మన ఇండియాలోని రాజస్థాన్‌ అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేది ఎడారి, ఇసుక తిన్నెలే. అయితే అక్కడికి వెళ్లి చూస్తే మాత్రం, ఎడారులతో పాటు ఒక్కసారిగా మనల్ని పురాతన కాలంలోకి తీసుకువెళ్లిపోయే రాజసం ఉట్టిపడే రాజరికపు కోటలు, చారిత్రాత్మక నిర్మాణాలు, అలనాటి శిల్పకళా రూపాలు దర్శనమిస్తాయి. ఇవన్నీ చూస్తుంటే ఆనాటి పాలకుల విలాసవంత జీవితం మన ఊహల్లో కదలాడుతుందంటే ఆశ్చర్యం కలగకమానదు. రాజస్థాన్‌కి ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. మొత్తానికి యునెస్కో వారిచే వారసత్వ సంపదకు పెట్టింది పేరుగా నిలుస్తోంది ఈ రాష్ట్రం. కంటికింపైన చారిత్రక కట్టడాలతో పాటు మనసుని మరో లోకంలోకి తీసుకెళ్లే గతకాలపు రాచరికపు కోటలు ఇవన్నీ చూడాలంటే రాజస్థాన్‌కి వెళ్లాల్సిందే...

రాజస్థాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్

రాజస్థాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్

రాజస్థాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం రాష్ట్రంలో దక్షిణ సరిహద్దు భాగంలో మేవార్‌ నది ఒడ్డున ఉంది. ఆరావళి ప్రాంతంలో సుమారు 36 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది కుంభాల్‌ ఘర్‌ కోట. దీనిని స్థానికులు కుంభాల్ మేర్ అని కూడ పిలుస్తుంటారు. రాజస్తాన్ రాష్ట్రంలో కుంభాల్ ఘర్ కోట రెండవ ప్రసిద్ధి చెందిన కోట. దీనిని 15వ శతాబ్ధంలో మహారాణా కుంభా మహారాజు నిర్మించారు.

మహరాణా కుంభ సామ్రాజ్యం రత్తంబోరు నుండి గ్వాలియర్ వరకు

మహరాణా కుంభ సామ్రాజ్యం రత్తంబోరు నుండి గ్వాలియర్ వరకు

మహరాణా కుంభ సామ్రాజ్యం రత్తంబోరు నుండి గ్వాలియర్ వరకు విస్తరించి ఉండేది.ఈ గోడ 36 kms విస్తరించింది. ఈ కోట ఎత్తైన కోటగోడ శత్రువులను నుండి రక్షించుకునేందుకు నిర్మించబడినది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ అతి పొడవైన కోట గోడగా చెబుతుంటారు. ఈ కోటను అతి పటిష్టమైన కోటగానూ మరియు అతి విశాలమైన కోటగానూ అభివర్ణిస్తారు చరిత్రకారులు . సముద్ర మట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తులో నిర్మించారు.

రాజస్థాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే కుంభాల్ ఘర్ లో

రాజస్థాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే కుంభాల్ ఘర్ లో

మేఘాల ప్యాలెస్ రాజస్థాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. ఇందులోనే మహారాణా ఫతేసింగ్‌ నిర్మించిన గోపుర ప్యాలెస్‌ ఉంది. వాటిలో బాదల్ మహాల్ ఒకటి.దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్ధనా మహాల్ మరియు జనానా మహాల్ అనేవి కూడా ఉన్నాయి. ప్యాలెస్ లోని సుందరమైన గదులు రంగు రంగుల కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి.

ఈ భారీ కోట చుట్టూ 13 శిఖరాలు, వాచ్‌టవర్లు,

ఈ భారీ కోట చుట్టూ 13 శిఖరాలు, వాచ్‌టవర్లు,

ఈ భారీ కోట చుట్టూ 13 శిఖరాలు, వాచ్‌టవర్లు, బురుజులు ఉన్నాయి. కోటకు ఏడు భారీ ద్వారాలు ఉన్నాయి. కర్తార్‌ ఘర్‌ అని పిలుచుకునే మరో కోటను కూడా కుంభాల్‌ ఘర్‌ ప్రధాన కోట లోపల చూడవచ్చు. ఈ కోటలో ఏకంగా 360 ఆలయాలు, 252 భవంతులతోపాటు వీటికి రక్షణగా ‘చైనా గోడ'లాగే ఇండియన్ వాల్ వుంది. ఎంతో అద్భుతంగా కనువిందు చేసే ఈ కోటలో ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విశిష్టతలు దాగి వున్నాయి.

కోట నిర్మాణం గురించి ఇక చిన్న కథ :

కోట నిర్మాణం గురించి ఇక చిన్న కథ :

కోట గోడ కట్టేటప్పుడు ఓ వైపు గోడ ఎన్ని సార్లు కట్టినా పడిపోతూ ఉండేదిజ ఆ కారణం చేత గోడ నిర్మాణం పూర్తి కాకుండా ఉండేది. అప్పుడు ఒక ముని రాజు దగ్గరకు వచ్చి ఈ గోడ నిలబడాలంటే నరబలి ఇవ్వాలని, అది కూడా ఆ వ్యక్తి పూర్తి అంగీకారంతోనే జరగాలని చెప్తాడు, ఎన్ని కానుకలను ఇవ్వజూపినా యెవ్వరూ ముందుకు రారు. అప్పుడు ఆ ముని తానే బలికి సిద్ధపడి మొండెం పడ్డ చోట గోడ కట్టమని శిరస్సు పడ్డ ప్రదేశంలో మందిరం నిర్మంచమని చెప్తాడు. కోట ముఖద్వారమైన హనుమాన్ పోల్ దగ్గర అతని గౌరవార్థం నిర్మింపంబడిన చిన్న మందిరాన్ని చూడవచ్చు. చిన్న నాట నుండి రాజపుత్తుల సాహస సౌర్యాలను ప్రదర్శించి సముద్రమంతటి మొఘల్ సేనలతో అనేక సార్లు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన మహరాణా ప్రతాప్ ఈ కోటలోనే జన్మించాడు.

