Search
  • Follow NativePlanet
Share
» »రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...

రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...

మౌంట్ కైలాష్ తో పాటు అక్కడి పురాణ కథనాలకు సంబంధించిన కథనం.

భారతీయ సంస్కతి సంప్రదాయాలను రామాయణ, మహాభారతాలు లేకుండా ఊహించుకోలేము. అందులో ఉన్న అనేక కథలను మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం. అందువల్లే సనాతన ధర్మాలు ఇంకా భారతదేశంలో ఆచరణలో ఉన్నాయి. ఇక అటువంటి కథల్లో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుడి దర్శనం కోసం తన పది తలలను ఆహుతి ఇచ్చాడని చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటూ వచ్చాం. అయితే అలా రావణాసుడు తన తలలను ఆహుతి ఇచ్చిన స్థలం ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా చేరుకోవాలి? అన్న విషయాలు చాలా సార్లు మనకి కలిగి ఉండవచ్చు. ఇందుకు సమాధానమే ఈ కథనం.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube

హిమాలయాల పర్వత శ్రేణఉల్లో భాగం కైలాస పర్వతం. దీనినే మౌంట్ కైలాస్ అని కూడా అంటారు. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో ముఖ్యమైన సింధునది, సట్లేజ్ నది, బ్రహ్మపుత్రానది, కర్నాలి నది ఇక్కడే ఉద్భవించి ప్రపంచం నలుగు దిక్కులకు ప్రవహించి ఈ భూ మండలాన్ని నాలుగు భాగాలు చేస్తున్నాయి.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
కేవలం హిందువులకే కాకుండా బౌద్ధ, జైన, బోన్ మతానికి చెందినవారికి కూడా ఈ మౌంట్ కైలాస్ పవిత్రస్థలం. హిందూమతంలో ఈ మౌంట్ కైలాస్ శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
బౌద్ధమతంలో ఈ పర్వతాన్ని బుద్ధిని ఆవాసంగా భావిస్తారు. జైన మతానికి సంబంధించి మొదటి తీర్థాంకరుడు ఇక్కడే జ్జానం పొందారని చెబుతారు. అందువల్లే ఈ పర్వతాన్ని మతాల వారు గౌరవిస్తారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
దీంతో ఎవరూ కూడా ఈ పర్వతం పై అధిరోహించడానికి సాహసించలేదు. అందుకే మౌంట్ కైలాష్ కంటే ఎన్నో అడుగుల ఎతైన మౌంట్ ఎవరెస్ట్ ను చాలా మంది అధిరోహించారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
కాని ఈ మౌంట్ కైలాష్ ను మాత్రం అధిరోహించడానికి సాహసించలేదు. కొందు మొండిగా మౌంట్ కైలాష్ అధిరోహించాలని ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకొన్నారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
విష్ణుపురాణాన్ని అనుసరించి ఇది ప్రపంచపు పునాది స్తంభం. తామర పువ్వు రెక్కలవలే విస్తిరంచి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్రస్థానంలో ఈ పర్వతం ఉంది.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
వేల సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది ఈ మౌంట్ కైలాస్ పర్వత దర్శనం కోసం తీర్థయాత్ర చేస్తారు. అంతేకాకుండా ఈ పర్వతాన్ని చుట్టురావడం అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
అందువల్లే కఠినమైన వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా ఈ మౌంట్ కైలాష్ తీర్థయాత్ర చేస్తుంటారు. ఈ మౌంట్ కైలాస్ పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణామార్గం 52 కిలోమీటర్లు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఇక హిందువులు, బౌద్ధులు ఈ ప్రదక్షిణామార్గాన్ని సవ్యదిశలో పూర్తి చేస్తే జైన, బోన్ మతాన్ని అనుసరించేవారు ఈ ప్రదక్షిణ మార్గంలో అపసవ్య దిశలో తిరుగుతారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఈ మౌంట్ కైలాష్ నుంచి స్వర్గానికి సోపాన మార్గముందని కూడా భక్తులు నమ్ముతారు. సముద్ర మట్టానికి సుమారు 22 వేల అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఈ మౌంట్ కైలాష్ పర్వతం ఉంది.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఈ పర్వతానికి నాలుగు ముఖాలు కనిపిస్తాయి. ఆ నాలుగు ముఖాలు కూడా నాలుగు ఆకారాల్లో ఉంటాయి. ఇందులో ఒకవైపు సింహం రూపు కనిపిస్తే మరో వైపు గుర్రం, ఏనుగు, నెమలి ఆకారాల్లో కినిపిస్తాయి.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
