Search
  • Follow NativePlanet
Share
» »ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...

ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...

మధురాంతకం పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

By Kishore

శ్రీరామ చంద్రుడు హిందువులకు ఆరాధ్యదైవం. అయితే తనను భక్తితో కొలిస్తే వారి కులగోత్రాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా దర్శనమిస్తానని చెప్పకనే చెప్పిన క్షేత్రం తమిళనాడులోని చెన్నైకు అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ శ్రీరామ చంద్రుడు ఒక బ్రిటీష్ కలెక్టర్ కు దర్శనమిచ్చినట్లు చెబుతారు. ఈ వివరాలన్నీ అక్కడ తెలుగు, తమిళ భాషలో రాతి శాసనం రూపంలో మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. క్షేత్రంలోనే ఒంటిమిట్ట తర్వాత రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం లేని పుణ్యక్షేత్రం ఇక్కడే ఉంది. వైష్ణవ మత ప్రాచారకుల్లో అగ్రగణ్యుడైన రామానుజచార్యుల వారు దీక్షతీసుకొన్నది కూడా ఈ క్షేత్రంలోనే. అన్నింటికంటే ముఖ్యంగా విష్ణువు తన ప్రతి రూపమైన కరుణాకర విగ్రహాన్ని స్వయంగా బ్రహ్మ పుత్రులకు ఇచ్చి ఈ క్షేత్రంలో ప్రతిష్టింప చేశాడు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ పుణ్యక్షేత్రం వివరాలు మీ కోసం.

2100 ఏళ్ల నాటి లక్షల కోట్ల రుపాయల సంపద మీదే అయితే...2100 ఏళ్ల నాటి లక్షల కోట్ల రుపాయల సంపద మీదే అయితే...

1. మధురాంతకం

1. మధురాంతకం

P.C: You Tube

తమిళనాడు రాజధాని చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో మధురాంతకం పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రం వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. ఈ క్షేత్రంలో కాలు పెట్టిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

2. బకుళారణ్యం

2. బకుళారణ్యం

P.C: You Tube

పూర్వం ఈ ప్రాంతంలో బకుళ వనాలు ఉండేవని చెబుతారు. అందువల్ల దీనిని గతంలో బకుళారణ్యం అని పిలుచేవారు. ఇప్పటికీ కొంత మంది ఈ ప్రాంతాన్ని అదే పేరుతో పిలుస్తారు.

3. బ్రహ్మపుత్రలు

3. బ్రహ్మపుత్రలు

P.C: You Tube

క`తయుగంలో బ్రహ్మ పుత్రులు శ్రీమన్నారాయణుడిని ప్రార్థించి తమకు మోక్ష్ం ప్రసాదించమని వేడుకొన్నారు. దీంతో స్వామి తన ప్రతి రూపమైన కరుణాకరమూర్తి విగ్రహాన్ని వారికి అందజేస్తాడు.

4.అందువల్లే మోక్షం

4.అందువల్లే మోక్షం

P.C: You Tube

ఆ విగ్రహాన్ని బకుళారణ్యంలోని విభాండక మహర్షి ఆశ్రమంలో ప్రతిష్టించి చాలా ఏళ్లపాటు తపస్సు చేశారు. దీంతో వారికి మోక్షం లభించింది. అంతేకాకుండా విష్ణువు వరం వల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి తప్పక మోక్షం లభించినందని పురాణాలు చెబుతున్నాయి.

5. వనవాస సమయంలో

5. వనవాస సమయంలో

P.C: You Tube

శ్రీరామ చంద్రుడు తన వనవాస సమయంలోఇక్కడి కరుణాకర మూర్తి విగ్రహాన్ని పూజించి కొంత కాలం అక్కడే ఉన్నాడు. అటు పై సీతాన్వేషణకు బయలు దేరినప్పుడు విభాండక మహర్షి కోరికతో రామరావణ యుద్ధం తర్వాత సీత సమేతంగా ఇక్కడ కొద్ది సేపు ఉంటానని మాట ఇస్తాడు.

