Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకృష్ణుడుగోపికల రాసలీలలు జరిపిన ఈ మజులీ ద్వీపం కొత్తగాపెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం

శ్రీకృష్ణుడుగోపికల రాసలీలలు జరిపిన ఈ మజులీ ద్వీపం కొత్తగాపెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం

శ్రీకృష్ణుడుగోపికల రాసలీలలు జరిపిన ఈ మజులీ ద్వీపం కొత్తగాపెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం

భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయం. అందులో సముద్రాలు, నదులు, పర్వతాలు, నదీ లోయలు, పర్వతాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందులో ద్వీపాలు కూడా విస్మరించదగినవి కాదు. భారత దేశంలో ఉన్న ద్వీపాల్లో కొన్ని విదేశీయులను కూడా ఆకర్షిస్తున్నాయంటే అక్కడి ప్రకృతి సంపద అందంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత దేశంలో అత్యంత అందమైన ఐదు ద్వీపాలలో ఒకటి మజు ద్వీపం.

ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు రాస ఉత్సవం జరిగే ప్రదేశం మజులి ద్వీపం. సహజంగా ద్వీపం అనగానే ఎవరికైన గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే మంచినీటి మధ్య ద్వీపాలు కూడా ఉన్నాయి. నదులు మధ్యలో ఉన్న ఇలాంటి ద్వీపాలలో ప్రపంచంలోనే అతి పెద్దది ఈ మజులి ద్వీపం. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్రానది మధ్యలో ఏర్పడిన ఈ మజులి ద్వీపం ఎంతో సుందరమైనది. అంతే కాదు ఎంతో గౌరవమైన గుర్తింపును కలిగినది. గౌహతి దగ్గర్లో హజో అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడంవల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే సరాయ్ ఘాట్ యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు సరాయ్ ఘాట్ వంతెన అని పేరు పెట్టారు. మజొలి ద్వీపం ఈ నది మధ్యలో ఉంది. ఇది జొర్హట్ కు సమీపంలో ఉంది.

వాస్తవంగా చెప్పాలంటే ఈ ద్వీపం 1250చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నప్పటికీ భూమికోత కారణంగా దాని పరిమాణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దాని ిపూర్తి వైశాల్యం 421.65చదరపు కిలోమీటర్లు మాత్రమేజ జోర్హాట్ నుండి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న మజులిని ఫెర్రీల ద్వారా చేరవచ్చు. ఈ ద్వీపంలో సుమారు లక్షా 60 వేలమంది నివాసం ఉంటున్నారు. అస్సాంలో ఇది అసెంబ్లీ నియోజనవర్గంగా ఉంది. అస్సాంలో ఇది అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. తాజాగా దీనిని ఒక జిల్లాగా ప్రకటించారు. అంతకు ముందు జోర్హాట్ జిల్లాలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గాన్ని గిరిజనుల కోసం కేటాయించారు. ఈ నదీ ద్వీపం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. మరి ఇంతటి గుర్తింపు ఉన్న ఈ ద్వీపం యొక్క విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

ఇవాళ మనం చూసే మజులిని తయారు చేసింది సంస్కృతి, దార్మికతే.

ఇవాళ మనం చూసే మజులిని తయారు చేసింది సంస్కృతి, దార్మికతే.

ఇవాళ మనం చూసే మజులిని తయారు చేసింది సంస్కృతి, దార్మికతే. సత్రాలు లేదా సామాజిక-సాంస్కృతిక సంస్థలే ఈ నదీ ద్వీపానికి జీవం వంటివి. ఈ ద్వీపంలో చాలామందికి సన్యాసీమఠాలు, వారసత్వాలుగా పనిచేసే సత్రాలు సుమారు 25 ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ఆసక్తికరంగా ఉంటాయి.

భారతదేశ ప్రధాన శాస్త్రీయ నృత్య కృత్యం – సత్రియా నృత్యానికి

భారతదేశ ప్రధాన శాస్త్రీయ నృత్య కృత్యం – సత్రియా నృత్యానికి

మొట్టమొదటి సారిగా అస్సాం ప్రసిద్ధ సాధువు శ్రీమంత శంకరదేవచే తర్వాత అతని శిష్యుడు మాధవదేవ్ చే ప్రచారం చేయబడిన ఈ సత్రాలను నవీన - వైష్ణవమత సంస్కృతికి కేంద్రాలుగా పరిగణిస్తారు. ఇక్కడ, వైష్ణవమతాన్ని బోధించి, ప్రచారం చేయడమే కాక, ఇవి భారతదేశ ప్రధాన శాస్త్రీయ నృత్య కృత్యం - సత్రియా నృత్యానికి కూడా నివాసం. సత్రాలు ( క్సత్రాలు గా అస్సాం భాషలో పలికే) అస్సాం లోని మొదటి ధార్మిక గురువు శ్రీమంత శంకర దేవుని నవీన - వైష్ణవమత ప్రవచనాలకు కట్టుబడిన సామాజిక-సాంస్కృతిక సంస్థలు.

