Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకుల ఖిల్లా.. నల్లగొండ జిల్లా..

పర్యాటకుల ఖిల్లా.. నల్లగొండ జిల్లా..

By Karthik Pavan

వెలకట్టలేని చారిత్రక కట్టడాలు, అంతుబట్టని దుర్గాలు, కోటలు, లెక్కలేనన్ని విహార స్థలాలు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, నదులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తెలంగాణలో మనకు ఎన్నో కనిపిస్తాయి. అందుకే తెలంగాణ చరిత్రకారుల గని అన్నారు. వాటిలో పొరాటాల ఖిల్లాగా పేరుపొందిన నల్లగొండ జిల్లాలో గతకాలపు స్మృతి చిహ్నాలు ఎన్నో ఉన్నాయి.

చారిత్రకంగానే కాకుండా భౌగోళికంగా కూడా నల్లగొండ జిల్లాకు ఎంతో విశిష్టత ఉంది.కొన్ని లక్షల ఏళ్ల నుంచి ఈ ప్రాంతం ఒక ఆవాసంగా నిలిచి ఉందంటారు చరిత్రకారులు. అయితే, అందుకు పక్కా ఆధారాల కోసం అన్వేషణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మౌర్యుల నుంచి పల్లవుల వరకూ.. కాకతీయుల నుంచి మొఘలుల వరకూ ఇలా ఎంతోమంది పరిపాలించిన నల్లగొండ జిల్లాలో అప్పటి కట్టడాలు ఆనాటి కధలను చెప్పడానికి ఇంకా అలానే ఉన్నాయి. అందుకే.. ఇక్కడి చారిత్రక సంపదను చూసేందుకు ప్రతీ ఏటా టూరిస్టులు వస్తుంటారు.

కొలనుపాక దేవాలయం

కొలనుపాక దేవాలయం

P.C. You Tube

దేశంలోని జైన మందిరాల్లో అత్యంత ప్రాచీనమైనవిగా చెప్పుకునేవాటిలో నల్లగొండ జిల్లాలోని జైన మందిరం ఒకటి. ఏడాది పొడవునా భక్తులు, టూరిస్టులతో కిటకిటలాడే ఈ దేవాయం హైదరాబాద్‌కు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి పక్కనే ఆలేరు నది ప్రవహిస్తుంటుంది. 200 ఏళ్లనాడే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. జైనుల్లో మొదటి తీర్థంకరుడిగా పిలవబడే రిషభనాధ విగ్రహం కొలువై ఉన్న ఈ దేవాలయం ముఖభాగం కోటద్వారాన్ని తలపిస్తుంది. మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడిలో 1.5 మీటర్ల ఎత్తయిన మహావీరుని విగ్రహం కూడా ప్రతిష్టించబడి ఉంది. ఈ విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఫిరాజో రాతితో నిర్మించినట్టు చెప్తారు.

భువనగిరి ఖిల్లా.

భువనగిరి ఖిల్లా.

P.C. You Tube

తెలంగాణ గుండెలమీద తలెత్తుకున్న ఆత్మగౌరవ కోట భువనగిరి కోట. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లే దారిలో రాజదర్పంలా కనిపించే ఈ ఖిల్లా 500 అడుగుల ఎత్తులో వందల ఏళ్ల నుంచి ఠీవీగా అలానే ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఖిల్లా తర్వాత కాలంలో కాకతీయులు, బహమనీ సుల్తానులు ఇలా ఎంతోమంది అధీనంలో ఉంది. పశ్చిమ చాళుక్యరాజైన ఆరవ త్రిపుర విక్రమాదిత్యుడు 12వ శతాబ్దకాలంలో ఖిల్లా నిర్మాణానికి పూనుకున్నట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. శతృదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట కింద హనుమాన్‌ దేవాలయం కూడా ఉంది.

కోట చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళతో గోడలు నిర్మించారు. ఆ గడలపై పెద్దపెద్ద శిలలు నిర్మించారు. ఖిల్లా సింహ ద్వారం చేరుకోవడానికి అడుగు భాగం నుండి 300 అడుగుల మెట్లు ఎక్కాలి. అక్కడి నుంచి కాస్త పైకి వెళితే ఆయుధాలు భద్రపర్చే చోటు చూడచ్చు. కొండమీద నీటిని భద్రపర్చుకునేందుకు ఏడు కోనేర్లు ఉన్నాయి. వాటికి స్ధానికులు సప్తసరస్సులని పిలుస్తారు.

నాగార్జునసాగర్‌

నాగార్జునసాగర్‌

P.C. You Tube

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్ట్‌లలో ఒకటి నాగార్జున సాగర్‌ డ్యాం. రెండుతెలుగు రాష్ట్రాల రైతుల పాలిట అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు దేశతొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్ధాపన చేశారు. 1955-1967 మధ్యలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్ట్‌.. మన దేశంలోని తొట్టతొలి జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇక్కడి ఊరిని కూడా ఇదే పేరుతో వ్యవహరించడం విశేషం. గతంలో డ్యామ్‌ మీదకు పర్యాటకులను అనుమతించినా.. తర్వాత కాలంలో భద్రతా కారణాల వల్ల నిలిపివేశారు. అయితే, కొత్తగా కట్టిన బ్రిడ్జిమీద నుంచి ప్రాజెక్టును వీక్షించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో బయటపడిన క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ అవశేషాలను.. జలాశయం మధ్య కొండపై నిర్మించిన నాగార్జునకొండ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ద్వీపంలో ఉండే మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది.

లతీఫ్ సాహేబ్ దర్గా

లతీఫ్ సాహేబ్ దర్గా

P.C. You Tube

మత సామరస్యానికి ప్రతీక లతీఫ్‌ సాహెబ్‌ దర్గా. నల్గొండ పట్టణంలో ఒక కొండపై సూఫీ సాధువు లతీఫ్‌ ఉల్లా సాహెబ్‌ ఖాద్రీ యాదిలో దీన్ని నిర్మించారు. లతీఫ్ సాహెబ్ ఈ గుట్టపై నివాసం ఏర్పర్చుకొని స్థానికుల సమస్యలను తీరుస్తుండేవారట. చనిపోయిన తర్వాత కూడా అదృశ్యరూపంలో ఆయన ప్రజల సమస్యలను తీరుస్తుంటాడని ప్రజల విశ్వాసం. అందుకే.. మతంతో సంబంధం లేకుండా ప్రజలు ఈ దర్గాకు వచ్చివెళ్తుంటారు.

దేవరకొండ ఖిల్లా

దేవరకొండ ఖిల్లా

P.C. You Tube

నల్లగొండ జిల్లాలో మరో అద్భుతమైన చారిత్రక నిర్మాణం దేవరకొండ ఖిల్లా. దేవరకొండను తెలంగాణ అరకులోయ అని కూడా పిలుస్తారు. దట్టమైన అడవులు, జాలువారే జలపాతాలతో వర్షాకాలంలో దేవరకొండ మరింత అందంగా కనిపిస్తుంది. 13-14 శతాబ్దాల మధ్యలో పద్మనాయక రాజులు దేవరకొండ ఖిల్లాను నిర్మించారు. 500 అడుగుల ఎత్తు, 360 బురుజులు, 9 మహాద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కొలనులు, 13 ధాన్యగారాలు కలిగి 800 ఏళ్ళ గొప్ప చరిత్ర కలిగిన దేవరకొండ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X