6.యుద్ధం తర్వాత

6.యుద్ధం తర్వాత

P.C: You Tube

అనుకొన్న ప్రకారమే రామ రావణ యుద్ధం తర్వాత శ్రీరామ చంద్రుడు తన పరివారంతో పుష్పక విమానంలో ఇక్కడకు వస్తాడు. అటు పై సీత చేతిని పట్టుకొని ఆ మహాసాద్విని స్వయంగా విమానం నుంచి కిందికి దించుతాడు.

7. మూల విరాట్టు విగ్రహాలు కూడా అలాగే

7. మూల విరాట్టు విగ్రహాలు కూడా అలాగే

P.C: You Tube

అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న సీతరామ ఆలయంలో రాముడు, సీత విగ్రహాన్ని పట్టుకొన్నట్లు ఉన్న విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఇక్కడ హనుమంతుడి విగ్రమం మనకు కనిపించదు.

8. అందువల్ల ఆంజనేయుడి విగ్రహం కనిపించదు

8. అందువల్ల ఆంజనేయుడి విగ్రహం కనిపించదు

P.C: You Tube

ఇక్కడకు చేరుకొన్న తర్వాత శ్రీరామ చంద్రుడు రాముల వారి ఆగమనాన్ని భరతుడికి చెప్పడానికి వెళ్లాడు. అందువల్ల ఆంజనేయుడి విగ్రమం ఈ దేవాలయం కనిపించదు. ఒంటిమిట్ట తర్వాత ఆంజనేయుడి విగ్రమం కనిపించని రామ దేవాలయం ఇదే.

9. శ్రీరామానుజాచార్యుల వారికి

9. శ్రీరామానుజాచార్యుల వారికి

P.C: You Tube

వైష్ణవ మత ప్రబోధకుడు శ్రీరామానుజాచార్యుల వారికి ఈ క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడే ఆయన పెరినంబి దగ్గర దీక్ష తీసుకొన్నట్లు చెబుతారు.

10. పునరుద్ధరణ సమయంలో

10. పునరుద్ధరణ సమయంలో

P.C: You Tube

1937లో కలకత్తాకు చెందిన సేఠ్ మగన్ లాల్ ఆలయాన్ని పునరుద్ధరిస్తుండగా ఆలయం దగ్గరగా ఒక గుహ కనిపించింది. ఈ గుహలోపలికి వెళ్లి అక్కడ భూమిని మరో 20 అడుగుల లోతు వరకూ తవ్వారు.

11. రాగితో చేయబడిన అనేక వస్తువులు

11. రాగితో చేయబడిన అనేక వస్తువులు

P.C: You Tube

అక్కడ ఒక మంటపం అందులో రాగితో చేయబడిన క`ష్ణుడి విగ్రహం, శంఖం, చక్రం, పూజా సామాగ్రి అన్నీ కనిపించాయి. దీంతో ఇక్కడే రామానుజాచార్యుల వారు దీక్ష తీసుకొన్నట్లు వైష్ణువులు ఘంటాపథంగా చెబుతారు.

12. దాదాపు 150 ఏళ్ల క్రితం

12. దాదాపు 150 ఏళ్ల క్రితం

P.C: You Tube

దాదాపు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండేది. ఒకసారి ఈ ప్రాంతానికి లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టర్ గా వచ్చాడు. ఆయన దేవుడు ఒక్క క్రీస్తు రూపంలోనే కాకుండా అనేక రూపాల్లో కూడా ఉంటాడని నమ్మేవాడు. అందువల్ల ఆయన ఇక్కడి బ్రహ్మణులతో పాటు దళితులను కూడా సమానంగా గౌరవించేవాడు.

13. సాగు నీరును అందించే చెరువు

13. సాగు నీరును అందించే చెరువు

P.C: You Tube

ఇదిలా ఉండగా ఇక్కడ ఒక్క ఒక చెరువు చుట్టు పక్కల ఉన్న వేల ఎకరాల్లోని వ్యవసాయానికి నీటిని అందించేది. అయితే ప్రతి ఏడాది వర్షాకాలంలో ఆ చెరువు కట్ట తెగి అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది.

