Search
  • Follow NativePlanet
Share
» »ఎముకలు కొరికే చలిలో కూడా ఇక్కడ స్నానం చేయడానికి సోపు, వేడినీరు అవసరం లేదు

ఎముకలు కొరికే చలిలో కూడా ఇక్కడ స్నానం చేయడానికి సోపు, వేడినీరు అవసరం లేదు

భారత దేశంలో ఉన్న వేడినీటి బుగ్గలకు సంబంధించిన కథనం.

ప్రపంచంలో అత్యంత పురాతన ఆధ్యాత్మిక, ధార్మిక దేశంగా భారత్ కు పేరుంది. కేవలం భారత దేశంలో ఉన్నటువంటి వంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలే కాదు మరెన్నో కారణాల వల్ల భారత దేశానికి పవిత్ర, ధార్మిక క్షేత్రమని పేరు వచ్చింది.

అందులో ఒకటి తీర్థాలు. కొన్ని దేవాలయాల ముందు భాగంలో తీర్థాలు, నీటి బుక్కలు. వీటిలో కొన్ని మానవ నిర్మితాలైతే మరికొన్ని సహజ సిద్ధంగా ఏర్పడినవి. ఈ వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతున్నారు.

ఇది నాణ్యానికి ఒక కోణమైతే, మరో కోణం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల కొంతమందికి అంతేకాకుండా చర్మవ్యాధులు కూడా నయమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పటికీ రహస్యమే. అటువంటి రహస్యాలను తమలో దాచుకొన్న కొన్ని వేడి నీటి బుగ్గలకు సంబంధించిన క్లుప్త సమాచారం మీ కోసం...

బక్రేశ్వర్, పశ్చిమ బెంగాల్

బక్రేశ్వర్, పశ్చిమ బెంగాల్

P.C: You Tube

పశ్చిమ బెంగాల్ లోని బకరేశ్వర్ లో ఉన్న కుండను అగ్ని కుండ్ అని అంటారు. దీనిలో నీరు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడిగా ఉంటుంది. ఇందులో ఉన్న సోడియం, పొటాషియం, కాల్షియం, సిలికేట్, క్లోరైడ్,
బై కార్బోనేట్ సల్ఫేట్ ల వల్ల ఈ కుండంలోని నీటికి ఔషద గుణాలు వచ్చాయని చెబుతారు.

మణికరన్

మణికరన్

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్ పార్వతీ లోయ ప్రాంతంలో ఉంటుంది. ఈ మణికరన్ కేవలం హిందువులకే కాకుండా సిక్కులకు కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న నీటిలో స్నానం చేయడం వల్ల చాలా ఏళ్లుగా నయం కాని చర్మరోగాలతో సహా ఆస్మా కూడా కొంత వరకూ నయమవుతుందని నమ్ముతారు. అందుకే ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో హిందువులు, సిక్కులు వస్తుంటారు.

పనామిక్, రుబ్రావ్యాలీ, జమ్ము కాశ్మీర్

పనామిక్, రుబ్రావ్యాలీ, జమ్ము కాశ్మీర్

P.C: You Tube

ప్రపంచంలోనే అత్యంత యుద్ధక్షేత్రంగా పేరున్న సియాచిన్ ప్రాంతానికి కూతవేటు దూరంలో ఈ పనామిక్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వేడినీటి బుగ్గలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల ఔషద గుణాలు ఉన్నట్లు స్థానికులు చెబుతారు. రుబ్రా గ్రామీణ ప్రజలతోపాటు చుట్టు పక్కల ఉన్నవారు ఈ వేడినీటి బుగ్గ వద్దకు తరుచుగా వెలుతూ ఉంటారు.

రాజ్ ఘిర్, బీహార్

రాజ్ ఘిర్, బీహార్

P.C: You Tube

బీహార్ లోని నలందా జిల్లాలో ఉన్న చిన్నపట్టణమే రాజ్ ఘిర్. ఇక్కడ ఉన్న వేడినీటి బుగ్గలో స్నానం చేయడానికి దేశం నలుమూలల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ వేడి నీటి బుగ్గలో స్నానం చేయడం వల్ల అనేక చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ముఖ్యంగా చలికాలంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

తపత్ కుండ్, బద్రినాథ్, ఉత్తరాఖండ్

తపత్ కుండ్, బద్రినాథ్, ఉత్తరాఖండ్

P.C: You Tube

హిందూపురాణాలను అనుసరించి మహావిష్ణువు ఆదేశాలను అనుసరించి అగ్నిదేవుడు ఈ కుండంలో నిత్యం నివశిస్తూ ఉంటారని చెబుతారు. అందువల్లే ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ సమిసిపోతాయని భక్తులు నమ్ముతారు. బ్రదినాథ్ దేవాలయంలోకి వెళ్లే భక్తులు ముందుగా ఈ తపత్ కుండ్ లో తప్పక స్నానం చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X