Search
  • Follow NativePlanet
Share
» »ముస్సోరి అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి...

ముస్సోరి అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి...

వేసవి తాపం అప్పుడే మొదలయ్యింది. మరో కొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. దీంతో ఈ వేసవిని ఎలా ఎదుర్కొనాలనే విషయం పై ఇప్పటికే ఇళ్లలో చర్చలు మొదలయ్యి ఉంటాయి. శ్రీమతి ఏమో పుట్టింటికి వెళ్లాలంటే, ఎప్పటిలాగే శ్రీవారేమో లేదు మా సొంతూరు వెళుదాం అంటారు. ఇక పిల్లలేమో ప్రతి ఏడాది ఈ రెండుప్రాంతాల్లో ఏదో ఒక దగ్గరికే వెలుతున్నామంటూ గారాలు పోతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో మూతి విరుపులు, పిల్లల సత్యాగ్రహాలు సాధారమై పోతున్నాయి. ఇందుకు మీ నేటివ్ ప్లానెట్ పరిష్కార మార్గాన్ని తీసుకువచ్చింది. దేశంలో ఈ వేసవికి అత్యంత అనుకూలమైన కొన్ని పర్యాటక ప్రాంతాలలో ఒకటి ముస్సోరి. వేసవిని ఆహ్లాదంగా గడపేయడానికి ఈసారి ముస్సోరికి ప్లాన్ చేసుకోండి..కాలుష్యం లేని స్వచ్చమైన ప్రక్రుతిని ఆశ్వాదించండి.

ఇది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు.

ఇది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు.

ఇది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. డెహ్రాడూన్ నుంచి ముస్సోరి 35 కిలో మీటర్లు , హరిద్వార్ కి సుమారు 90 కిలో మీటర్ల దూరం . డెహ్రాడూన్ ముస్సోరీ బ్రిటిష్ కాలం నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రసిద్ది . సుమారు హరిద్వార్ నుంచి ముస్సోరి వరకు అంతా కొండలమీదే మన ప్రయాణం సాగుతుంది .

సముద్ర మట్టానికి సుమారు 6,170 అడుగుల యెత్తున వుండడంతో

సముద్ర మట్టానికి సుమారు 6,170 అడుగుల యెత్తున వుండడంతో

భారత దేశంలో వేసవిలో ఎక్కువ రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో ముస్సోరి కూడా ఒకటి. మన దేశంలో వున్న ప్రసిద్ధ వేసవి విడుదలలో ముఖ్య మయినది కూడా కావడంతో ముస్సోరీ యెప్పుడూ రద్దీ గానే వుంటుంది . సముద్ర మట్టానికి సుమారు 6,170 అడుగుల యెత్తున వుండడంతో యెప్పుడూ చల్లగా , అతిచల్లగా వుంటుంది ముస్సోరి .

ఇక్కడ పర్వత ప్రాంత అందాలతో పాటు మేఘాల మధ్య

ఇక్కడ పర్వత ప్రాంత అందాలతో పాటు మేఘాల మధ్య

ఇక్కడ పర్వత ప్రాంత అందాలతో పాటు మేఘాల మధ్య మనం వెలుతున్న అనుభూతిని పొందవచ్చు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది కొంత ఖరీదైన ప్రాంతమే అని చెప్పవచ్చు. ఇక్కడ పచ్చదనంతో పాటు తెల్లటి మంచుతెరలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మిమ్ములను పలకరిస్తూనే ఉంటాయి. అందువల్లే చాలా మంది ఇక్కడికి వెలుతుంటారు.

అన్ని కాలాలలోనూ ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అన్ని కాలాలలోనూ ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అన్ని కాలాలలోనూ ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ నవంబర్ నెల ఉత్తమమైనది. సచిన్ టెండూల్కర్ కూడా తన కుటుంబంతో ఇక్కడికి తరచూ వస్తుంటాడు.సహస క్రీడలు, శివాలిక్ పర్వత శ్రేణులు, రోప్ వే ప్రయాణం మొదలుగునవి ఆస్వాదించవచ్చు. ముస్సోరిలో ముఖ్యంగా చూడవల్సిన ప్రదేశాలు..

చిత్రకృప : Michael Scalet

లాల్ టిబ్బా:

లాల్ టిబ్బా:

ముస్సోరిలో ఎత్తైన ప్రదేశం ఇది. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ స్టేషన్లను ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న టవర్ పై పురాతన టెలిస్కోప్ ఉంటుంది. అందులో నుంచి చూస్తే ముస్సోరి అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.

