Search
  • Follow NativePlanet
Share
» »మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

By Venkatakarunasri

మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి అంటే మనందరికీ ఎనలేని భక్తి. కోరికలు తీర్చే ఈ పానకాలస్వామికి మహా చరిత్ర వుంది. ఆయనను ఒక్కసారి దర్శించుకుని పానకం సమర్పిస్తే చాలు పాపాలు పోయి పుణ్యంకలుగుతుందని కోరికలు తీరిపోతాయని ప్రసిద్ధి.అయితే ఈ మంగళగిరి పానకాలస్వామికి మరోవిశిష్టత కూడా వుంది.ఆయనకు ఎంత పానకంపోయాలనుకుంటామో అందులో సగం తీసుకుని మిగతాది మనకు ఇచ్చేస్తారు. ఆ ఇచ్చిన ప్రసాదం సాక్షాత్తూ ఆ స్వామివారే ఇచ్చారని మహాప్రసాదంగా తీస్కోనివస్తాం. ఇక స్వామివారు ప్రసాదం తీసుకొనేటప్పుడు మనిషి గుటకలేసినట్లే గుటకేసి పానకాన్ని మహాఇష్టంగా తాగుతారు. అయితే భక్తులు స్వామివారికి ఇచ్చిన పానకం దేవునికి సమర్పిస్తారు. మరి ఆ పానకం ఎటు వెళుతుంది.ఆ పానకం స్వామివారు తాగుతున్నారు సరే.అంతపానకం ఎక్కడికి వెళుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇది స్వామివారి మహిమఅనేది మనందరి నమ్మకం.

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఎక్కడుంది?

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లో నే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతం గా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామి వారికీ పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

అయితే వందలాది యేళ్ళ నుండి స్వామివారు ఇక్కడ కొలువైవున్నారు. ఇన్నేళ్ళనుండి పోసినపానకం ఎక్కడికి వెళుతోందనేది ఆసక్తికరం. ఇందులో స్వామిని కాని, ఆయన మహిమను కాని తక్కువచేయటం కాదు. ఆయన మనందరికీ దేవుడు. కొండపై మన కష్టాలను తీర్చే దేవుడు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

కాకపోతే సైన్స్ పరంగా ఏమైనా విశిష్టతవుందా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక ఈ ఆలయచరిత్రకు వస్తే కొన్నివేల కోట్ల క్రితమే పరియాత్రరాజు కొడుకు హ్రస్వశృంగికి శారీరకవైకల్యం వుంది. దీంతో ఈయన తన మనోవేదనను ఎవ్వరికిచెప్పుకోవాలో తెలియకమదనపడేవారు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఒకరోజు దేవదేవుడిని కోరుకుంటే తీరిపోతుందని విష్ణుమూర్తికోసం ఘోరతపస్సు చేసాడు. అలా కొన్నియేళ్ళు చేసాడు.తన తపస్సుకోసం వైకల్యం కారణంగా ఏనుగు ఆకారంలో మోకరిల్లి విష్ణునామస్మరణ

చేస్తూ తపస్సుచేసాడు.అలానేచేస్తూచేస్తూపర్వతం లా మారిపోయాడు.పర్వతంలా మారిపోయిన అతనిపై నరసింహస్వామివెలిసాడని ప్రతీతి.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

అయితే ఆ శ్రీవిష్ణువు సుదర్శనచక్రంకూడా మంగళగిరి గుహలకు వచ్చిందనేది మరో కథ. కృతయుగంలో జరిగిన కథ ప్రకారం నమూచీ అనే రాక్షసుడు దేవదేవతలనుపీడిస్తూవుండేవాడు. అయితే ఆ దేవదేవుళ్ళు మహా విష్ణువును వేడుకోగా కోపంతో రగిలిపోయి సుదర్శనచక్రం ప్రయోగించాడు ఆవిష్ణువు.దాని నుంచి తప్పించుకొనుటకు ఆ రాక్షసుడు మంగళగిరిలోని పర్వత దాక్కుంటాడు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

