
భారతదేశం కొన్ని దేవాలయాలకు ప్రసిద్ధి.ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించటానికి దేశవిదేశాల నుంచి భక్తులోస్తూంటారు.అయితే కొన్ని దేవాలయాలు ఎలా వెలసాయి? అక్కడి శిల్పకళానైపుణ్యం ఇప్పటికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.ఇదిలా వుంటే దేవుడునమ్మకం నుండి కొన్ని ఆచారాలనేవి వెలుగులోకొచ్చాయ్.అయితే ఈ తొమ్మిది ఆలయాలలో అందరిని ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని విచిత్ర ఆచారాలు వున్నాయట.మరి ఆ వింతఆచారాలు ఏంటిఅనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
మెహందీపూర్ బాలాజీ ఆలయం
రాజస్థాన్ లోని చిన్న దౌసాజిల్లాలో మెహందీపూర్ బాలాజీ ఆలయం వుంది.దేశంలోనే వివిధప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు ప్రతీరోజూ వారికి పట్టిన దెయ్యాలను ఆత్మలను వదిలించుకోవటానికి ఈ ఆలయానికి వస్తూంటారు.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
మెహందీపూర్ బాలాజీ ఆలయం
అయితే ఈ ఆలయంలో పట్టిన దెయ్యాన్ని వదిలించటానికి,వారి ఒంటిమీద బాగా మరగించిన వేడి నీటిని పోసి గాల్లో వురేసేవిధంగా వ్రేలాడ దీస్తూ హింసించి,వారి తలని గోడకు వ్రేలాడదీసి బాగా కొడుతుంటారట.ఆత్మలను పారద్రోలే ఈ ఆలయంలో ప్రసాదంలాంటివి ఏంవుండవ్.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
మెహందీపూర్ బాలాజీ ఆలయం
ఇంకా ఆత్మని వదిలించుకుని వెళ్ళేభక్తులు మళ్ళీ వెనకకి తిరిగి,ఈ ఆలయాన్ని చూడకుండా వెళ్లిపోవాలనే నియమం కూడా వుంది.భారతదేశంలోనే దెయ్యాలను పారద్రోలే ఏకైక ఆలయంగా ఈ ఆలయం ఇప్పటికే ప్రచారంలో వుంది.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
కామాఖ్యాదేవి ఆలయం, అస్సాం
అస్సాంలోని గౌహతీ ప్రాంతంలోని నిలచల్ కొండప్రాంతంలో కామాఖ్యాదేవిఆలయం వుంది.భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో ఇదికూడా ఒకటి. ఈ దేవాలయంలో శిల్పంఅనేది వుండదు.అయితే సతీదేవి యొక్క శరీరభాగాలు పడి దేశంలో వివిధప్రాంతాల్లో శక్తిపీఠాలు వెలసాయి. సతీదేవి శరీరభాగం పడిన ఈ ప్రాంతంకూడా ఒక శక్తిపీఠంగాచెబుతారు.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
కామాఖ్యాదేవి ఆలయం, అస్సాం
అలా ఈ ఆలయంలో ఎరుపుపట్టు చీరతో కప్పబడిన శివుని భార్యా దేవి సతి యొక్క పూజలందుకుంటుంది. ప్రతీ సం ఋతుపవనసమయంలో అమ్మవారి ఋతుస్రావంసమయంలో మూసివేయటం జరుగుతుంది. ఆ 3రోజులు కూడా భక్తులు తాంత్రికసంతానోత్పత్తి పండుగ ఇక్కడ జరుపుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా భక్తులు ఎరుపురంగు వస్త్రంను అందిస్తారు.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
కాలభైరవ ఆలయం, వారణాశి
శివాలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరవఆలయంలో ఒక వింతఆచారం వుంది. ఇక్కడి కాలభైరవవిగ్రహానినోటిలో మద్యాన్ని పోస్తారు. అంతేకాకుండా భక్తులకి కూడా ప్రసాదంగా మద్యాన్ని ఇస్తారు.
ఆలయం బయటకూడా పూజాసామాగ్రి, వేరేరకమైన దుకాణాలు ఏం వుండవు. దేవుడికి నైవేద్యంగా పోసే మందుదుకాణాలు వుంటాయి.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో దేవరగట్టు ఆలయం వుంది. ఇది ఒక ప్రాచీనఆలయంగా చెబుతారు. దసరాపండగరోజు కర్ణాటకసరిహద్దుల్లో ఇక్కడ రాత్రివరకూ ఒకరితలపైన ఒకరు కర్రలతో దాడిచేసుకుంటూ విపరీతంగా కొట్టుకుంటారు.ఇలా దాడిచేసుకున్న తర్వాత ఆ గాయాలురక్తంతో పురుషులు,రాత్రిసమయం వేడుకలో పాల్గొనటం ఇక్కడి ఆచారం.
PC:youtube

ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ఆలయాల వింతలు ఆచారాలు!
స్థంభేశ్వర్ మహాదేవటెంపుల్
గుజరాత్ లోని వడోదరాకు సమీపంలోవున్న ఈ స్తంభేశ్వర మహాదేవటెంపుల్ అరేబియాసముద్రంలో తీరంసమీపంలో వుంది. ఈ ఆలయం రోజులో కొద్దిసేపు కనిపిస్తూ అదృశ్యంఅవ్వటం ఈ ఆలయం ప్రత్యేకత.
ఈ ఆలయం ఎప్పుడూ సముద్రంలోపలే వుంటుంది. అలలపోటు తక్కువగా వున్నప్పుడు మాత్రమే ఈ ఆలయంభక్తులకు కనిపిస్తుంది.ఆ సమయంలోనే వారు స్వామిని దర్శించుకుంటారు.
PC:youtube