• Follow NativePlanet
Share
» »ఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు...సందర్శిస్తే చదువులో మీరే ముందు

ఇక్కడ పార్వతి దేవికి శివుడు భర్త కాదు...సందర్శిస్తే చదువులో మీరే ముందు

Written By: Kishore

హిందూ పురాణాల ప్రకారం పంచ భూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఈ భూ మండలం పై పరమశివుడు ఐదు చోట్ల వెలిశాడు. అందులో రెండో క్షేత్రమే జంబుకేశ్వర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచ్చికి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వరంలో ఉంది. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా అటు పై పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు ఈ ఆలయం విస్తరణకు సహకరించారని శాసనాలు తెలియజేస్తున్నాయి.ఈ క్షేత్రంలోనే పరమశివుడు పార్వతీ దేవికి జ్జానాన్ని ఉపదేశించడని స్థలపురాణం చెబుతుంది. అందువల్లే ఇక్కడ జంబుకేశ్వరస్వామి పశ్చిమాభిముఖంగా ఉండగా అఖిలాండేశ్వరి రూపంలో ఉన్న పార్వతీ దేవి ఆయనకు ఎదురుగా ఉంటుంది. స్వయంగా పరమశివుడే ఇక్కడ గురువు కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే చదువులో ముందుంటారని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో..

1. పంచభూత క్షేత్రలు

1. పంచభూత క్షేత్రలు

Image Source:

హిందూ పురాణాల ప్రకారం పంచ భూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఈ భూ మండలం పై పరమశివుడు ఐదు చోట్ల వెలిశాడు. ఈ ఐదు ప్రాంతాలు ఐదు పుణ్యక్షేత్రాలుగా భక్తుల నుంచి పూజలు అందుకొంటున్నాయి. ఈ ఐదింటిని కలిపి పంచభూత క్షేత్రాలు అంటారు.

2. ఆ ఐదు క్షేత్రాలు ఇవే

2. ఆ ఐదు క్షేత్రాలు ఇవే

Image Source:

అవి వరుసగా భూమికి ప్రతీక అయిన ఏకాంబరేశ్వరాలయం, నీటికి ప్రతీక అయిన జంబు లింగేశ్వరాలయం, వాయువు అంటే గాలికి ప్రతీక అయిన వాయులింగం, ఆకాశానికి ప్రతీక అయిన నటరాజ స్వామి దేవాలయం, అగ్నికి ప్రతీక అయిన అరుణాచలేశ్వర ఆలయం.

3. రెండోదే జంబుకేశ్వర క్షేత్రం

3. రెండోదే జంబుకేశ్వర క్షేత్రం

Image Source:

ఇందులో ఒక్క వాయు లింగం ఆంధ్రప్రదేశ్ లోని కాళహస్తిలో ఉండగా మిగిలిన నాలుగూ టెంపుల్ స్టేట్ గా పేరుగాంచిన తమిళనాడులో ఉంది. అందులో రెండో క్షేత్రమే జంబుకేశ్వర పుణ్యక్షేత్రం.

4. శంభుడు వల్లే

4. శంభుడు వల్లే

Image Source:

దీనికి పురాణ ప్రధాన్యత ఉంది. శివపురాణం ప్రకారం పూర్వం శంభుడు అనే రుషి ఇక్కడ నివశించేవాడు. అతడు శివుడికి పరమభక్తుడు. రోజూ శివ పూజ చేయనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేవాడు కాదు.

5. ఘెర తపస్సు చేస్తాడు

5. ఘెర తపస్సు చేస్తాడు

Image Source:

ఈ క్రమంలోనే అతనికి ఒక రోజు శివుడిని ప్రత్యక్షంగా చూడాలని నిత్యం అతని వద్దే ఉంటూ అర్చించాలని కోరిక కలిగింది. వెంటనే ఆ పరమశివుడి గురించి ఘోర తపస్సు చేశాడు.

6. పరమశివుడు ప్రత్యక్షమవుతాడు

6. పరమశివుడు ప్రత్యక్షమవుతాడు

Image Source:

ఈ తపస్సకు మెచ్చిన పరమశివుడు శంభుడి ఎదుట ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. దీంతో స్వామి నేను ఎప్పుడూ నిన్ను అర్చించేలా, నీ చెంతనే ఉండేలా వరం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు.