కాని సుదర్శనచక్రం నుండి తప్పించుకోవటం ఎవ్వరికి సాధ్యంకాదు. ముల్లోకాలలో ఎక్కడున్నాసరే వధకు గురవ్వాల్సిందే. నమూచి కూడా గుహల్లో దాక్కున్నా కూడా సుదర్శనచక్రం వేటుకి బలౌతాడు. అయితే అక్కడికివచ్చి చచ్చిపడిపోయివున్న నమూచీని చూసిన విష్ణువుకు కోపం చల్లారదు. ఆగ్రహంతో వూగిపోతూవుంటాడు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఆయన్ను చూసేందుకు కూడా దేవతలు భయపడ్డారు.దాంతో ఆయనను చల్లబరచాలని పానకంను ఇచ్చి చల్లబరచేప్రయత్నం చేసాడు. అయితే ఆయన పానకం కొంతతీసుకుని కొంత తిరిగి ఇచ్చేయటంతో వాటిని వాళ్ళుకూడా దేవదేవుడి ప్రసాదంగా భావించి తీసుకున్నారు. ఇక అక్కడినుంచి సాక్ష్యాత్తూ ఆ విష్ణువే నరసింహరూపంలో కొలువై సగం పానకం దేవుడు తాగి మిగిలి పోయిన సగం మనకు ఇచ్చేస్తున్నాడనేది భక్తులనమ్మకం.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఇక నమూచిని సంహరించగానే రక్తం యేరులైపారిందట.అదే సరస్సుగా మారి ఎరుపురంగుపులుముకుందనేది శాస్త్రం.ఆ కారణంగానే గుడి యెదుట ఇళ్ళులేకుండా వాగులువున్నాయట. ఇక స్వామిని ఇప్పటికీ దర్శించుకొనేందుకు దేవతలు వస్తారని,సాయంత్రంవేళ సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనివ్వరనేది అర్చకులు చెబుతున్నారు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

అయితే ఇదంతాదేవుడుపై మనకున్న నమ్మకం.హేతువాదులు పానకం ఎక్కడికివెళుతుంది అని అడిగితేమాత్రం కొండప్రాంతంలో గంధకం వుంది.కాబట్టి పానకంను పీల్చేసుకుంటుందని చెప్పారు. అయితే ప్రయోగాలు చేయాలనిచూసినా కూడా ఎవరివల్లా కాలేదు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

కొండను తవ్వటానికి ఛాన్సేలేదు.అంతపెద్ద కొండను తవ్వడం సాధ్యంకాదని తేల్చేసారు. కొంతమందైతే కొండకింద అగ్నిపర్వతం వుందంటారు.కాని ఇండియాలో ఎక్కడా అగ్నిపర్వతాలు లేవని సైంటిస్టులు ఎప్పుడోప్రకటించారుకాని ఒకవేళ వున్నా లోపల లావాజ్వాలను ఆపటం ఎవ్వరికీసాధ్యం కాదు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

పైగా అగ్నిపర్వతం వున్న ప్రాంతాల్లో వేడిగా వుంటుంది. ఎంతవేడి అంటే భూగర్భజలాలు కూడా అక్కడవుండవు.వున్నా కూడా ఆ వేడికి అవేప్పుడో ఆవిరైపోతాయి.కాబట్టి అగ్ని పర్వతం వుండే ఛాన్సేలేదు.పైగా వందల సంల తర్వాతనైనా అది పేలకతప్పదు.కాకపోతే అగ్నిపర్వతంవుంది కాబట్టే పానకం ఎంత పోసినా పీల్చుకుంటుందిఅనేది హేతువాదులు చెబుతున్న అబద్ధం.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

అయితే అందరి దృష్టీ ఇప్పుడు మళ్ళీ ఫాస్పేట్ పై పడింది.ఎందుకంటే విజయవాడ పరిసరప్రాంతాల్లో ఆప్టేట్ ఖనిజం వుంది అందులో ఫాస్పేట్ వుంది.కాబట్టి మంగళగిరికొండపై కూడా వుంటుందిఅని కొండలో వున్న నెర్రలకారణంగా కూడా ఫాస్పేట్ జారిపోవచ్చనేది కొంతమంది సైంటిస్టులమాట.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఇక చుట్టూవున్న కృష్ణానదితో కూడా కొండకు లింకు వుండొచ్చనిఅక్కడనుండి నెర్రలద్వారా వచ్చే పానకం ఎక్కడినుండైనా క్రిందకు రావచ్చని చెబుతున్నారు. అందుకే నేర్రాలకారణంగా కూడా అప్పుడప్పుడు చిన్నప్రకంపనలు వస్తాయనికూడా అంటున్నారు. కాని ఇన్నిచెప్పినా భక్తులు మాత్రం ఇవన్నీ పట్టించుకోరు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మన హిందూదేవుళ్ళు ఎక్కడున్నా సైన్స్ పేరు చెబుతూ ఏదోఒకటి చేసేస్తుంటారని మండిపడిపోతూవుంటారు. మరి ఇంతసైన్స్ తెలిసినవాళ్ళు కూడా కొన్నిచెప్పలేకపోతున్నారు.చిన్న అన్నంముద్దో చాక్లెట్టూపడితే 10నిలలో ఈగలు,దోమలు వచ్చిచేరుకుంటాయి.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

