Search
  • Follow NativePlanet
Share
» »తాజ్ మహల్ ఒకప్పటి శివాలయమా..?

తాజ్ మహల్ ఒకప్పటి శివాలయమా..?

ప్రపంచంలోని 7 వింతల్లో ఈ తాజ్ మహల్ ఒకటి. మొఘల్ చక్రవర్తయిన షాజహాన్ తాజ్ మహల్ ని తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా కట్టించాడని చెప్తారు. ఇది అద్భుతమైన కట్టడం.

ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

ప్రపంచంలోని 7 వింతల్లో ఈ తాజ్ మహల్ ఒకటి. దీని పేరు వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది షాజహాన్, ముంతాజ్ ల ప్రేమ. మొఘల్ చక్రవర్తయిన షాజహాన్ తాజ్ మహల్ ని తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా కట్టించాడని చెప్తారు. ఇది అద్భుతమైన కట్టడం. దీని నిర్మాణం 1632 వ సంవత్సరంలో మొదలై 1653 లో పూర్తయింది. అంతేకాదు వేలమంది శిల్పులు, చేతిపని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేసారు. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా వున్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో వుండేది.

ఆ సమయంలో షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ వారి 14వ సంతానం గౌహరాబెగానికి జన్మనిస్తూ మరణించటం షాజహాన్ విచారంతో నిండి పోయాడు. చివరి దశలో వున్న ముంతాజ్ షాజహాన్ ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరికను సమ్మతించి మరణించిన ఒక్క సంవత్సరం తర్వాత 1632 వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమకథే,తాజ్ మహల్ కు ఒక ప్రేరణని సంప్రదాయంగా చరిత్ర చెప్తోంది.

1.

1.

ప్రధాన సమాధి 1648వ సంవత్సరంలో పూర్తయిందని చుట్టుపక్కల భవనాలు మరియు ఉద్యానవనం 5 సంవత్సరాలకు పూర్తయాయని చెప్తూవుంటారు. ఇంతటి ప్రాచూర్యం పొందిన ఈ మహల్ వెనుక నిఘూడమైన రహస్యాలు దాగి వున్నాయని అంటారు.

pc: Asitjain

2.

2.

అదేంటంటే తాజ్ మహల్ అసలు తాజ్ మహల్ కాదని అది అంతకు ముందు తేజో మహల్ అని అది పరమశివుని దేవాలయం అని షాకింగ్ న్యూస్ ఈ మధ్యనే బయటపడింది. ఏంటి నమ్మబుద్ధి కావటం లేదా. అయితే దాని వెనక అసలు నిజాలు, ఆ వివరాలు ఏంటో చూద్దాం.

pc:Imahesh3847

3.

3.

అద్భుత కట్టడాల్లో ఒకటి అయిన తాజ్ మహల్ ను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ వుండరు.దాన్ని ఒక్కసారైనా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే దీని గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి.

pc:Rajesnewdelhi

4.

4.

దీన్ని షాజహాన్ కాలం కంటే ముందే 300 ఏళ్ల క్రితమే నిర్మించారని ఇది ఒకప్పుడు మహాశివుని ఆలయమని చెప్తారు. ఇది మీరు నమ్ముతారా? ఈ విషయాన్ని పి.ఏ.నోక్ అనే రచయిత రాసిన "తాజ్ మహల్ ది ట్రూ స్టోరీస్" అనే పుస్తకంలో తాజ్ మహల్ మొఘల్ రాణి అయిన ముంతాజ్ స్మారకంగా నిర్మించిన కట్టడం కాదని, అది పరమశివుని గుడి అని చెప్తున్నాడు.

pc: Royroydeb

5.

5.

తాజ్ మహల్ అస్సలు పేరు "తేజోమహాలయ" అట. గతంలో ఇలాలాంటి హిందూ దేవాలయాల్ని ఎన్నింటినో మొఘలులు ఆక్రమించి వాటిని నాశనం చేసారని, కొన్నింటిని తిరిగి వాటిని ముస్లిం దేవాలయాలుగాను, కొన్నింటిని వారి మసీదులుగాను మార్చేసుకొన్నారని మనందరికీ తెలిసిందే.

pc:wikipedia.org

6.

6.

అలాగే అప్పటికే అద్భుత శివాలయంగా విరాజిల్లుతోన్న ఈ తేజోమహాలయాన్ని అప్పటి మొఘల్ రాజైన షాజహాన్ ఆక్రమించి దానిని తన భార్యయైన ముంతాజ్ ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ గా తిరిగి నిర్మించాడని పి.ఏ.నోక్ రాసిన పుస్తకం ద్వారా తెలుస్తోంది. దానికి కొన్ని ఆధారాలు కూడా వున్నాయని చెపుతున్నారు.

pc:amaldla

7.

7.

ఈ తాజ్ మహల్ లో కొన్ని భాగాలని చూసినపుడు హిందూ దేవాలయాలని పోలిన విధంగా వుంటున్నాయని అంటున్నారు. అప్పటి తేజోమహల్ అందాలని చూసినప్పుడు ముగ్ధుడైన షాజహాన్ అప్పటి జైపూర్ మహారాజైన జయసింగ్ దగ్గరనుంచి దానిని లాక్కొని రికన్ స్ట్రక్షన్ చేసి తాజ్ మహల్ గా పేరు మర్చేసాడని అంటున్నారు.

pc:wikipedia.org

8.

8.

ఇంకా తాజ్ మహల్ దగ్గర నియమాలని చూసినప్పుడు అవి అచ్చం హిందూ దేవాలయాల్లో పాటించేవిగా వున్నాయట. అందులో చెప్పులు బయటపెట్టి లోపలి వెళ్ళాలనే నియమం ఒకటి. ఏ ముస్లిం సమాధి దగ్గరా ఇలాంటి నియమం వుండదు. ఒక్క తాజ్ మహల్ దగ్గర తప్ప.

pc:wikipedia.org

9.

9.

హిందూ దేవుళ్ళను కొలవటానికి వెళ్ళే వారు మాత్రమే అలా చేస్తారు. ఇలా చాలావరకు అక్కడ పాటిస్తున్నవి హిందూదేవాలయాలలో పాటిస్తున్న నియమాలకు మ్యాచ్ అవ్వటంతో ఇది గతంలో పరమశివుని గుడేనని నమ్మకంగా చెప్తున్నారు.

pc:Fowler&fowler

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X