Search
  • Follow NativePlanet
Share
» »సర్పదోష నివారణకు బెంగళూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన ముక్తినాగ క్షేత్రం విశేషాలు

సర్పదోష నివారణకు బెంగళూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన ముక్తినాగ క్షేత్రం విశేషాలు

నాగదేవత ప్రత్యక్షంగా కొలువైన క్షేత్రాల్లోనూ...సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కొలువైన క్షేత్రాల్లోనూ నిజంగా నాగుపాము కనిపిస్తే భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనవుతారు. ఆ క్షేత్రంలోని మహిమ, మహాత్యం వల్లే నాగదే

మన హిందు సాంప్రదాయంలో నాగుపామును దేవతగా భావించి పూజించడం ప్రాచీన కాలం నుండి వస్తోంది. ఈ ఆచారం కారణం చేతన చాలా మంది నాగుపామును కొట్టడం..కొట్టించడం అపరాథంగా భావిస్తుంటారు. నాగుపాముకు ఎటువంటి హాని కలిగించినా అది మనకు శాపంగా మారుతుందని..ఆ దోషం మనకు తరతరాలుగా వెంటాడుతుందని చాలా మంది భావిస్తారు. అలాగే తెలిసో..తెలయకో తమ వల్ల నాగజాతికి ఏదైనా అపరాథం జరిగి ఉంటే ఆ దోషం తొలగిపోవడం కోసమే, సుబ్రహ్మణ్య షష్టి రోజున అభిషేకం వంటిది చేయిస్తుంటారు.

నాగదేవత ప్రత్యక్షంగా కొలువైన క్షేత్రాల్లోనూ...సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కొలువైన క్షేత్రాల్లోనూ నిజంగా నాగుపాము కనిపిస్తే భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనవుతారు. ఆ క్షేత్రంలోని మహిమ, మహాత్యం వల్లే నాగదేవత ప్రత్యక్ష దర్శనం లభించిందని సంతోషం పడుతుంటారు. అలా ఆనందాశ్చర్యాలకు గురిచేసే ఒక మహత్తర క్షేత్రం బెంగళూరులో ఉంది. బెంగళూరుకి సమీపంలో గల ముక్గినాగ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు ఇలాంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది.

భారత దేశంలో నాగదోష పరిహారం , ముక్తి పొందడానికి కొన్ని ప్రసిద్దిచెందిన పుణ్యక్షేత్రాలున్నాయి. బెంగళూరుకు సమీపంలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామిక్షేత్రం ఉంది, అలాగే దొడ్డ బళ్ళాపురంలో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం ప్రసిద్ది చెందినది. మంగళ మరియు ఆదివారాల్లో ఈ పుణ్య క్షేత్రాల్లో భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ప్రస్తుతం ఈ వ్యాసంలో బెంగళూరులో ఉండే ఒక సర్పదేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ..

దేవాలయం ఎక్కడ ఉంది?

దేవాలయం ఎక్కడ ఉంది?

కర్ణాటక రాజధాని బెంగళూరులో రామహల్లి (రామపల్లె) మైసూర్ రోడ్డుకు సమీపంలో ఉన్న ముక్గినాగ దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకోలేని వారు ఈ ముక్తినాగా దేవాలయంను దర్శించుకోవచ్చు. బెంగళూరులో భక్తులకు అందుబాటులో ఉన్న ఈ నాగదేవతా క్షేత్రంలో సర్పదోష నివారణకై భక్తులు పూజించే దైవము''నెలకొని ఉన్న ఈ గుడి అత్యంత ప్రాచీనమైనది. ఎవరికైనా నాగదోషం ఉంది అంటే వారు జీవితంలో చాలా అడ్డంకులు అనుభవిస్తుంటారు. అందుచేత నాగదేవతలున్న క్షేత్రాలను సందర్శిస్తూ దోశాలను నివ్రుత్తి చేసుకోవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నాగదోశ శాంతి, పూజలు చేయిస్తుంటారు.

PC:Suraj Belbase

నాగ సర్పాలకు ఎంతో శక్తులుంటాయి.

నాగ సర్పాలకు ఎంతో శక్తులుంటాయి.

నాగ సర్పాలకు ఎంతో శక్తులుంటాయి. మాయా శక్తిని కలిగి ఉండటం మాత్రమే కాదు, ప్రజల జీవితాలను నియంత్రించే శక్తి కూడా ఉంది.

PC :Suraj Belbase

పురాణాల ప్రకారం, ఇవి కశ్యప మహర్షి కుమారులు.

పురాణాల ప్రకారం, ఇవి కశ్యప మహర్షి కుమారులు.

పురాణాల ప్రకారం, ఇవి కశ్యప మహర్షి కుమారులు. నాగసర్పాలు గరుత్మంతుడు బద్ద శత్రువులు. కశ్యప మహర్షికి ఇరవై ఒక్క మంది భార్యలు వారిలో ఒకరు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె వినీతను వివాహం చేసుకోవడం వల్ల వీరికి జన్మించిన పుత్రులు గరుత్మంతుడు మరియు అనూరుడు, అలాగే కశ్యపునికి కుద్రువ వలన నాగులు(పాములు)జన్నించారు.

PC:Srikar Kashyap

సుబ్రహ్మణ్యునికి మరో రూపం అయిన నాగదేవతకు షష్ఠి రోజున

సుబ్రహ్మణ్యునికి మరో రూపం అయిన నాగదేవతకు షష్ఠి రోజున

ముక్తినాగ క్షేత్రంలో నాగదేవత ఎన్నో మహిమలను చూపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. సుబ్రహ్మణ్యునికి మరో రూపం అయిన నాగదేవతకు షష్ఠి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు..విశేష ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.