అదే విధంగా ఈ పర్వతం నాలుగు వైపులా నాలుగు రంగుంల్లో కనిపిస్తుంది. అవి వరుసగా బంగారు, తెలుపు, కాషాయం, నీలం. ఇలా ఒకే పర్వతం నాలుగు రంగుల్లో కనిపించడం ఎలా సాధ్యమన్న విషయానికి ఎప్పటికీ జవాబులేని ప్రశ్నలే.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఇక కైలాస పర్వతానికి దగ్గర్లో మానస సరోవరం ఉంది. యాత్రలో భాగంగా దీనిని కూడా చూడవచ్చు. హిందూ పురాణాలను అనుసరించి మానస సరోవరాన్ని బ్రహ్మ తన మనస్సు నుంచి జన్మింపజేశాడు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
అందువల్లే ఈ సరస్సుకు మానససరోవరమని పేరు. బ్రహ్మ ముహుర్తంలో అంటే తెల్లవారుజామన 3 నుంచి నాలుగు గంటల మధ్య పరమశివుడు ఈ మానస సరోవరంలో స్నానం చేస్తాడని చెబుతాడు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
అందుకు తగ్గట్టే కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెబుతుంటారు. అయితే ప్రతి రోజూ ఆ వెలుగు కైలాస పర్వతం నుంచి మానస సరోవరానికి ఒకే సమయంలో రావడానికి గల కారణాలు మాత్రం శాస్త్రీయంగా నిరూపించలేకపోతున్నారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
శివుడికి ఇష్టమైన శ్రావణమాసంలో లేదా పున్నమి రోజున ఈ మౌంట్ కైలాష్ పర్వతాన్ని దర్శించుకోవడానికి చాలా మంది ఇష్టపడుతారు. మానస సరోవరానికి చేరుకునే మార్గంలో ముందుగా మనం రాక్షసస్థల్ అనే ప్రాంతం చేరుకుంటాం.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఇది రావణుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సరోవరం. ఇక్కడ ఇప్పటికీ ఎవరూ స్నానం చేయరు. రావణుడు ఇక్కడే తన పది శిరస్సుల్లో రోజుకు ఒక తలను ఖండిస్తూ ఆ పరమశివుడి దర్శనం కోసం తపస్సు చేశాడని చెబుతారు. పదోరోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురికి ఆత్మలింగాన్ని ప్రసాదించాడని మన పురాణాలు చెబుతాయి.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఇక పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, మహాభారత యుద్ధం తర్వాత పాండవులతో పాటు కలియుగంలో ఆది శంకరాచార్యుడు కూడా ఈ మానస సరోవరం, మౌంట్ కైలాష్ యాత్ర చేశాడని చెబుతారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
ఈ మానస సరోవరం చుట్టు కొలత 88 కిలోమీటర్లు. కొంతమంది యాత్రికులు తాము వచ్చిన వాహనాల్లోనే ఈ సరస్సు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీని వల్ల అత్యంత పవిత్రమైన ప్రాంతాల్లో తాము యాత్రచేశామన్న అనుభూతి కలుగుతుందని చెబుతారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
అటు పై కైలాస పర్వత దర్శనం కోసం వెలుతారు. ముందుగా యమద్వారం వస్తుంది. దానికి మూడు ప్రదక్షిణలు చేసి ఓ ద్వారం గుండా ప్రయాణం చేసి మరో ద్వారం గుండా వెలుపలికి వస్తారు.

మౌంట్ కైలాష్, హిమాలయాలు

మౌంట్ కైలాష్, హిమాలయాలు

P.C: You Tube
అటు పై కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పరిక్రమణ మొదలవుతుంది. అయితే వాతావరణం అనుకూలిస్తేనే పరిక్రమణకు అనుమతి లభిస్తుంది. లేదంటే దూరం నుంచే ఓ నమస్కారం చేసుకొని వెనుదిరగాల్సి ఉంటుంది.

రామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనేరామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనే

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X