Search
  • Follow NativePlanet
Share
» »కుంబల్‌ఘర్ కోట విశేషాలన్నీ మీకు తెలుసా?

కుంబల్‌ఘర్ కోట విశేషాలన్నీ మీకు తెలుసా?

రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం కుంభల్‌ఘర్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు.

భారతదేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. పురాణ కాలంతో పాటు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కట్టడాలను మనం ఈ దేశంలో చూడవచ్చు. అందులో కొన్ని అప్పటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా చెబుతారు. మరికొన్నింటిని అటప్పటి యుద్ద నైపుణ్యాలకు నిలయంగా నిర్మించారు. అటువంటి కోవకు చెందినదే కుంబల్ ఘర్ కోట. ఈ కోటకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం.

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

కుంబల్ ఘర్ కోట సముద్రమట్టానికి దాదాపు 1100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆరావళి పర్వతాల పై 15వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. ఈ కోటను నిర్మించినది రాణా కుంభ. ఆయన పేరుమీదనే ఈ కోటకు కుంబల్ ఘర్ కోట అని పేరువచ్చింది. ఈ కోట రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఉదయ్‌పుర్‌కు 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ కోటకు అనేక విశిష్టతలు ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే పొడవు విషయంలో మొదటి స్థానంలో ఉంటే ఈ కుంబల్ ఘర్ కోట రెండో స్థానంలో ఉంటుంది. ఈ కోట మొత్తం పొడవు 36 కిలోమీటర్లు.

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

వెడల్పు 15 అడుగులు. ఈ కోట రాజస్థాన్ శిల్పకళావైభవానికి నిదర్శనమని చెబుతారు. ఈ కోటలో ఏడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అదేవిధంగా అత్యంత సుందరమైన భవనాలు కూడా ఈ కోటలోపల ఉన్నాయి. ఇందులో బాదల్ మహల్ అత్యంత ముఖ్యమైనది. దీనిని రాణా పతేహ్ సింగ్ నిర్మించినట్లు చెబుతారు.

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

ఈ కోటలోపల మెట్ల మార్గాలు చాలా చీకటిగా ఉంటాయి. శత్రుసైనికులను గందరగోళంలో పడేయడానికే ఈ ఏర్పాట్లని నిపుణులు చెబుతారు. ఈ కోట ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడానికి సుమారు ఒక కిలోమీటరు పొడవున్న మెట్లమార్గాన్ని అనుసరించాలి. ఈ కోట గోడ నిర్మించడానికి సంబంధించి అనేక స్థానిక కథనాలు వినిపిస్తాయి.

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

రాణా కుంభ ఈ కోటను నిర్మించడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అటు పై బాడీ బాను సంప్రదించి అతను చెప్పినట్లు విని ఈ కోటను నిర్మించాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా స్థానికులు మాత్రం ఇందుకు సంబంధించి అనేక కథనాలు వినిపిస్తారు. ఈ కోటను సందర్శించడానికి చాలా మంది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తారు.

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

కుంబల్‌ఘర్ కోట, రాజస్థాన్

P.C: You Tube

అప్పుడు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఈ కోట పైన బాదల్ మహల్ వద్దకు చేరుకొంటే మేఘాల్లో తేలిపోయినట్లు ఉంటుంది. కుంభల్ ఘర్ కోట చుట్టూ ఉన్న అభయారణ్యం ప్రక`తి ప్రేమికులకు మంచి ఆటవిడుపు. ఇక్కడ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అంతరించే స్థితికి చేరుకొన్న ఎన్నో జంతువులను మనం చూడవచ్చు. మొత్తం ఈ కుంబల్ ఘర్ పర్యన అటు చరిత్రలో తొంగిచూసినట్లు ఉండటమే కాకుండా ఇటు ప్రక`తితో మమేకం కావడానికి కూడా ఎంతగానో తోట్పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X