» »మయూర్ భంజ్ - గతించిన ఆలయాలకు ప్రయాణం !!

మయూర్ భంజ్ - గతించిన ఆలయాలకు ప్రయాణం !!

Written By:

మయూర్ భంజ్ ఒడిషా పండుగల పట్టణంగా వ్యవహరించవచ్చు. ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే పండుగలకు రాష్ట్రం నలుమూల నుండి యాత్రికులు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ చైత్ర పర్వ పండుగ గురించి మీకు తెలియాలి. ఆ పండుగ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తిస్తుంది. ఇందులో పాల్గొనటానికి వచ్చిన వారు ఇష్టంతో తమ ప్రతిభను చాటుకుంటారు, గుర్తింపును పొందుతారు.

మయూర్ భంజ్ ప్రతి రుచిని, వ్యక్తిత్వాన్ని ఏదోఒకటి ప్రతిపాదించే స్థలం ద్వారా చుట్టబడి ఉంటుంది. మయూర్ భంజ్ పర్యాటకం మయూర్భంజ్ రాజధాని బరిపడ, సిమిలిపల్ నేషనల్ పార్క్ చే అభివృద్ది చెందబడింది. దేవకుండ్ వద్ద అద్భుతమైన దృశ్యాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. పర్యాటకులు గతించిన యుగాల నుండి ఆలయాలకు ప్రయాణించే అవకాశాన్ని పోగొట్టుకున్నమనే బాధని ఖిచింగ్ వద్ద పొందుతున్నారు.

బరిపడ జగన్నాథ ఆలయం

                                                         బరిపడ జగన్నాథ ఆలయం

                                                            చిత్రకృప : Ansuman

బరిపడ

బరిపడ, మయూర్ భంజ్ జిల్లా ప్రధానకేంద్రం. బరిపడ లోపల సిమిలిపల్ నేషనల్ పార్క్ ఉంది. బరిపడ మయూర్ భంజ్ సాంస్కృతిక ప్రధానకేంద్రం, బరిపడ మయూర్భంజ్ చయు నృత్య అనేకమంది అభ్యసకులకు నిలయం.

పూరీ తర్వాత, బరిపాడ జగన్నాథుని గౌరవార్ధం జరిగే రథయాత్ర పండుగ అతిపెద్ద ఉత్సవంగా కనిపిస్తుంది. ఈ నగరం ఒరిస్సాలో రెండవ పూరి గా ప్రసిద్ది గాంచింది. బరిపడ లో సుభద్ర మాత రధాన్ని కేవలం మహిళా భక్తులు మాత్రమే లాగడం జరుగుతుంది.

ఖిచింగ్

ఖిచింగ్ పురాతన కాలంనాటి ఆలయ పట్టణం. ఈ నగరం క్రీశ. 9 వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు భంజ్ వంశీయుల రాజధానిగా ఉంది. కిచింగ్ కి ఇచ్చిన నిరంతర సాంప్రదాయ కళలు, వస్తుశిల్పం, సంస్కృతి ఆ సమయంలో నగర సౌరభాన్ని కోల్పోయింది. ఖిజింగేశ్వరి అని కూడా పిలువబడే కిచకేశ్వరి మాతను భంజ్ రాజవంశ పాలకులు ఎంతో ఇష్టంగా, ఎక్కువగా పూజించేవారు.

సిమ్లిపల్ నేషనల్ పార్క్

                                                          సిమ్లిపల్ నేషనల్ పార్క్

                                                       చిత్రకృప : Samarth Joel Ram

సిమ్లిపల్ నేషనల్ పార్క్

సిమ్లిపల్ నేషనల్ పార్కు విస్తారమైన జంతు, వృక్ష జాతులకు నిలయం. ఈ జాతీయ పార్కు కొనసాగించడానికి తోడ్పడుతున్న అంశం, ఇక్కడ కొండల ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కళ్ళకు కనిపించని దూరంలో విసిరేసిన గడ్డిలాగా కనిపించే సాల్ చెట్లతో ఈ దట్టమైన అడవి సందర్శకులకు అరుదుగా కనిపించే వన్యప్రాణుల వీక్షణాలను అందిస్తుంది.

సిమిలిపల్ నేషనల్ పార్క్ వద్ద ఏనుగులు, పులులు, అడవి దున్న, జింక, ఎలుగుబంటి, ఒట్టార్, మౌస్ జింక, అడవి పంది, ఎరుపు ముంగిస, ఎగిరే ఉడుత, సాంబార్, అనేక ఇతర జంతుజాలాల నడుమ మొరిగే జింక కూడా కలిగిఉంది.

ఇది కూడా చదవండి : గోపాల్పూర్ - పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి !!

దేవకుండ్

దేవకుండ్ అని కూడా పిలువబడే ఈ దేవకుండ్ దేవీ దేవతల స్నానపుతొట్టె అని అర్ధం. ఇది బరిపడ వెలుపల దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్రాంతం దాని సున్నితమైన లక్షణాలతో పేరుకి తగ్గట్టుగా ఉంది. దేవకుండ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడాల పట్టణంలో ఎంతో ఐకమత్యంతో పండుగలు జరుపుకుంటారు. జనవరిలోజరిగే పంటకోత పండుగ సంక్రాంతి సమయంలో దేవకుండ్ సందర్శించడం ఉత్తమం. దేవకుండ్ లో ఆధ్యాత్మిక భావంతో జరుపుకునే ఈ పండుగలు, వేడుకలు సందర్శకుల అందరి హృదయాలను చూరగొంటాయి.

పట్టణంలో రథోత్సవం

                                                             పట్టణంలో రథోత్సవం

                                                      చిత్రకృప : dhananjay_mohanta

మయూర్ భంజ్ ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం : కోల్కతా - భువనేశ్వర్ రోడ్డు మార్గంలో మయూర్ భంజ్ కలదు. ఇది భువనేశ్వర్ నుండి 200 కి.మీ.ల దూరంలో, కోల్కతా నుండి 210 కి.మీ.ల దూరంలో ఉన్నది.

రైలు మార్గం : బరిపడ సమీప రైల్వే స్టేషన్. భువనేశ్వర్ - కోల్కతా మధ్య రెగ్యులర్ గా నడిచే రైలు ఇక్కడ ఆగుతుంది.

వాయు మార్గం : సోనరై ఎయిర్ పోర్ట్, జంషెడ్పూర్ 148 కిలోమీటర్ల దూరములో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి మయూర్ భంజ్ చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...