» »కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !

Written By: Venkatakarunasri

గయ కు వెళ్లే ప్రతి పర్యాటకుడు ఈ గుహలను తప్పక చూసితీరాల్సిందే! గయ మరియు గయ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ద గయలో లో కూడా సందర్శించవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. గయ లో విష్ణుపాద్ మందిర్, బుద్ధ గయ లేదా బోధ్ గయ లో భోధి చెట్టు, మహాబోధి ఆలయం, దుంగేశ్వరి గుహాలయం, జమ మసీద్ చూడదగ్గవి.

బరాబర్ గుహలు భారతదేశంలోని అతిపురాతన గుహలు. ఈ గుహలు మౌర్య రాజులకు చెందినవి. వాటిలో కొన్ని ప్రత్యేకించి అశోకుడుకు సంబంధించినవి. బీహార్ లోని జెహనాబాద్ జిల్లా, గయ కు 24 కిలోమీటర్ల దూరంలో బరాబర్ గుహలు ఉన్నాయి.

గుహలు

గుహలు

మౌర్య రాజుల కాలానికి చెందినా బరాబర్ గుహలు, దేశంలోని అతి పురాతన రాతి కట్టడం. బరాబర్ వద్ద ఉన్న ఎక్కువ గుహలు ఎక్కువగా మేరుగుపెట్టిన అంతర్గత ఉపరితలం, ప్రతిధ్వని ప్రభావంతో, పూర్తిగా గ్రానైట్ తో మలచబడి, రెండు విభాగాలను కలిగిఉంటాయి.

pc: Photo Dharma

నిర్మాణ శైలి

నిర్మాణ శైలి

పురాతన కాలంలో చాలా అరుదైన ఉత్తమ వంపులు కలిగిన గుహలలో కరణ్ చౌపర్, లోమస్ రిషి, సుదామ, విశ్వ జోప్రి అనే నాలుగు గుహలు ఉన్నాయి. ఈ గుహలు రాతి కట్టడాల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ.

లోమస్ రిషి కేవ్

లోమస్ రిషి కేవ్

గుహ మూడు వైపు వంపులు తిరిగి ఉండి, విస్తృతమైన కలప నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గుహ ఎంట్రెన్స్ మెలికలు తిరిగి ఉండటంతోపాటు స్థూప చిహ్నాల వైపు వెళ్ళే వరుస ఏనుగులతో అలంకరించబడి ఉంటుంది.

సుధామ కేప్స్

సుధామ కేప్స్

సుధామ కేప్స్ క్రీ.శ.261 కాలానికి చెందిన మౌర్య రాజు అశోకుడు కు అంకితం చేయబడింది. సుధామ గుహ ఆర్చీలు విల్లు ఆకారంలో మలచబడి ఉంటాయి. మండపం మధ్యలో గోపురం గల గది ఉంటడం ఇక్కడి ప్రత్యేకత.

కరణ్ చౌపర్ కేప్స్

కరణ్ చౌపర్ కేప్స్

పాలిష్ చేయబడిన ఉపరితలం కలిగిన ఒక దీర్ఘచతురస్త్రాకార గది ఉంది. క్రీ.పూ. 245 నాటి శాశనాలను ఇక్కడ భద్రంగా ఉంచారు.

విశ్వ జోప్రి కేప్స్

విశ్వ జోప్రి కేప్స్

అశోకుడు కొండను తొలచి వెళ్లిన గుహలు ఇవి. ఈ గుహ రెండు దీర్ఘచతురస్త్రాకార గదులను కలిగి ఉంటుంది.

నాగార్జున గుహలు

నాగార్జున గుహలు

నాగార్జున గుహలు బరాబర్ గుహల కన్నా నవీనమైనవి మరియు చిన్నవి. ఇవి క్రీ.పూ. 3 వ శతాబ్దం కాలం నాటివి మరియు బారాబర్ గుహలకు 1.6 కి. మీ ల దూరంలో ఉన్నాయి.

బారాబర్ గుహలు

బారాబర్ గుహలు

బారాబర్ గుహలు 'ట్విన్ హిల్స్' గా పిలువబడే బరాబర్ (నాలుగు గుహలు) మరియు నాగార్జున (మూడు గుహలు) కొండలలో ఉన్నాయి.

గోపి గుహలు

గోపి గుహలు

గోపి (గోపి- కా-కుభ) : ఇక్కడి శాశనాల ప్రకారం, క్రీ.పూ. 232 వ సంవత్సరంలో దశరథ రాజు ద్వారా ఆజీవక ఫాలోవర్స్ కు ఈ గుహ అంకితం చేయబడినది.

విధిత గుహలు

విధిత గుహలు

విధిత -కా- కుభ కేవ్ (వేదతిక కుభ) : రాతితో ఏర్పడే పగులు ఉన్న ప్రదేశంలో ఈ గుహలు ఉన్నాయి.

వాపియ గుహలు

వాపియ గుహలు

వాపియ -కా- కుభ కేవ్ (మీర్జా మండి): ఈ గుహలు కూడా దశరథ రాజు ద్వారా ఆజీవక ఫాలోవర్స్ కు అంకితం చేయబడినది.

సందర్శించు సమయం

సందర్శించు సమయం

వారంలో అన్ని రోజులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరిచే ఉంచుతారు. సుమారు 3 నుండి 4 గంటల పాటు గుహలను సందర్శించవచ్చు. టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు. 'ఫ్రీ' గానే లోనికి వెళ్ళవచ్చు.

ప్రకృతి ప్రేమికులు

ప్రకృతి ప్రేమికులు

బరాబర్ గుహలను సాహసాలంటే ఇష్టపడేవారికి, ఫొటోగ్రాఫర్లకు, చరిత్ర మీద మక్కువ ఉన్నవారు మరియు ప్రకృతి ప్రేమికులు సందర్శిస్తుంటారు.

ఎక్కడ ఉండాలి?

ఎక్కడ ఉండాలి?

బరాబర్ గుహల వద్ద ఉంటాడటానికి ఎటువంటి హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్ లు లేవు. కనుక 35 కి. మీ ల దూరంలో ఉన్న గయ అన్నివిధాలా సౌకర్యవంతమైనది.

ఎక్కడ తినాలి ?

ఎక్కడ తినాలి ?

గుహల వద్ద తినటానికి ఎటువంటి స్టాల్స్, హోటళ్లు లేవు. కనుక మీరే ఆహార పొట్లాలను, త్రాగునీరు వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

ఎప్పుడు సందర్శించాలి ?

ఎప్పుడు సందర్శించాలి ?

బరబరా గుహలకు ఉత్తమ సందర్శన సమయం : అక్టోబర్ నుండి మార్చ్ వరకు.

వాహనాలు

వాహనాలు

బరాబర్ గుహలకు సమీపాన 31 కి. మీ ల దూరంలో గయ విమానాశ్రయం కలదు. బరాబర్ గుహలకు సమీపాన 23 కి. మీ ల దూరంలో గయ రైల్వే జంక్షన్ కలదు. గయ నుండి ప్రతిరోజూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు, వాహనాలు గయ కు వెళుతుంటాయి.