Search
  • Follow NativePlanet
Share
» »పర్వత అందాలను సైకిల్ తో పలకరిద్దాం....

పర్వత అందాలను సైకిల్ తో పలకరిద్దాం....

By Beldaru Sajjendrakishore

అడ్వెంచర్ టూరిజం. పర్యాటక రంగంలో ఇటీవల బాగా పాపులర్ అవుతున్న విధానం. అనేక రాష్ట్రాలు రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్ తదితర సహసక్రీడలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కర్నాటక రాష్ర్టం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రకాల అడ్వెంచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా మౌంట్ బైకింగ్ వంటి వినూత్న ఎకోటోరిజానికి పెద్ద పీఠ వేసింది. మరింకెందుకు ఆలస్యం ఓ సారి మనం కూడా సైకిల్ తో పర్వతాలను మాట్లాడి వద్దామా ...

1. పర్వతాలను సైకిల్ తో ఢో కొట్టడం...

1. పర్వతాలను సైకిల్ తో ఢో కొట్టడం...

Image source

క్లుప్తంగా మౌంటైన్ బైకింగ్ అంటే కొండ, గుట్టల్లో ప్రత్యేకంగా రూపొందించిన సైకిల్ లో వెళ్లడం. అడ్వెంచర్, ఎకోటూరిజంతో పాటు సైక్లింగ్ పై నగర వాసుల్లో ముఖ్యంగా బెంగళూరు వంటి నగరల్లో ఉన్న వారిలో ఆసక్తి ఇటీవల పెరుగుతోంది.

2. కావేరి నది ఒడ్డున

2. కావేరి నది ఒడ్డున

Image source

అందుకు తగ్గట్లే కర్ణాటక కూడా భౌగోళిక పరిస్థితులను అనుసరించి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను మౌంటైన్ బైకింగ్ కు అనువుగా మార్చడమే కాకుండా కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. అటువంటి ప్రాంతాల్లో మండ్య జిల్లాల్లోని బీమేశ్వరీ మొదటి స్థానంలో ఉంది.

3. ఈసమయం ఉత్తమం

3. ఈసమయం ఉత్తమం

Image source

ఇక్కడ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులను అనుసరించి ఈ క్రీడకు ఈ ప్రాంతం సెప్టంబర్ నుంచి ఫిబ్రవరి నెల మధ్య మౌంట్ బైకింగ్ అనుకూలంగా ఉటుంది. వేసవి కాలంలో ఎక్కువ ఉక్కపోత ఉంటుంది. ఇక వర్షాకాలంలో నిత్యం తుంపరతో పాటు ఇక్కడ ఉన్న బురద నేలల వల్ల జలగలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. అందువల్ల మౌంట్ బైకింగ్ పై ఆసక్తి ఉన్న వారు ఈ ఫిబ్రవరి నెలలో అక్కడకు వెళితే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

4. ఎంత దూరం, ఎలా చేరుకోవాలి...

4. ఎంత దూరం, ఎలా చేరుకోవాలి...

బెంగళూరు నుంచి భీమేశ్వనరీ దాదాపు 100 కిలోమీటర్లు మాత్రమే. ఇక మండ్య నుంచి 60 కిలోమీటర్లు. బెంగళూరులోని కెంపేగౌండ అంతర్జాతీయ విమానాశ్రయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భీమేశ్వరికి బస్సు సదుపాయం ఉంది. అదే విధంగా బెంగళూరుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి.

5. మరిన్ని కొత్త అడ్వెంచర్స్

5. మరిన్ని కొత్త అడ్వెంచర్స్

Image source

భీమేశ్వరి భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఇక్కడ జిప్ లైనింగ్ అక్రాస్ ద రివర్ (తాడు సహాయంతో నదిని దాటడం), ఒక చెట్టు చిటారు నుంచి మరో చెట్టు చిటారుకు దూకడం వంటి నూతన క్రీడలను ఆడవచ్చు. అందుకు తగ్గట్టు నిపుణులను కూడా ప్రభుత్వం సమకూర్చింది. అంతే కాకుండా తెప్పల సహాయంతో నదీ తీరం వెంబడి వెలుతూ ప్రకృతి అందాలను ఆస్వాధించవచ్చు.

6. షీర్ ఫిషింగ్ ఇక్కడ ఫేమస్

6. షీర్ ఫిషింగ్ ఇక్కడ ఫేమస్

Image source

భీమేశ్వరీ తీరం అత్యంత అరుదైన షీర్ చేపలకు ఆలవాలం. గాలెం వేసి ఈ చేపలను పట్టడానికి రాష్ర్టం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు.

7. దగ్గర్లో ఉన్న పర్యటక ప్రాంతాలు...

7. దగ్గర్లో ఉన్న పర్యటక ప్రాంతాలు...

Image source

భీమేశ్వరీకి దగ్గరల్లో ఎకో టూరిజానికి సంబంధించిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి....బారచుక్కి, గగన చుక్కి వాటర్ ఫాల్స్, కేఆర్ఎస్ డ్యాం, మేల్కోటే అభయారణ్యం, తొన్నూరు లేక్, రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం తదితరాలు.

8. మరింత సమాచారం కోసం

8. మరింత సమాచారం కోసం

Image source

మౌంటైన్ బైకింగ్ తో పాటు మిగిలిన సమాచారం కోసం కర్ణాటక పర్యటక శాఖ విభగమైన జంగిల్ లాడ్జ్ అండ్ రిసార్ట్ లిమిటెడ్ ను ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు.

కార్పోరేట్ ఆఫీస్ జంగిల్ లాడ్జ్ అండ్ రిసార్ట్ లిమిటెడ్ గ్రౌండ్ ఫ్లోర్,

వెస్ట్ ఎంట్రెన్స్ ఖనిజభవన్, రేస్ కోర్స్ రోడ్ బెంగళూరు 560001 080 40554055

Email: info@junglelodges.com

లేదా

సమాచార కేంద్రం పర్యాటక శాఖ

జేఎల్బీ రోడ్,

మెట్రో పోల్ సర్కిల్,

మైసూర్ 570005 91- 821- 2422096 / 9449599759 / 9449597870

Email: hyd@junglelodges.com

Read more about: river rafting travel tourism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more