Search
  • Follow NativePlanet
Share
» »మాతృశ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రపంచంలోని ఏకైక పుణ్యక్షేత్రం మన దేశంలోనే

మాతృశ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రపంచంలోని ఏకైక పుణ్యక్షేత్రం మన దేశంలోనే

గుజరాత్ లోని మాతృగయ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

By Kishore

అమృత బిందువులు పడ్డ ప్రాంతం.అమృత బిందువులు పడ్డ ప్రాంతం.

మాతృగయ భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మాతృ దేవతలకు అంటే చనిపోయిన తల్లికి శ్రాద్ధ కర్మలు నిర్వహించే ఏకైక పుణ్యక్షేత్రం. మాతృగయ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు దగ్గరల్లో ఉంది. మెట్టమొదటిసారిగా ఇక్కడే కపిల మహర్షి తన తల్లికి శ్రాద్ధకర్మలను నిర్వహించినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఇది ఆచారంగా వస్తోంది. ఇక భారత దేశంలోని ఐదు పవిత్రమైన పుష్కరాలైన మానససరోవరం, పంప సరోవరం, పుష్కర సరోవరం, బిందు సరోవరం, నారాయణ సరోవరంలలో ఒకటైన బిందు సరోవరం మాతృగయలోనే ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన చోటు కాబట్టే దేశం నుంచే కాకుండా విదేశాల్లో ఉంటూ భారతీయ సంప్రదాయాల పై నమ్మకం ఉన్న చాలా మంది ఇక్కడకు వచ్చి తమ మాతృ దేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహించి వెలుతుంటారు. ఇంతటి విశిష్టమైన మాతృగయ గురించి స్థల విశిష్టత, అక్కడకు దగ్గర్లో ఉన్న దేవాలయాల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలుబహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలు

1. ఐదు సరోవరాల్లో

1. ఐదు సరోవరాల్లో

Image Source:

భారత దేశంలో ఐదు పవిత్రమైన సరోవరాల్లో బిందు సరోవర్ ఒకటి. ఇది గుజరాత్ రాష్ర్టంలో ఉన్న పఠాన్ జిల్లాలోని సిద్ధాపూర్ బిందుసరోవరం ఉంది. అహ్మదాబాద్ కు దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్రమైన సరోవరం గురించి బుుగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది.

2. పురాణ కథనం ప్రకారం

2. పురాణ కథనం ప్రకారం

Image Source:

పురాణ కథనం ప్రకారం స్వాయంభువు మనువు, శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అనే ముగ్గురు కుమార్తెలు ఉంటారు. యుక్త వయస్సు వచ్చిన దేవహుతికి తగిన వరున్ని వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు మనువుకు ప్రస్తుతం బిందు సరోవరం ఉన్న ప్రాంతానికి రాగానే కర్దముడు కనిపించాడు.

3. విమానాన్ని సృష్టించి

3. విమానాన్ని సృష్టించి

Image Source:

అతనే తన కుమారునికి సరైన వరుడుగా భావించి వారిద్ధరికి వివాహం జరిపిస్తారు. అటు పై కర్దముడు సంతానం కోసం ఓ విమానాన్ని సృష్టించి తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయశాడు.

4. కుమారుడు కావాలనుకొని

4. కుమారుడు కావాలనుకొని

Image Source:

అలా వారికి సరస్వతి నదిలో స్నానం చేసిన తర్వాత కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అనే కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు వివాహం చేసిన తర్వాత కర్దముడికి తనకు కుమారుడు ఉంటే బాటుందని భావించాడు.

