» »సోన్ భండార్ గుహలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా ?

సోన్ భండార్ గుహలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా ?

Posted By: Venkatakarunasri

Latest: ఎ.ఆర్.రహమాన్ కుటుంబ సభ్యులతో తరచూ వచ్చే దర్గా ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అంతుచిక్కని వందల మిస్టరీలున్నాయి. వాటిలో సోన్ భండార్ గుహల్లో దాచిన నిధి మిస్టరీ కూడా ఒకటి. సోన్ భండార్ గుహల్లో ఇటీవల కేరళలో బయలుపడ్డ అనంతపద్మనాభ ఆలయంలోని నిధి కన్నా అధిక విలువైన ఖజానా మరియు నిదినిక్షేపాలు కలవు అని ఆ గుహలోనే గల శాసనాలు తెలియచేస్తున్నాయి.

ఈ గుహలో గల విలువైన సంపదను సొంతం చేసుకోవాలని వేల సంవత్సరాల నుండి ఎంతో మంది చక్రవర్తులు ప్రయత్నించారు. కానీ వారికి వీలు కాలేదు. బ్రిటీష్ పాలకులు సైతం ఈ నిధిని దోచుకోటానికి సర్వశక్తులు ప్రయత్నం చేశారు.

వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది.దాదాపుగా 100సం.ల నుండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సైంటిస్టులు రిసెర్చ్ చేస్తున్నారు.ఆఖరికి నేటి ప్రభుత్వాలు కొంతమంది ఔత్సాహికులు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే ఫలితం మాత్రం శూన్యం.ఇంతకీ అంతుచిక్కని ఆ రహస్య నిధి ఎక్కడ వుంది? ఈ నిధి మిస్టరీ ఏమిటి? ఈ నిధి రహస్యాన్ని చేధించే మార్గం ఏమిటి?

అంతుచిక్కని సోన్ భండార్ గుహ రహస్యం !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. సోన్ భండార్

1. సోన్ భండార్

సోన్ భండార్ గుహ బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో గల రాజగిరి అను పట్టణమునకు అతి సమీపంలో కలదు.

PC:youtube

2. మగధ సామ్రాజ్యము

2. మగధ సామ్రాజ్యము

రాజగిరి క్రీ.పూ భారతదేశంలో విలసిల్లిన మగధ సామ్రాజ్యమునకు రాజధానిగా వుండేది. మగధ చక్రవర్తులలో సుప్రసిద్ధుడైన బింబిసారుడు సోన్ భండార్ గుహల్లో అమూల్యమైన నిదినిక్షేపాలను దాచాడని అక్కడున్న శాసనాలను బట్టి తెలుస్తున్నది.

PC:youtube

3. సింహాసనం

3. సింహాసనం

బింబిసారునికి వయస్సు మళ్ళిన తరువాత మగధసామ్రాజ్య సింహాసనం కోసం అతని కుమారులు అంతర్గత కుమ్ములాటలు జరుపుకుంటారు.

PC:youtube

4. సోన్ భండార్ గుహలు

4. సోన్ భండార్ గుహలు

బింబిసారుని కుమారులలో అజాతశత్రువు అను వాడు తన తల్లితండ్రులను సోన్ భండార్ గుహల్లో బంధించి సింహాసనం ఆక్రమిస్తాడు.

PC:youtube

5. బింబిసారుడు

5. బింబిసారుడు

అజాతశత్రువు ఇలాంటి దురాగతాలకు పాల్పడతాడని ముందే ఊహించిన బింబిసారుడు తనకున్న విలువైన సంపాదనను ఈ గుహలో దాచిపెట్టాడు.

PC:youtube

6. ఆ గుహ

6. ఆ గుహ

తలుపులు తెరిచే మార్గం తెలుపమని అజాతశత్రువు తన తల్లితండ్రులను హింసిస్తాడు.

PC:youtube

7. భోజనం

7. భోజనం

కనీసం వారికి భోజనం కూడా పెట్టకుండా ఆకలితో మాడేటట్లు చేస్తాడు.

PC:youtube

8. అజాతశత్రువు

8. అజాతశత్రువు

ఆ నిధి రహస్యాన్ని కనుక్కోటానికి అజాతశత్రువు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతనికి వీలు కాదు.

PC:youtube

9. బింబిసారుడు

9. బింబిసారుడు

కొన్ని రోజులకు బింబిసారుడు మరణిస్తాడు.దానితో అజాతశత్రువుకు పిచ్చి పడుతుంది.

PC:youtube

10. బౌద్ధగురువులు

10. బౌద్ధగురువులు

తరువాత కొంతమంది బౌద్ధగురువులు అజాతశత్రువుకు యోగ ద్వారా అతని పిచ్చిని నయం చేశారు.

PC:youtube

11. బౌద్ధమత బోధనలు

11. బౌద్ధమత బోధనలు

బౌద్ధమత బోధనలకు ప్రభావితుడైన అజాతశత్రువు తరువాత ఆ నిధి గురించి పట్టించుకోవటం మానేస్తాడు.

