» »తిరుచెందూర్ - సుబ్రహ్మన్యేశ్వర స్వామి దేవాలయం

తిరుచెందూర్ - సుబ్రహ్మన్యేశ్వర స్వామి దేవాలయం

Written By: Venkatakarunasri

తిరుచెందూర్ ను గతంలో 'కాపాడపురం' అనే వారు. తర్వాతి కాలంలో తిరుచేన్ చెందిలూర్ అని మరియు తర్వాత తిరుచెన్ - చెందిలూర్ అని ఆతర్వాత తిరుచెందూర్ అని పిలిచారు. తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించాయి. వారిలో చెరలు, పంద్యాలు మొదలైన వారు కలరు.

తిరుచెందూర్ దక్షిణ భారతదేశంలోని ఆనందమైన కోస్తా తీర పట్టణం. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో కలదు. తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరం లో సముద్రపు అంచున తిరుచందూర్ వుంది. ఇక్కడ సుబ్రహ్మన్యేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది.

తిరుచెందూర్ చుట్టూ తీర ప్రాంత అడవులు, తాటిచెట్లు, జీడిపప్పు మొక్కలు మొదలైనవి ఉన్నాయి. పురాణాల మేరకు మురుగన్ తిరుచెందూర్ లో సురపద్మన్ అనే రాక్షసుడిని వధించాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం మురుగన్ పవిత్ర స్థలంగా భావిస్తూ వస్తుంది.

తిరుచెందూర్ - సుబ్రహ్మన్యేశ్వర దేవాలయం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

తిరుచెందూర్ లో సుబ్రహ్మన్యేశ్వర స్వామి అత్యంత సంపన్నుడు . తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూర పద్ముడు పారి పొతే కుమార స్వామి వెంబడిస్తే, అతను మామిడి చెట్టు గా మారిపోయాడు. స్వామి, బల్లెం తో చెట్టు నుంచి చీల్చి వాణ్ని చంపేశాడు. అప్పుడు ఆ చెట్టు లో ఒక భాగం నెమలి గా, రెండో భాగం కోడిగా మారాయి.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు. ఆయన ఆయుధమైన బల్లెం, ఆయనకు చిహ్నం గా పూజలందు కొంటుంది ఇక్కడ. ఇక్కడి శరవణ భవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం. సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో మురుగన్ భార్యలైన వల్లి మరియు దేవసేన విగ్రహాలు ఉంటాయి. వేదకాలం నుండి ఉన్న ఈ ఆలయంలో శివుడు, విష్ణువు విగ్రహాలతో పాటు ప్రాచీన గ్రంధాలు కలవు.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

పున్నైనగర్ లోని వనతిరుపతి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇది తిరుచెందూర్ నుండి 20 KM ల దూరంలో కాచనవలి స్టేషన్ వద్ద కలదు.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

మేలపుతుకూది గ్రామంలోని అయ్యనార్ ఆలయం తిరుచెందూర్ కు 10 KM ల దూరంలో కలదు. ఈ గ్రామం చుట్టూ అందమైన నీటి కొలనులు , వాటి మధ్యలో అయ్యనార్ ఆలయం చుట్టూ తోటలు ఉన్నాయి. ఇది తమిళనాడులోని అందమైన ప్రదేశాలలో ఒకటి.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

వల్లి గుహలు తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో కలదు. ఇక్కడి నుండి సముద్ర అందాలను వీక్షించవచ్చు . ఈ వల్లి గుహలను దత్తాత్రేయ గుహలు అని కూడా పిలుస్తారు. గుహలో మురుగన్, వల్లి, దత్తాత్రేయ విగ్రహాలు ఉంటాయి. అలాగే వివిధ దేవుళ్ళ చిత్రాలు, పెయింటింగ్ లు చూడవచ్చు.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

కుదిరి మొజి తేరి అనేది ఒక అందమైన పిక్నిక్ స్పాట్. ఇది తిరుచెందూర్ కు 12 KM ల దూరంలో కలదు. ఇక్కడి సహజ ఆకర్షణ నీటి బుగ్గ.

ఆనందమైన కోస్తా తీర పట్టణం

ఆనందమైన కోస్తా తీర పట్టణం

దీనిని మొదట పంచాలంకురిచి కోట అనేవారు. దీనిని పంచాలంకురిచి వంశానికి చెందిన రాజు వీర పాండ్య కట్టబొమ్మన్ నిర్మించాడు. ఇందులో వారి కులదేవత అయిన జక్కమ్మ గుడి కలదు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ వారు ఈ కట్టడాన్ని నిర్వహిస్తున్నారు.

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ?

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ?

బస్సు/ రోడ్డు ద్వారా :

చెన్నై, మధురై, తిరునల్వేలి, త్రివేండ్రం మరియు కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు కలవు.

రైలు ద్వారా :

తిరుచందూర్ కు సమీపాన 60 km ల దూరంలో తిరునల్వేలి జంక్షన్, 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు.

విమానం ద్వారా :

సమీపాన 27 km ల దూరంలో ట్యుటికోరన్ ఎయిర్ పోర్ట్ కలదు. అలాగే 150 km ల దూరంలో త్రివేండ్రం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా కలదు.