5. విష్ణువు ఆనంద భాష్పాలు రాల్చడం వల్లే

5. విష్ణువు ఆనంద భాష్పాలు రాల్చడం వల్లే

Image Source:

దీంతో ఇక్కడ తపస్సు చేసి విష్ణుభగవానుడిని ప్రసన్నం చేసుకుంటాడు. తన ప్రియ భక్తుడైన కర్దముడిని చూసిన వెంటనే విష్ణువు ఆనంద భాష్పాలు రాల్చాడని ఆ ఆనంద భాష్పాల వల్లే ఇక్కడ బిందు సరోవరం ఏర్పడిందని చెబుతారు. ఇక కర్థముడికి కలిగిన కుమారుడే కపిలుడు.

6.తల్లికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు

6.తల్లికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు

Image Source:

ఇతడు సాక్షాత్తు మహావిష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఇతడు పుట్టుకతోనే పరిపూర్ణమైన జ్ఞానంతో జన్మించాడని చెబుతారు. అటు పై తన తల్లికి సాంఖ్యయోగ బోధన చేసి ఆమెకు మోక్ష మార్గం వైపున నడిపించాడు. తన తల్లి మరణించిన తర్వాత ఆమెకు ఇక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించారు.

7. అప్పటి నుంచి ఆచారం కొనసాగుతోంది

7. అప్పటి నుంచి ఆచారం కొనసాగుతోంది

7. అప్పటి నుంచి ఆచారం కొనసాగుతోంది

Image Source:

అప్పటి నుంచి మాతృ దేవతలకు శ్రాద్ధం పెట్టే ఆచారం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక త్రేత, ద్వాపర యుగాల్లో కూడా బిందు సరోవరం ప్రస్తావన ఉంది. ఇక్కడ పరుశురాముడు కూడా తన తల్లి రేణుకా దేవికి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు.

8. పరుశురాముడు కూడా

8. పరుశురాముడు కూడా

Image Source:

అందుకే ఇక్కడ పరుశురాముడు శ్రాద్ధ కర్మలు ఆచరిస్తున్న భంగిమలో పరుశురామాలయం ఉంది. భారత దేశంలో తల్లికి శ్రాద్ధ కర్మలు నిర్వహించే ప్రదేశం ఇదొక్కటే. అంతే కాకుండా కూతుళ్లు కూడా తమ మాతృమూర్తికి ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అనుమతిస్తారు. ఇటువంటి ప్రదేశం కూడా ఇదొక్కటే.

9. ఈ ఆలయాలన్నీ చూడవచ్చు

9. ఈ ఆలయాలన్నీ చూడవచ్చు

Image Source:

బిందుసరోవరం తీరంలో కపిలమహాముని ఆలయం కనిపిస్తుంది. దీని పక్కన కర్దమ ప్రజాపతి ఆలయం, దేవభూతి ఆలయం, గయగధాధర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు దగ్గర్లోనే పెద్ద రావి చెట్టు ఉంది. ఇక్కడ యాత్రికులు దేవభూతిని ప్రధానంగా ఆరాధిస్తారు.

10. సరస్వతి నది కూడా

10. సరస్వతి నది కూడా

Image Source:

ఈ సరోవరాన్ని చుట్టి సరస్వతి నది ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారు. ప్రయితే ఈ సరోవరంలో ప్రస్తుతం యాత్రికులు స్నానం చేయడానికి తగిన నీరు లేకపోవడం వల్ల ఈ సరోవరం నుంచి తల పై నీటిని చల్లుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు.

11. ప్రయాణం ఇలా

11. ప్రయాణం ఇలా

Image Source:

గుజరాత్ లోని అన్ని ముఖ్యపట్టణాల నుంచి సిద్ధాపూర్ కు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. సిద్ధాపూర్ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం ఉచిత ధర్మసత్రాలు ఉన్నాయి.

12. వసతి ఇలా

12. వసతి ఇలా

Image Source:

అహ్మదాబాద్ నుంచి రెండు గంటలు మాత్రమే ఇక్కడకు ప్రయాణం. అందువల్ల అహ్మదాబాద్ పర్యటనలకు వెళ్లిన వారు బిందు సరోవరానికి తప్పకుండా వెళుతుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X