PC:youtube

12. లిపి

12. లిపి

బింబిసారుడు తను మరణించే ముందు ఈ గుహ యొక్క రహస్యాన్ని ఒక అర్థం కాని లిపిలో ఆ గుహలోనే చెక్కించాడు.

PC:youtube

13. 2500 సంవత్సరాలు

13. 2500 సంవత్సరాలు

ఆ లిపిని డీకోడ్ చేయగలిగితే ఆ నిధి సొంతమవుతుంది. ఆ లిపిని డీకోడ్ చేయటానికి 2500 సంవత్సరాల నుండి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఎటువంటి ఫలితం లభించలేదు.

PC:youtube

14. గుహ రహస్యద్వారం

14. గుహ రహస్యద్వారం

చివరికి బ్రిటీష్ అధికారులు సైతం ఫిరంగుల ద్వారా ఆ గుహ తలుపులు పగులగొట్టడానికి ప్రయత్నించినట్లు ఆ గుహ రహస్యద్వారం పై గల గుర్తులు నేటికీ సాక్ష్యం ఇస్తున్నాయి.

PC:youtube

15. ఒక పెద్ద రాతి బండ

15. ఒక పెద్ద రాతి బండ

ఈ గుహ మొత్తం ఒక పెద్ద రాతి బండలో తొలచబడింది. ఈ గుహలోకి ప్రవేశించగానే 10.4మీ పొడవు, 5.2మీ ల వెడల్పుతో,1.5మీ ల ఎత్తు గల ఒక గది వస్తుంది.

PC:youtube

16. ఖజానా

16. ఖజానా

ఈ గది ఖజానాను రక్షించగల సైనికులదిగా తెలుస్తున్నది. ఈ గది వెనుక వైపు గల గోడ ద్వారా ఖజానాకు వెళ్ళే దారి కలదు.

PC:youtube

17. ఒక పెద్ద రాతి బండ

17. ఒక పెద్ద రాతి బండ

ఈ మార్గాన్ని ఒక పెద్ద రాతి బండతో తయారు చేసిన తలుపుతో మూసివేసారు. ఈ తలుపునే ఇంతవరకు ఎవ్వరూ తెరవలేకపోయారు.

PC:youtube

18. మరొక గుహ

18. మరొక గుహ

ఈ గదిలో ఒక గోడ మీద అర్థంకాని లిపిలో కొన్ని పదాలు వ్రాయబడ్డాయి. వాటిని చదవగలిగితే వేల కోట్ల విలువ చేసే సంపద రహస్యం చేదించినట్లే.ఈ గుహకు ఆనుకునే మరొక గుహ వున్నది.

PC:youtube

19. తీర్ధంకరుల విగ్రహాలు

19. తీర్ధంకరుల విగ్రహాలు

అందులో 6 మంది జైన తీర్ధంకరుల విగ్రహాలు చెక్కబడినాయి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బీహార్ వెళితే తప్పకుండా ఈ గుహను దర్శించండి. అక్కడున్న కోడ్ ను డీకోడ్ చేయగలరేమో ప్రయత్నించండి.

PC:youtube

20. రాజగిర్ వాతావరణం

20. రాజగిర్ వాతావరణం

వేసవులు వెచ్చగా వుండి, శీతాకాలాలు ఓ మాదిరి చల్లగా వుంటాయి, కనుక రాజగిర్ సందర్శనకు అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో అనువైన కాలం.

PC:youtube

21. ఎలా చేరుకోవాలి

21. ఎలా చేరుకోవాలి

రాజగిర్ కు ఒక రైల్వే స్టేషన్ వుంది గానీ, స్వంత విమానాశ్రయం లేదు కనుక ఇక్కడికి వెళ్ళాలంటే ముందే సిద్ధం కావాలి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా ఆధార పడ దగ్గదే.

22. రాజగిర్ పర్యాటకం

22. రాజగిర్ పర్యాటకం

రాజగిర్ పర్యాటకం గొప్ప విశ్రా౦తినిచ్చే పర్యాటక కేంద్రం. రాజగిర్ నగరం ఒక ప్రత్యేకమైన అలౌకికమైన ఆకర్షణ కలిగి ఆధునిక పోకడల వల్ల ఇంకా చెడిపోలేదు.

PC:youtube

23. వేడి నీటి బుగ్గలు

23. వేడి నీటి బుగ్గలు

ధ్యానం చేసి ఆత్మాన్వేషణ చేయడానికి ఇది చక్కటి ప్రాంతం. రాజగిర్ లోని వేడి నీటి బుగ్గలు బ్రహ్మ కుండ్ వల్ల ఇక్కడి పర్యాటకం ఆరోగ్య, శీతాకాల విడిదిగా రూపొందుతోంది.

PC:youtube

Please Wait while comments are loading...