Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో ధార్మికత వెళ్లివిరిసే ప్రాంతాలను సందర్శించారా?

హైదరాబాద్ లో ధార్మికత వెళ్లివిరిసే ప్రాంతాలను సందర్శించారా?

హైదరాబాద్ లో ప్రాచూర్యం చెందిన దేవాలయాలకు సంబంధించిన కథనం.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్న తక్షణం మనకు ఛార్మినార్, గోల్కొండ కోట తదితర పర్యాటక ప్రాంతాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే హైదరాబాద్ లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.

ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలుగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా కూడా ప్రాచూర్యం చెందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

జగన్నాథ దేవాలయం

జగన్నాథ దేవాలయం

P.C: You Tube

హైదరాబాద్ తో పాటు తెలంగాణలో నివసించే ఒరిస్సాకు చెందిన వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆధునిక వాస్తుశైలికి అద్దం పట్టే ఈ దేవాలయం ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలో అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయం. ప్రధాన దైవం జగన్నాథుడే అయినా ఇక్కడ బలరామ, సుభద్ర దేవిల విగ్రహాలను కూడా చూడవచ్చు. పూరిలోని జగన్నాథుడి దేవాలయ నిర్మాణాన్ని పోలిఉండే ఈ దేవాలయం హైదరాబద్ లోని బంజారా హిల్స్ లో ఉంది.

బిర్లా దేవాలయం

బిర్లా దేవాలయం

P.C: You Tube

నౌబాడ్ పహాడ్ పై 280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బిర్లా దేవాయం దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయాల్లో ఒకటి. తిరుమల లోని వేంకటేశ్వరుడి ప్రతి రూపాన్ని ఇక్కడి గర్భగుడిలో మనం చూడవచ్చు. మొత్తం బార్బల్ నిర్మితమైన ఈ దేవాలయం ఆధ్యాత్మికంగానే కాకుండా హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పేరు సంపాదించింది.

రత్నాలయం దేవాలయం

రత్నాలయం దేవాలయం

P.C: You Tube

విష్ణువు ప్రధాన దైవంగా ఉన్న రత్నాలయం హైదరాబద్ లోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ విష్ణువు ఆదిశేషుడి పై ఉంటారు. అమ్మవారిని ఆండాల్ పేరుతో కొలుస్తారు. ఇక్కడ ఉన్నటు వంటి ప్రధాన మంటపంలో నిత్యం విష్ణువు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెళ్లివిరుస్తూ ఉంటుంది.

శ్యామ్ దేవాలయం

శ్యామ్ దేవాలయం

P.C: You Tube

హైదరాబాద్ లోని శ్యామ్ బాబా దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ ఆ క`ష్ణభగవానుడిని శ్యామ్ బాబా పేరుతో కొలుస్తారు. దేవాలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. జన్మాష్టమి వంటి రోజుల్లో వేలసంఖ్యలో ఇక్కడ భక్తులు భగవంతుడిని సందర్శిస్తూ ఉంటారు.

వేంకటేశ్వరస్వామి దేవాలయం

వేంకటేశ్వరస్వామి దేవాలయం

P.C: You Tube

పాస్ పోర్ట్ బాలాజీ దేవాలయం పేరుతో చిలకూరి వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. ప్రతి వారం దాదాపు లక్షమంది భక్తులు ఈ దేవాలయన్ని సందర్శిస్తూ ఉంటారు. డబ్బు రూపంలో ఎటువంటి కానుకలు ఈ దేవాలయంలో స్వీకరించకపోవడం గమనార్హం. పాస్ పోర్ట్, విసా పొందడంలో ఏర్పడే చిక్కులన్నీ ఈ దేవాలయన్ని సందర్శించడం వల్ల సమిసిపోతాయని నమ్ముతారు.

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube

దాదాపు 800 ఏళ్లకు పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. జీవితంలో ఏర్పడే సమస్యలన్నింటిని ఈ కర్మాన్ ఘాట్ లోని హనుమంతుడు పరిష్కారం చూపిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడి హనుమంతుడిని సంఘట్ మోచన్ హనుమాన్ అని పిలుస్తారు. ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ వందల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు.

పెద్దమ్మ దేవాలయం

పెద్దమ్మ దేవాలయం

P.C: You Tube

హైదరాబాద్ లో ఉన్న దేవాలయాలన్నింటిలో పెద్దమ్మ దేవాలయం చాలా ప్రాచూర్యం చెందినది. ఆదిపరాశక్తి ఇక్కడ పెద్దమ్మ రూపంలో కొలువై ఉందని భక్తులు నమ్ముతారు. జూన్ జులై నెలల్లో బోనాల జాతర ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో ఈ దేవాలయాన్ని భక్తులు సందర్శిస్తూ ఉంటారు.

ఆదినాథ్ జైన్ దేవాలయం

ఆదినాథ్ జైన్ దేవాలయం

P.C: You Tube

హైదరాబాద్ శివారులో ఉన్న ఆదినాథ్ జైన్ దేవాలయం జైనల ముఖ్యంగా దిగంబర వర్గానికి అత్యంత పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రధాన దైవం పార్శనాథుడు. 11 అడుగుల విగ్రహాన్ని గ్రానైట్ తో మలిచారు. నిలబడిన స్థితిలో ఉన్న పార్శనాథుడి తల పై 7 పడగల ఆదిశేషుడు ఉండటం విశేషం. దేవాలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X