PC: Akshatha Vinayak

ఎంతో తేజస్సును కలిగిన పాము

ఎంతో తేజస్సును కలిగిన పాము

ప్రతి యేటా ఈ రోజున ఈ ఆలయంలోకి సర్పం ఒకటి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లిపోతుందట. ఎంతో తేజస్సును కలిగి ఉండే ఆ పాము చిత్రాలను ఈ క్షేత్రంలో చూడవచ్చు. సాధారణంగా ఏ మాత్రం అలికిడి అయినా అక్కడి నుండి పాములు వేగంగా వెళ్ళిపోతాయి.

PC: Lionel Allorge

 రేణుకా ఎల్లం ఆలయం

రేణుకా ఎల్లం ఆలయం

ముక్తినాగ ఆలయ ప్రాంగణంలో మరిన్ని దేవాలయాలున్నాయి. నాగేంద్రుని ముక్తినాగ ఆలయంతో పాటు , ఆలయం ద్వారం వద్ద ఉన్న రేణుకా ఎల్లం ఆలయాన్ని, ఆది ముక్తినాగ మరియు పటాలమ్మా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇవే కాకుండా ప్రధాన ఆలయానికి చుట్టూ మరో నాలుగు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలను నరసిహ్మ స్వామికి, శివుడికి, సిద్దివినాయకునికి, నీలాంభికాకు అంకితం చేయబడినవి.

PC: Akshatha Vinayak

ఈ క్షేత్రంలో ఎంత మంది భక్తులున్నా

ఈ క్షేత్రంలో ఎంత మంది భక్తులున్నా

ఈ క్షేత్రంలో ఎంత మంది భక్తులున్నా నాగుపాము మాత్రం అక్కడికి వచ్చి వెళ్ళడం చూసే భక్తులకు కొంచెం ఆశ్చర్య చకితులను చేస్తుంటుంది. మహిమాన్వితమైన ఈ సంఘటన గురించి భక్తులు విశేషంగా చెప్పుకుంటు ఉంటారు. ఇక్కడ నాగదేవత ప్రత్యక్షంగా కొలువై వుందని తలచి మరింత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తుంటారు.

PC: Akshatha Vinayak

సర్పదేవుని ప్రతిమ సుమారు 16 అడుగుల పొడవు

సర్పదేవుని ప్రతిమ సుమారు 16 అడుగుల పొడవు

మరో విశేషమేమిటంటే ఇటీవలి కాలంలో ఈ క్షేత్రం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ దేవాలయంలో ప్రధానంగా ఉండే సర్పదేవుని ప్రతిమ సుమారు 16 అడుగుల పొడవు ఉంటుంది. ఇది మన ఇండియాలోనే అత్యంత ఎత్తైన మోనోలిథిక్ నాగదేవత విగ్రహం అని చెబుతారు. ఈ నాగదేవుడి శిలావిగ్రహం ఏకశిలా విగ్రహం. ఇంత ఎత్తైన నాగదేవత విగ్రహాన్ని ఈ ప్రంపచంలోనే మరెక్కడా చూసి ఉండరు.

PC: Akshatha Vinayak

సర్పదోష నివారణ పూజలు :

సర్పదోష నివారణ పూజలు :

ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే నాగదేవతలను ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. ఆశ్లేష బలి, ప్రదోశ పూజ, మొదలగునవి కూడా ఈ ఆలయంలో జరుగుతాయి.

PC: Akshatha Vinayak

సుబ్రహ్మణ్య స్వామి నాగరాజు అవతారం.

సుబ్రహ్మణ్య స్వామి నాగరాజు అవతారం.

తమిళనాడులోని కాంచీపురం పద్మ శ్రీ గణపతి ఆలయం నుండి 11 మంది కళాకారులు చేరి పగలు, రాత్రి అత్యంత భక్తి శ్రద్దలతో నాగదేవున్ని పూజిస్తారు.శాస్త్రం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి నాగరాజు అవతారం. ఈయన నాలుగు అవతారలు అత్యంత మహిమగలవారు. మొదటిది బాల్యరూపం ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లో చూడవచ్చు.

PC: Akshatha Vinayak

రెండవ రూపం యవ్వనావస్తను

రెండవ రూపం యవ్వనావస్తను

రెండవ రూపం యవ్వనావస్తను ఘాటిసుబ్రమణ్యదేవస్తానంలో చూడవచ్చు.ఇక మూడవ రూపం గృహస్థుడు, సుబ్రమణ్య స్వామి రూపంలో తమిళనాడు లోని మురుగన్ టెంపుల్ మరియు తిరువన్నమలై ఆలయంలో చూడవచ్చు. ఇక్కడ సర్వదోషాలకు పరిహార పూజ, ఆశ్లేషబలి పూజ, నాగప్రతిష్టాపన వంటిఅనేక పూజలు ఇక్కడ జరుగుపబడుతాయి.

PC: Akshatha Vinayak

ముక్గినాగ క్షేత్రానికి బెంగలూరు మైసూర్ రోడ్ లో

ముక్గినాగ క్షేత్రానికి బెంగలూరు మైసూర్ రోడ్ లో

ముక్గినాగ క్షేత్రానికి బెంగలూరు మైసూర్ రోడ్ లో పెద్ద మర్రి చెట్టుకు వెళ్ళే మార్గంలో కంగేరి నుండి 6కిమీ దూరంలో ఉంది. కె.ఆర్ మార్కెట్ నుంది రామోహల్లికి బి.ఎం.టి.సి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రామపల్లికి ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆటో ద్వారా కూడా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X