14. వ్యాహ్యాళికి వెలుతూ

14. వ్యాహ్యాళికి వెలుతూ

P.C: You Tube

ఇక కలెక్టర్ గా ఉన్న లియనాల్డ్ ప్లేస్ తన విధినిర్వహణలో భాగంగా ప్రతి సంత్సరం ఆ చెరువును పునరుద్ధరించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ప్లేస్ వ్యాహ్యాళికి వెలుతూ ఉంటాడు.

15. బ్రహ్మణులు

15. బ్రహ్మణులు

P.C: You Tube

ఆ సమయంలో బ్రాహ్మణులు ఎదరురై స్థానిక దేవాలయాన్ని పునరుద్ధరించాలని ఇందుకోసం నిధులు విడుదల చేయాల్సిందిగా విన్నవించుకొంటాడు. అయితే తెగిపోతున్న చెరువును మరమత్తులు చేస్తే ప్రజలు బాగుపడుతారని అయితే దేవాలయం పునరుద్ధరణ వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తాడు.

16. పునరుద్ధరిస్తానని మాట ఇచ్చాడు

16. పునరుద్ధరిస్తానని మాట ఇచ్చాడు

P.C: You Tube

బ్రహ్మణులు మాత్రం భక్తి శ్రద్ధలతో ఇక్కడి ఉన్న దేవుడిని ప్రార్థిస్తే ప్రతి ఏడాది తెగిపోతున్న చెరువుకట్టకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబతారు. దీంతో ప్లేస్ తాను భక్తిశ్రద్దలతో ఇక్కడ ఉన్న శ్రీరామ చంద్రుడిని పూజిస్తానని ఈ ఏడాది చెరువు తెగకుండా ఉంటే ఆలయాన్ని పునరుద్ధరిస్తానని చెబుతాడు.

17. ఎక్కువ వర్షం

17. ఎక్కువ వర్షం

P.C: You Tube

అనుకొన్న విధంగానే ఆ ఏడాది గతంలో కంటే ఎక్కువ వర్షం పడుతుంది. మూడు రోజుల పాటు కుంభవ`ష్టి కురుస్తుంది. దీంతో చెరువు కట్ట తప్పక తెగిఉంటుందని ప్లేస్ అనుకొంటూ వర్షం కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత చెరువు దగ్గరకు వెళుతాడు.

 18. శ్రీరాముడు కనిపించాడు.

18. శ్రీరాముడు కనిపించాడు.

P.C: You Tube

అక్కడ శ్రీరామ చంద్రుడు తన బాణాలతో చెరువు తెగకుండా అడ్డుకట్ట వేయడాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు. ఈ విషయాన్ని తన పరివారంతో చెప్పినా వారికి శ్రీరాముడు కనిపించడు. దీంతో తన పూజలకు మెచ్చి తన కోరికను తీర్చడానికి స్వయంగా శ్రీరాముడు వచ్చాడని ప్లేస్ అక్కడ ఉన్నవారందరికీ చెప్పడమే కాకుండా వెంటనే ఆలయాన్ని ప్రభుత్వ ఖర్చులతో పునరుద్ధరిస్తాడు.

19. రాతి శాసన రూపంలో

19. రాతి శాసన రూపంలో

P.C: You Tube

ఈ కథనం ఇప్పటికీ అక్కడ తెలుగు, తమిళ భాషలో రాతి శాసనం రూపంలో మనం చూడవచ్చు. మహావిష్ణువు ప్రతిరూపమైన కరుణాకరుడిని ఇక్కడ ప్రతిష్టించడం, శ్రీరాముడు కొలువై ఉండటం, రామానుజాచార్యులు దీక్ష తీసుకోవడం వల్ల ఈ ఆలయం వైష్ణవులు ఈ క్షేత్రాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

20. శ్రీరామనవమి ఉత్సవాలు

20. శ్రీరామనవమి ఉత్సవాలు

P.C: You Tube

ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏడాది 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. జూన్, జులై నెలల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

21. రైలు, బస్సు సర్వీసులు

21. రైలు, బస్సు సర్వీసులు

P.C: You Tube

మధురాంతకం చేరుకోవడానికి రైలు, బస్సులు చెన్నై నుంచి నిత్యం అందుబాటులో ఉంటాయి. ఉదయం 7.30 గంటల నుంచి 12 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. అటు పై 4.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఇక్కడి మూల విరాట్టును దర్శనం చేసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X