PC: Rajesh Misra

గన్ హిల్:

గన్ హిల్:

ముస్సోరిలో రెండో ఎత్తైన ప్రదేశం ఇది. మాల్ కు 400అడుగుల ఎత్తులో ఉంది. రోప్ వే ద్వారా చేరుకోవచ్చు. ట్రెకింగ్ ప్రియులకు అద్భుతమైన ప్రదేశం. గన్ హిల్ కు చేరుకున్నాక టెలిస్కోప్ ద్వారా చూస్తే ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు గా కనిపించే పర్వతాలు కనువిందు చేస్తాయి. 1857లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పెద్ద ఫైరింగ్ గన్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ మధ్యాహ్నం ఇక్కడ గన్ పేలిస్తే దాన్ని బట్టి అందరూ వాచ్ లో సమయాన్ని మార్చుకునే వారట. అయితే 1970లో ఈ గన్ ను తొలగించారు. ఈ పర్వతం పైన నుండి ఫిరంగిని చాలా కాలం కిందటి వరకు పేల్చే వారట, ఆ శబ్దం ముస్సోరి కొండలలో ప్రతిధ్వనించేదట. ముస్సోరిలోని మాల్ రోడ్డ్ నుండి ఈ గన్ హిల్ కి కేబుల్ కారు నడుస్తుంది. పచ్చని కొండల మద్య కేబుల్ కారు ప్రయాణం ఓ మరపురాని అనుభూతిని కలిగిస్తుంది.

PC: Fredi Bach

క్యామెల్ బ్యాక్ రోడ్

క్యామెల్ బ్యాక్ రోడ్

నాలుగు కిలోమీటర్ల పొడవుంటుంది. ఇక్కడి రాళ్లు ఒంటె మూపురం మాదిరిగా ఉండటం వల్ల ఆ పేరు స్థిరపడింది. ఈ రోడ్డు రెండు ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతుంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల విస్తరించి ఉన్న పర్వతాల అందాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలు చూసి తీరాల్సిందే. నడవలేని వారు గుర్రాల మీద వెళ్లొచ్చు.

PC: Rajeev kumar

మాల్:

మాల్:

ముస్సోరిలో కీలకమైన ప్రదేశం ఇది. షాపింగ్‌ చేసే పర్యాటకులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఉలెన్‌ దుస్తులు, శాలువాలు ఇక్కడ ప్రత్యేకం. మాల్ రోడ్డ్ సుమారు పావు కిలోమీటరు పొడవున్నా రోడ్డు మీదే రెస్టారెంట్స్, నిత్యావసర వస్తువులను విక్రయించే షాపులు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మాల్ రోడ్ కు దిగువన ఉన్న రోడ్ లో లక్ష్మీ నారాయణ మందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి.

PC: Curious Eagle

కెంప్టీ ఫాల్స్:

కెంప్టీ ఫాల్స్:

ముస్సోరిలో పాపులర్‌ టూరిస్ట్‌ స్పాట్‌ ఇది. 40 అడుగుల ఎత్తైన ఈ జలపాతం దగ్గర జలకాలాడటానికి పర్యాటకులు ఇష్టపడతారు. సముద్రమట్టానికి 1364 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉండే ఈ ఫాల్స్ చేరడానికి ఓ రెండు ఫర్లాగులు మెట్లగుండా కిందికి దిగాలి, ఇక్కడ తరచూ వానలు పడడం వల్ల దారి పాచి పట్టి జారుడుగా ఉంటుంది. జాగ్రత్తగా కాలు పెట్టకపోతే అంతే సంగతులు. కొండమీద నుండి పెద్ద శబ్దం చేస్తూ దూకుతున్న జలపాతం చాలా బాగుంటుంది.

PC: Harshanh

హేపి వేలీ:

హేపి వేలీ:

ఇక్కడ ఎక్కువగా టిబెటియన్లు కనిపిస్తారు. బౌద్దమందిరం చూడముచ్చటగా ఉంటుంది. ముందు తలుపు దాటుకుని లోపలకు వెళితే పెద్ద హాలు, వెనుక తరగతి గదులు, ఆడుకుంటున్న చిన్న పిల్లలు, లోపల రంగులతో వేసి బుద్దుడి జీవిత చరిత్రకు సంబంధించిన బొమ్మలు కనువిందు చేస్తాయి. నిలువెత్తు బుద్దుడి విగ్రహం ఆకట్టుకుంటుంది. మొదటి సారి భారతదేశంలో నిర్మింపబడ్డ టిబెటియన్ బౌద్ద మందిరం ఇది అని చెబుతుంటారు.

PC: Michael Scalet

ముస్సూరీ లో వాతావరణం అన్నికాలాలలోను ఆహ్లాదకరంగా ఉంటుంది

ముస్సూరీ లో వాతావరణం అన్నికాలాలలోను ఆహ్లాదకరంగా ఉంటుంది

ముస్సూరీ లో వాతావరణం అన్నికాలాలలోను ఆహ్లాదకరంగా వుంది ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అయితే, ముస్సోరీ సందర్శనకు వాతావరణం మార్చి నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ అనుకూలంగా ఉంటుంది.

PC: Paul Hamilton

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానంలో : డెహ్రాడూన్‌లో విమానాశ్రయం ఉంది. ఇక్కడికి ముస్సోరి 54 కి.మీ దూరం ఉంటుంది. క్యాబ్‌లో చేరుకోవచ్చు.

రైలులో : న్యూఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలు సర్వీసులున్నాయి. రైలులో ఇక్కడి వరకు చేరుకుంటే క్యాబ్‌లో ముస్సోరి చేరుకోవచ్చు.

బస్సులో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సర్వీసులతో పాటు ప్రైవేటు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

PC: Paul Hamilton

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more