కాని మంగళగిరి గుట్టపై బెల్లంపానకం డ్రమ్ముల కొద్దీ వస్తూవుంటుంది. స్వామి వారికి నిత్యం నైవేద్యంగా పానకం సమర్పిస్తూవుంటారు. కానీ భూతద్దంపెట్టి వెతికినా కూడా ఎక్కడా చిన్నచీమకూడా కనిపించదు.

ఇదంతా స్వామివారి మహిమే.పైగా ఇక్కడ నెలవైన దేవుడి మొహంమాత్రమే వుంటుంది.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

అది కూడా కవచం కప్పినట్లుగా. ఎందుకంటే ఆయన్ వుగ్రరూపంచూసి తట్టుకోలేం.మిగతా నరసింహుని క్షేత్రాల్లో మొత్తం శరీరంకనిపిస్తుంది.కాని మంగళగిరిలో మాత్రం ప్రత్యేకమైన రూపం.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఇక్కడ చూడవలసినవి

ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్, గుంటూరు

గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య మాత్రం తగ్గలేదు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయం లో నే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

కోటప్ప కొండ, గుంటూరు

గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది. కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఈ గ్రామం చుట్టుతా అనేకే శిఖరాలు ఉన్నపటికీ త్రికుటాచలం లేదా త్రికుటాద్రి అనబడే శిఖరాలు చాలా ప్రాచుర్యం పొందినవి. ఈ మూడు శిఖరాలు ఈ గ్రామం లో అన్ని వైపులా చక్కగా కనిపిస్తాయి. ఈ శిఖరాలు హిందువుల పౌరాణిక దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులయిన - త్రిమూర్తుల పేరుమీద పిలవబడుతున్నాయి. దక్షిణ కాశి లేదా కాశి అఫ్ సౌత్ గా పిలవబడే గుత్తికొండ పట్టణం ఈ కోటప్పకొండ కి చాల దగ్గరలో ఉన్నది.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

కొండవీడు ఫోర్ట్, గుంటూరు

గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి. ఈ ఫోర్ట్ ని కట్టిన సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గర గా ఉన్న దేవాలయాలు. ఈ దేవాలయాలు ఇతర అనేక దేవాలయాల దారిలో ఉన్నాయి. ఈ కోటకు చేరే దారి ముఖద్వారం , ఈ కోటని నిర్మించిన కొండ దిగువ భాగాన ఉంటుంది. ఈ దారితోబాటు , ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

PC: youtube

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి గుంటూరు నగరం ప్రధాన కేంద్రం. అందువల్ల, ఇక్కడ లభించే బస్సు సర్వీసులు అమోఘం. చెన్నై, కోల్ కత్తా అలాగే హైదరాబాద్ వంటి ఎన్నో జాతీయ రహదారులు ఈ గుంటూరు నగరానికి కలుస్తాయి. హైదరాబాద్ రహదారి ద్వారా ఢిల్లీ మరియు ముంబై నగరాలకు చేరుకోవచ్చు.

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

రైలు మార్గం

గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉండడానికి గల కారణం దక్షిణ రైల్వే శాఖ యొక్క నిర్వహణ. గుంటూరు లో ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్ ఇంకా విజయవాడ వంటి ఎన్నో పట్టణాల నుండి రోజువారి రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. టాక్సీ , బస్సు లేదా ఆటో రిక్షాల సేవలు ఈ రైల్వే స్టేషన్ సమీపంలో లభిస్తాయి.

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

మంగళగిరి పానకాలస్వామి అగ్నిపర్వతం మిస్టరీ !

వాయు మార్గం

గుంటూరు లో విమానాశ్రయం లేదు. స్థానిక ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. ఇది 96 కి. మీ. ల దూరం ఇక్కడికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. హైదరాబాద్ లో ఉన్న ఈ విమానాశ్రయం ఎన్నో ప్రధాన నగరాలకి అలాగే పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉండడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనుసంధానమై ఉంది. ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ ద్వారా గుంటూరు కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి గుంటూరు కి చేరుకునేందుకు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X