Search
  • Follow NativePlanet
Share
» »ముంబై లో చినుకు పడితే...?

ముంబై లో చినుకు పడితే...?

అధిక వేడి తాపానికి కష్టాలు పడిన ఎవరికైనా సరే, ఒక్క వర్షపు జల్లు ఎంతో ఊరట నిస్తుంది. మరి ముంబై నగర ప్రజలకు కూడా అంతే. మొదటగా పడే వర్షం స్థానికులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.

ముంబై నగరం అంతా ఒక్కసారి ఆహ్లాదకర వాతావరణం వ్యాపిస్తుంది. వీధులలో వీచే చల్లటి గాలులు ఆస్వాదిస్తూ, చేతులలో వేడి వేడి కాఫీ మరియు టీ కప్పులతో మరియు వేడి వేడి చిరుతిండ్లు తింటూ అన్ని వయసులవారూ ఆనందిస్తారు.

వయసు పై పడిన వారు గతంలోని మంచి రోజులు నెమరు వేసుకుంటే, చిన్నవారు తమ ప్రియమైన వారితో చేరి ముచ్చటిస్తారు. వర్షాలతో నగరం రూపు రేఖలు మారిపోతుంది. మరి ముంబై లో వర్ష రుతువులో వివిధ ప్రదేశాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.

ముంబై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

బాంద్రా బ్యాండ్ స్టాండ్, బాంద్రా

బాంద్రా బ్యాండ్ స్టాండ్, బాంద్రా

బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో ప్రతి ఒక్కరూ తాము తిరిగే సమయంలో తమ కు ఇష్టమైన సెలబ్రిటీ ల కొరకు చిన్నపాటి అన్వేషణ కూడా చేస్తూ వుంటారు. ఈ ప్రదేశం మొత్తంగా తాజ్ హోటల్ నుండి ఒక కి.మీ. దూరం వ్యాపించి వుంటుంది. చాలామంది తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఈ ప్రదేశంలో తిరగటం గమనించవచ్చు. ఇక్కడ తరచుగా బాలి వుడ్ యాక్టర్లు, నటీమణులు కూడా దర్శనమిస్తారు.

Photo Courtesy: Anuradha Sengupta

గేట్ వే అఫ్ ఇండియా

గేట్ వే అఫ్ ఇండియా

వర్ష రుతువు మాజిక్ చూడాలంటే, హెరిటేజ్ సైట్ లలో ఒకటైన గెట్ వే అఫ్ ఇండియా ఒకటి. అక్కడ కల వీధి తినుబండారాలను తింటూ సముద్రంలోకి చూస్తూ చాలామంది సమయం గడుపుతారు. మరింత ఆనందంగా గడపాలంటే, తాజ్ పాలస్ హోటల్ కు వెళ్లి అక్కడి డిష్ లు తింటూ సముద్ర తీర అందాలు చూడవచ్చు.

Photo Courtesy: Ting Chen

హాజీ ఆలి మాస్క్

హాజీ ఆలి మాస్క్

హాజీ ఆలి మసీదు సరిగ్గా సముద్రంలో వుంటుంది. ప్రధాన భూ భాగానికి సన్నపాటి మార్గంతో కలుపబడి వుంటుంది. నడిచేటపుడు అలలు మీద పడవచ్చు సుమా! జాగ్రత్త. అలల తాకిడి తక్కువగా వున్నపుడు మెల్లగా నీరు తగులుతూ నడుస్తే, ఆ ఆనందాలు వెలకట్ట లేనివి.
Photo Courtesy: Sourav Das

జుహు బీచ్

జుహు బీచ్

వర్షం పడితే జుహు బీచ్ ఆనందాలు మాటలలో చెప్పా లేనివి. అనేకమంది సాయంత్రాలు ఈ సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆనందిస్తారు. చిరు తిండికి అనేక చిన్న చిన్న దుకాణాలు కలవు. ఒక్క ప్లేట్ పావ్ భాజీ, ఒక గ్లాస్ పొగలు కక్కే టీ ఈ సమయంలో అద్భుతంగా వుంటాయి.

Photo Courtesy: Swaminathan

మెరైన్ డ్రైవ్

మెరైన్ డ్రైవ్

సాధారణంగా మెరైన్ డ్రైవ్ ను రాణి గారి మెడ హారం అని కూడా అంటారు. దానికి కారణం సాయంత్రం వేల ఈ కోస్తా తీరంలో అక్కడ వెలిగే విద్యుత్ దీపాలు. ఈ ప్రదేశంలో చాలా మంది జంటల ఆనందం కనపడుతుంది. ఎంత జల్లు కొడితే, అంత శృంగారాన్ని ఈ జంటలు అనుభవిస్తాయి. కనుక ఇక్కడికి ఒంటరిగా కాక జంటగా చేరండి.
Photo Courtesy: Michael Korcuska

వర్లి

వర్లి

సెంట్రల్ ముంబై లోని వర్లి దక్షిణ ముంబై లోని మెరైన్ డ్రైవ్ ప్రదేశం వలెనె వుంటుంది. చిరుతిండి తింటూ హాయిగా సమయం గడపవచ్చు. లేదా బీచ్ లోని అలల అందాలు చూస్తూ ఆనందించవచ్చు.
Photo Courtesy: Swaminathan

ముంబై అధిక ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X