Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలో అత్యంత ప్రాచూర్యం పొందిన స్మారకాలను చూశారా?

భారత దేశంలో అత్యంత ప్రాచూర్యం పొందిన స్మారకాలను చూశారా?

భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే ఎన్నో కట్టడాలు ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఇందులో ప్యాలెస్ లు మొదలుకొని దేవాలయాల వరకూ ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని యునెస్కోవారిచేత గుర్తింపబడి పరిరక్షించబడే కట్టడాల జాబితాలోకి కూడా చేరాయి. ఈ కట్టడాల వాస్తుశైలి మొదలు కొని వాటి నిర్మాణానికి అనుసరించిన విధానాలు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అందువల్లే ఈ కట్టడాలు నిర్మించి ఎన్నో వందల ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఉత్తమమైన స్మారకాలకు సంబంధించిన క్లుప్తమైన సమాచారం మీ కోసం...

తాజ్ మహల్

తాజ్ మహల్

P.C: You Tube

ఉత్తరప్రదేశ్ లోని యమునానది ఒడ్డున ఆగ్రా పట్టణంలో ఈ తాజ్ మహల్ ఉంది. మొత్తం మార్బల్ నిర్మాణం. ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్ మహల్ మొఘల్, పర్షియన్, టర్కిష్ వాస్తు శైలి సమ్మిళితం. భారత దేశంలో అత్యంత ఎక్కువ మంది సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో దీనిదే అగ్రస్థానం.

మైసూర్ ప్యాలెస్

మైసూర్ ప్యాలెస్

P.C: You Tube

మైసూర్ ప్యాలెస్ చారిత్రాత్మకంగానే కాకుండా వాస్తు పరంగా చాలా ప్రఖ్యాతి గాంచిన భవనం. కర్నాటకలోని మైసూరులో ఈ ప్యాలెస్ ఉంది. దీనిని అంబా విలాస్ అని కూడా పిలుస్తారు. దీనికి దగ్గరగా చాముండి బెట్ట ఉంది.

హవామహల్, జైపూర్

హవామహల్, జైపూర్

P.C: You Tube

రాజ్ పుత్ లకు చెందిన గొప్ప కట్టడం ఈ హవామహల్. జైపూర్ కు పింక్ సిటీగా పేరు రావడానికి ఈ మహల్ కూడా కారణమని చెబుతారు. రెడ్, అండ్ స్టాండ్ స్టోన్ తో నిర్మితమైన ఈ ఐదంతస్తుల భవనాన్ని మహారాజ ప్రతాప్ సింగ్ నిర్మించారు. అప్పట్లో దీనిలో కేవలం అంత:పుర కన్యలు మాత్రమే నివశించేవారని చెబుతారు. ప్రస్తుతం ఇది గొప్ప పర్యాటక కేంద్రం కూడా.

ఛత్రపతి శివాజీ టర్మినస్

ఛత్రపతి శివాజీ టర్మినస్

P.C: You Tube

కలల నగరంగా పేరు గాంచిన ముంబైలో ఛత్రపతి శివాజీ టర్మినస్ ఉంది. దీనిని విక్టోరియా టర్మినస్ అని కూడా పిలుస్తారు. సెంట్రల్ రైల్వేస్ ప్రధాన కేంద్రమైన ఈ ఛత్రపతి శివాజీ టర్మినస్ భారత దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో మొదటి స్థానంలో ఉంటుంది.

విక్టోరియా మెమోరియల్

విక్టోరియా మెమోరియల్

P.C: You Tube

పశ్చిమ బెంగాల్ రాజధాని కొలకత్తాలో ఈ విక్టోరియా మెమోరియల్ హాల్ ఉంది. మొత్తం మార్బల్ తో నిర్మితమైన ఈ భవనం చూడటానికి విదేశీయులు సైతం ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మ్యూజియంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నగలు, వస్తువులు, ఆయుధాలను మనం చూడవచ్చు.

కుతుబ్ మినార్

కుతుబ్ మినార్

P.C: You Tube

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మినార్లలో ఢిల్లీకి దగ్గర్లో ఉన్న కుతుబ్ మినార్ ఒకటి. భారత దేశం విషయానికి వస్తే రెండో అతి పొడవైన మినార్ ఇదే. ఇక్కడ మనం ఇండో ఇస్లాం కలయికతో కూడిన వాస్తు శైలిని చూడవచ్చు. దీనిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. ప్రతి ఏడాది జూన్ నెల 22న ఈ మినార్ నీడ భూమి పై పడదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X