Search
  • Follow NativePlanet
Share
» »ఆమె కన్నీరు మీ పాపాలను తొలగించే పవిత్ర నదీజలాలు

ఆమె కన్నీరు మీ పాపాలను తొలగించే పవిత్ర నదీజలాలు

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యమునోత్రీకి సంబంధించిన కథనం

హిందూ పురాణాలను అనుసరించి భారత దేశంలోని హిమాలయాలు ముక్కటి దేవతలకు నిలయం. అందుకే ఆ పర్వత పంక్తుల్లో భాగమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి కిలోమీటరుకు ఒక పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చార్ దామ్ యాత్ర సందర్భంగా హిందూ మతానికి చెందిన భక్తులు ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ చుట్టు పక్కల ఉన్న అనేక దేవాలయాలను, తీర్థాలను దర్శించుకొని వెనుతిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ కు వెళ్లినవారు ఓ ఉష్ణకుండంలో స్నానం చేయకుండా వెనక్కురారు అంటే అతిశయోక్తి కాదు.

సూర్యభగవానుడి కుతురు కన్నీరు నుంచి ఆ కుండం ఏర్పడటమే కాకుండా అటు పై అతి పరమ పవిత్రమైన నదీగా మారిందని చెబుతారు. అందువల్లే హిందువులు ఆ ఉష్ణకుండంలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకొంటూ ఉంటారు. ఇక ఈ పుణ్యక్షేత్ర యాత్ర సముద్ర మట్టానికి దాదాపు 10,804 అడుగుల ఎత్తులో సాగుతుంది. అంత ఎత్తులో ప్రయాణం ప్రకృతితో మమేకం కావడమే. ఈ నేపథ్యంలో ఆ పుణ్యక్షేత్రం వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

సూర్యుడు, సంధ్యాదేవి కుమార్తే

సూర్యుడు, సంధ్యాదేవి కుమార్తే

P.C: You Tube

హిందూపురాణాల ప్రకారం సూర్యభగవానుడు, సంధ్యాదేవి భార్యాభర్తలు. వారికి శని, యముడు, యమున సంతానం. అయితే సంధ్యాదేవి సూర్యుడి వేడిని భరించలేక తన ఛాయ (నీడ) ను ఇంటిలో విడిచి ఆమె తపస్సు చేసుకోవడానికి వెలుతుంది.

సవతి తల్లి ప్రేమ

సవతి తల్లి ప్రేమ

P.C: You Tube

ఈ క్రమంలో సూర్యుడికి , ఛాయకు సంతానం కలుగుతుంది. ఛాయ, సంధ్య సంతానాన్ని కొన్ని రోజులు బాగానే చూసుకున్నా అటు పై వారి పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక రోజు ఛాయ తన బిడ్డలకు ఆహారాన్ని తినిపిస్తూ అక్కడే ఉన్న శని, యముడు, యమునలను ధూషిస్తూ ఉంటుంది.

అక్కడి నుంచి వెళ్లిపోతుంది

అక్కడి నుంచి వెళ్లిపోతుంది

P.C: You Tube

దీంతో కోపగించుకున్న శనిని ఛాయను కాలితో తన్నుతాడు. దీంతో ఛాయ శనిని కుంటివాడు కావాలని శాపం పెడుతుంది. విషయం తెలుసుకున్న సూర్యభగవానుడు మిక్కిలి బాధపడుతాడు. అంతేకాకుండా ఏ తల్లి కూడా పిల్లల అల్లరిని భరిస్తుంది కాని శాపం పెట్టదు కదా? అని ఛాయను కోపంతో ప్రశ్నిస్తాడు. దీంతో ఛాయ జరిగిన విషయం మొత్తం సూర్యభగవానుడికి చెప్పి తన సంతానాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

యమున కన్నీరు భూమిని తాకిన ప్రాంతమే

యమున కన్నీరు భూమిని తాకిన ప్రాంతమే

P.C: You Tube

ఇక శని, యముడు కూడా తల్లి లేని చోట తాము ఉండలేమని చెప్పి వారు కూడ చెరో దిక్కుకు వెళ్లిపోతారు. తన సోదరులు దూరం కావడాన్ని భరించలేని యమున కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ కన్నీరు నదిగా ప్రవహించిందని చెబుతారు.అలా యమునా నది పుట్టిన ప్రాంతమే యమునోత్రీ అని అంటారు. ఇక సూర్యభగవానుడు తన కూతురు కన్నీరు మొదట భూమిని తాకిన చోట పరమ పవిత్రంగా మారి కలియుగాంతం వరకూ ప్రజల పాపాలను హరించివేస్తుందని పేర్కొన్నాడు.

ఉష్ణకుండంలో స్నానం చేసి

ఉష్ణకుండంలో స్నానం చేసి

P.C: You Tube

అందువల్లే హిందువులు ఈ యమునోత్రీలో స్నానాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. యమునోత్రీ వద్ద ఉన్న ఉష్ణ కుండంలో స్నానం చేసి అక్కడే ఉన్న యమునా దేవి ఆలయ దర్శనంతో యమునోత్రీ యాత్ర ముుగుస్తుంది. కాగా యమునోత్రీ ఆలయాన్ని టెహ్రీ అర్వాల్ నిర్మించాడని చెబుతారు. అయితే పూర్తిగా శిథిలమైన ఆ ఆలయాన్ని 19వ శతాబ్దంలో జయ్ పూర్ మహారాణి గులారియా తిరిగి పున: నిర్మించారని చెబుతారు.

సముద్ర మట్టానికి 10,804 అడుగుల ఎత్తులో

సముద్ర మట్టానికి 10,804 అడుగుల ఎత్తులో

P.C: You Tube

యమునోత్రీ ఉత్తరఖండ్ లో ఉత్తరకాశీకి 30 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 10,804 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి వాహనాలు వెళ్లవు. అయితే యమునోత్రీకి దగ్గర్లోని జానకి చెట్టి వరకూ వాహనాలు వెలుతాయి. అక్కడి నుంచి కాలినడకనా లేదా, డోలీల్లో యమునోత్రీ వరకూ వెళ్లాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X