Search
  • Follow NativePlanet
Share
» »తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

By Mohammad

భారతీయ సినీ సంగీతంలో ఒక్కొకరిది ఒక్కొక్క బాణీ. ఆగ్రా ఘరానా, బెనారస్ ఘరానా ఇలా ఉంటాయి. వాటిలో పేరుగాంచినది లక్నో ఘరానా. లక్నో ను పాలించిన అవధ్ జమీందారులు నర్తకీమణుల్ని, పాటగాళ్ళని, సంగీత కచేరి వాళ్ళని, పక్క వాయిద్యాల వాళ్ళని పెంచి పోషించేవారు ... వాళ్లకు ఇళ్లను రాసి ఇచ్చేవారు... పొలాలను ఇనాములుగా ఇచ్చేవారు. ఇప్పుడు వీరి హవా తగ్గిందనే చెప్పాలి.

ఖరీదైన పెళ్లిళ్లలో కచేరి తప్పనిసరి. 'వహ్వా ! వాహ్వా' అంటూ వారిని పొగుడుతూ నోట్ల దండలను మెడ లో వేస్తుంటారు. తాబూలం బాక్స్ లు, హుక్కా పీల్చేవారు లక్నో లో అధికం. లక్నో తీపి వంటకాలకు ప్రసిద్ధి. దేశం మొత్తం మీద ఉన్న స్వీట్స్ ఇక్కడ దొరుకుతాయి. కనుక, లక్నో లో స్వీట్ ట్రిప్ వేద్దాం పదండి!

ఇది కూడా చదవండి : లక్నో లో లక్కీగా ఒక్క రౌండ్ !

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

అప్పట్లో నర్తకీమణులు ఉండే ఇళ్లను 'హవేలీ' అనేవారు. ఇప్పుడు అవి లక్నో లో బేకరీలుగా మారాయి. వారు మాట్లాడే తీరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఫాస్ట్ గా మాట్లాడుతారు.

చిత్ర కృప : Ajay Goyal

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

లక్నో లో తిరగటానికి ఆటో రిక్షాల సదుపాయం ఉంటుంది. కనుక, నగర సందర్శన సౌకర్యవంతంగా ఉంటుంది. ఖానా, పీనా, బజానా ఇక్కడి వారి సూత్రం కాబోలు ! శ్రమ ఒకరిదైతే ఫలితం మరొకరిది ఉంటుంది లక్నో లో. సెంట్లు, అత్తర్ లు అధికంగా వాడుతారు.

చిత్ర కృప : Adeel Anwer

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

లక్నోలో ప్రజల ఆహారపు అలవాట్లు చిత్రంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో స్వీట్ లను ఆరగిస్తారు. జిలేబి, సమోసా, చాయ్ తో వీరి దినచర్య ప్రారంభమవుతుంది.

చిత్ర కృప : Yogesh Rao

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

లక్నోలో పాలకోవా, బర్ఫీ, లస్సి చాలా రుచికరంగా ఉంటాయి. లస్సి లలో రకరకాల ఫ్లేవర్ లు దొరుకుతాయి. మటన్, చికెన్ కర్రీ లకు లక్నోలోని డా భా లు ప్రసిద్ధిగాంచాయి.

చిత్ర కృప : Anibha Singh

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

లక్నో లో కొన్ని చోట్ల టీ తాగటానికి మట్టి కప్పు లను ఇస్తారు. తాగాక వారిని పారవేస్తారు. దాంతో కుమ్మరి వాళ్ళకి చేతినిండా పనే పని !

చిత్ర కృప : Shashwat Nagpal

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

లక్నో లో మిఠాయి షాపులు, చెప్పుల షాపు లు విరివిగా ఉంటాయి. లక్నో బూట్లు కొనటానికి పర్యాటకులు ఎగబడుతుంటారు. కారణం జరీ, చమ్కీ, ఊలు వినియోగించి ఉండటమే !

చిత్ర కృప : Sanjeev Kapoor

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

లక్నో లో బిర్యానీ స్పెషల్. సుమారు 25 రకాల సుగంధద్రవ్యాలను ఉపయోగించి బిర్యానీ చేస్తారు. అందుకే ఇక్కడ బిర్యానీ అంత రుచికరంగా ఉంటుంది. అందరూ కూడా ఇష్టపడతారు.

చిత్ర కృప : Function Inn Hotels

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

ముదురు తమలపాకులు, కాచు, సున్నం తో పాటు వివిధ రకాల సుగంధద్రవ్యాలను వేసి కట్టిన పాన్ రుచి తప్పక చూడవలసిందే!

చిత్ర కృప : Jitendra Purswani

తీపి వంటకాల లక్నో !

తీపి వంటకాల లక్నో !

రాతి కోటలు, పాత కాలపు ఇళ్లులు, సన్నటి రోడ్డు లు, పాన్ షాప్ లు, మిఠాయి షాప్ లు, సామాన్లను మోసుకెళ్లే హమాలీలు ... ఇవన్నీ చూస్తుంటే నగరం పాత కాలంలోకి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. అదో అనుభూతి.

చిత్ర కృప : Rik de Goede

లక్నో ఎలా చేరుకోవాలి ?

లక్నో ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

లక్నో నగరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుండే కాకూండా, మధ్య పాశ్చాత్య దేశాల నుండి కూడా విమానాలు వస్తుంటాయి. నగరంలోకి క్యాబ్ లేదా ఆటో లో ఎక్కి చేరుకోవచ్చు.

రైలు మార్గం

లక్నో లో రెండు ప్రధాన రైల్వే జుంక్షన్ లు ఉన్నాయి - అందులో ఒకటి సిటీ సెంటర్, మరొకటి చార్బాగ్ వద్ద సిటీ సెంటర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం శతాబ్ది, రాజధాని ఎక్స్పెస్ వంటి అనేక రైళ్ళ ద్వారా భారతదేశంలోని అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గం

లక్నో గుండా జాతీయ రహదారులు 25, 28, 56 తో అనుసంధానించబడినది. ఢిల్లీ, కాన్పూర్, ఆగ్రా, అలహాబాద్, డెహ్రాడూన్ ల నుండి లక్నో కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Belur Ashok

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X