ఈ సత్రాలు లేకుండా మజులి పర్యాటక రంగం పూర్తి కాదు

ఈ సత్రాలు లేకుండా మజులి పర్యాటక రంగం పూర్తి కాదు

ఈ సత్రాలు లేకుండా మజులి పర్యాటక రంగం పూర్తి కాదు. ప్రతి సత్రం కొన్ని వేర్వేరు బోధనలను చేస్తూ ఉన్నప్పటికీ ఆ కొంచం అస్సాం సంస్కృతి, సంప్రదాయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. దాని విశిష్టమైన లక్షణాన్ని కల్గిఉంది. మజులిలోని కమలబరి సత్రం ఎంతో ప్రభావవంతమైన, ప్రసిద్ధి చెందిన సత్రాలలో ఒకటి అయితే, అనియతి సత్రం పాలనం పండుగకు, అప్సర నృత్యానికి ప్రసిద్ది చెందింది. బెంగానాతి సత్రం, శామగురి సత్రం మజులిలోని ముఖ్యమైన రెండు ఇతర సత్రాలు.

అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజెులి ద్వీప సౌందర్యాన్ని

అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజెులి ద్వీప సౌందర్యాన్ని

అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజెులి ద్వీప సౌందర్యాన్ని మనసారా వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్ లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మధురానుభూతి కలిగిస్తుంది.

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు...

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు...

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలిచి ఉన్నాయి.

ఇంత సౌందర్యం ఉన్న ఈ ప్రదేశంపై

ఇంత సౌందర్యం ఉన్న ఈ ప్రదేశంపై

ఇంత సౌందర్యం ఉన్న ఈ ప్రదేశంపై మానవుడి కన్ను పడలేదు కాబట్టే ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతున్నది.

 కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం

కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం

ఏ బుతువులలో చూసినా. ఈ అద్భుత ద్వీపంలో మానవ సంచారం ఉన్నప్పటికీ...గత ఐదువందల సంవత్సరాలకుపైగానే మానవులు నివసిస్తున్నప్పటికీ.. నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది. అందుకే కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు.

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవంలో శ్రీకృష్ణుడు గోపికల రాసలీలల

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవంలో శ్రీకృష్ణుడు గోపికల రాసలీలల

అసోం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్ కపుల్ ఇక్కడ సందడి చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ద్వీపంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవంలో శ్రీకృష్ణుడు గోపికల రాసలీలలను జరుపుతారు. అది ఒక రకమైన ఆధ్యాత్మిక ఉత్సవం.

గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు

గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు

ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటాయి. కొత్త వాతావరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలనుకునే జంటలకు మజులి ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

 భారత దేశానికి చెందిన సముద్ర, నదీ ఆహార పదార్థాలు ఇక్కడ చాలా రుచిగా ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఐ

భారత దేశానికి చెందిన సముద్ర, నదీ ఆహార పదార్థాలు ఇక్కడ చాలా రుచిగా ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఐ

ఈశాన్య భారత దేశానికి చెందిన సముద్ర, నదీ ఆహార పదార్థాలు ఇక్కడ చాలా రుచిగా ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ ఐల్యాండ్ ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.

జోర్ధార్ నుంచి ఈ మజూలి ఐ ల్యాండ్ కు

జోర్ధార్ నుంచి ఈ మజూలి ఐ ల్యాండ్ కు

జోర్ధార్ నుంచి ఈ మజూలి ఐ ల్యాండ్ కు రెండు పడవులు వెలుతాయి. ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు. వసతి సౌకర్యం బాగుంది. అద్దెకు బైకులు దొరుకుతాయి. వాటి ద్వారా ఈ ఐల్యాండ్ ను చుట్టేసిరావచ్చు.

మజులి ఎలా వెళ్లాలి?

మజులి ఎలా వెళ్లాలి?

నదీ ద్వీపం అయినందున మజూలి చేరడానికి ఒకే ఒక్క దారి బ్రహ్మపుత్ర నది మీదుగా ఫెర్రీల ద్వారానే జోర్హాట్ లోని నిమతి ఘాట్ ద్వారా ఫెర్రీ సేవలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X