ఈ కోట ఒకే ఒక్కసారి ఆక్రమణకు గురైనది.

ఈ కోట ఒకే ఒక్కసారి ఆక్రమణకు గురైనది.

ఈ కోట ఒకే ఒక్కసారి ఆక్రమణకు గురైనది. గుజరాత్ నుండి మీర్జాలు, అక్బర్ సేనలు యేక కాలంలో దండెత్తి రావడంతో రాణా ఉదయ్ సింగ్ ఉదయ పూర్ లో తలదాచుకుని చాలా కొద్ది కాలంలోనే తిరిగి ఈ కోటను స్వాదీన పరచుకున్నాడు. 19 వ శతాబ్దం వరకు ఈ కోట రాజపరివార నివాసంగా కొనసాగినది. ఈ సమయంలో ప్రతీ రోజు సాయంత్రం కొద్ది సమయం ఈ కోటంతా దీపాలు వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

వేది దేవాలయం

వేది దేవాలయం

కుంబాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో వేది దేవాలయం ఉంది. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ మహరాజు నిర్మించాడు. ఈ ఆలయంలో జైనులు జీవన చిత్రాలను ప్రతిబింభించే విధంగా కలాకృతులు చెక్కింబడ్డాయి.మహారాణా ఫతే సింగ్ తర్వాతి కాలంలో పునరుద్ధరించాడు. చిత్రకృప : Sutharmahaveer

పరశురాం దేవాలయం

పరశురాం దేవాలయం

కోటలోని పురాతన గుహలో పరశురాం దేవాలయం ఉంది. ఈ ఆలయంలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణాల ప్రకారం పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, దాని తర్వాత శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెబుతారు. ఈ గుహను చేరాలంటే పర్యాటకులు సుమారు 500 మెట్లు కిందకు దిగాలి. చిత్రకృప : Rahul Patnaik

బాదల్ మహల్

బాదల్ మహల్

కుంబాల్ ఘర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో బాదల్ మహల్ ఒకటి. దీనినే మేఘాల ప్యాలెస్ అని కూడా పిలుస్తారు . ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహాల్ లు ఉన్నాయి. చల్లటి గాలిలోనికి రావడం, వేడి గాలి బయటికి పోవడం వంటి విధానాలు ఇక్కడ గమనించవచ్చు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు పేస్టెల్ రంగు కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి. చిత్రకృప : Sujay25

కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం

కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం

కుంభాల్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యంలో నాలుగు కొమ్ముల జింక, చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటి వాటిని చూడవచ్చు. హల్ది ఘాటి మరియు ఘనేరావ్ కుంభాల్ ఘర్ ఇతర పర్యాటక ఆకర్షణలు.

చిత్రకృప : Ashvij Narayanan

కేవలం ఇవి మాత్రమే కాదు..ఇంకా చూపరులను కట్టిపడేసే

కేవలం ఇవి మాత్రమే కాదు..ఇంకా చూపరులను కట్టిపడేసే

కేవలం ఇవి మాత్రమే కాదు..ఇంకా చూపరులను కట్టిపడేసే మరెన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈ కోటను సందర్శించాలంటే కేవలం ఒక రోజు సరిపోదు. 1000మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట 36కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండటంతో దీనిని చూసేందుకు చాలా సమయం పడుతుంది.

రాజస్థాన్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలను

రాజస్థాన్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలను

రాజస్థాన్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు అందులో రాజస్థానీ తలపాగా చుట్టుకునే స్పర్థ వుండటం అందులో విదేశీయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండం జరుగుతుంటుంది.

2013వ సంవత్సరంలో యునెస్కో వారిచే వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొంది సంరక్షింపబడుతోంది.

కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

ఉదయపూర్, అజ్మీర్, జోధ్ పూర్, పుష్కర్ ల నుండి తరచుగా నడిచే ప్రయివేట్ లేదా ప్రభుత్వ బస్సులలో పర్యాటకులు సౌకర్యవంతంగా కుంభాల్ ఘర్ చేరుకోవచ్చు.

రైలు స్టేషన్

కుంభాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ ఫల్నాలో కలదు. ఇది ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ మరియు జోధ్ పూర్ లకు తరచు ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది. ఇక్కడినుండి కుంభాల్ ఘర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.

విమాన ప్రయాణం

కుంభాల ఘర్ ప్రదేశానికి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. మహారాణా ప్రతాప్ విమానాశ్రయంనుండి కుంభాల్ ఘర్ కు ప్రి పెయిడ్ టాక్సీలు దొరుకుతాయి.

చిత్రకృప : Hardikmodi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more