7. నేరేడు చెట్టు రూపంలో

7. నేరేడు చెట్టు రూపంలో

Image Source:

దీంతో భోళా శంకరుడైన ఆ పరమశివుడు వెంటనే భక్త నీ కోరికను మన్నిస్తున్నాను. నేను ఇక్కడే లింగం రూపంలో కొలువై ఉంటాను. నా పక్కనే నీవు జంబు వ`క్షం రూపంలో వెలుస్తావు. అని వరమిస్తాడు.

8. మనం ఇప్పటికీ

8. మనం ఇప్పటికీ

Image Source:

అన్నట్టుగానే ఈ పరమశివుడు లింగం రూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. ఇక శంభుడు జంబు వ`క్షంగా మారి ఆయన చెంత ఉన్నాడు. ఈ చెట్టును మనం ఇప్పటికీ ఆలయంలో చూడవచ్చు. జంబు వ`క్షమంటే నేరుడు పళ్లు.

9. తిమేవకాయ్ అని కూడా

9. తిమేవకాయ్ అని కూడా

Image Source:

కాగా, ఇక్కడ ఉన్న పరమశివుడిని తిమేవకాయ్, తిరువనైకావల్ అని కూడా పిలుస్తుంటారు. అంటే ఏనుగుల చేత పూజలు అందుకొన్నవాడని అర్థం. దీనికి సంబంధించి కూడా ఒక కథ వాడుకలో ఉంది.

10. సాలీడు, ఏనుగు

10. సాలీడు, ఏనుగు

Image Source:

దాని ప్రకారం ఇక్కడ వెలిసిన శివలింగాన్ని ఓ సాలేపురుగు, ఏనుగు పోటీ పడి పూజించేవి. లింగానికి చలి కాకుండా సాలీడు ఆ గూడు కట్టేది. దీనిని ఏనుగు సహించేది కాదు. తదుపరి రోజు తొండంతో నీటిని తెచ్చి ఆ లింగాన్ని శుభ్రం చేసేది.

11. తొండంలో దూరి

11. తొండంలో దూరి

Image Source:

దీనిని ఒక రోజు గమనించిన సాలేపురుగు ఆ ఏనుగు తొండంలో దూరి తనలోని విషాన్ని వెదజల్లుతుంది. ఇక ఏనుగు కూడా శివ లింగాన్ని అపరిశుభ్రం చేస్తున్నది ఈ సాలేపురుగు అని తెలుసుకొంటుంది.

12. రెండింటికీ మోక్షం

12. రెండింటికీ మోక్షం

Image Source:

దీంతో ఏనుగు తన తలను బండరాయికి వేసి కొట్టుకొని చనిపోతుంది. సాలేపురుగు కూడా తొండంలోనే ప్రాణాలు వదులుతుంది. తన పై భక్తితో ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఈ రెండు జీవులకు పరమశివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథనం శ్రీ కాళహస్తి కథనంతో పోలిక ఉన్నా ఇక్కడి వారు మాత్రం ఆ ఘటన జరిగింది జంబుకేశ్వరంలోనిదే అని చెబుతారు.

13. ఐదు ప్రాకారాలతో

13. ఐదు ప్రాకారాలతో

Image Source:

ఇక్కడ ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఐదు ప్రాకారాలతో నిర్మితమై ఉంటుంది. మెత్తం ఏడు గోపురాలతో ఈ ఆలయం చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. అంతే కాకుండా ఆలయానికి రెండు విశిష్టతలు ఉన్నాయి.

14. నిత్యం నీరు

14. నిత్యం నీరు

Image Source:

పంచభూతాల్లో ఒకటైన నీటికి ప్రతికగా ఇక్కడి లింగాన్ని పూజిస్తారు. అందువల్లే ఈ లింగం పానిపట్టం నుంచి నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులకు చూపించడానికి అక్కడి పూజారులు ఆ లింగం పానిపట్టు పై ఒక వస్త్రాన్ని కప్పుతారు.

15. ఎక్కడి నుంచి

15. ఎక్కడి నుంచి

Image Source:

కొంత సేపటికి ఆ వస్త్రాన్ని తీసివేసి పిండుతారు. ఆ వస్త్రం నుంచి నీరు వస్తుంది. అయితే ఆ పానిపట్టం పైకి నీరు ఎలా వచ్చి చేరుతోందన్న విషయం పై ఎన్నో ప్రయోగాలు జరిగినా ఫలితం మాత్రం తేలడం లేదు.

16. జ్జానాన్ని ఉపదేశించాడు

16. జ్జానాన్ని ఉపదేశించాడు

Image Source:

ఇక అదే విధంగా ఈ క్షేత్రంలోనే పరమశివుడు పార్వతీ దేవికి జ్జానాన్ని ఉపదేశించడని స్థలపురాణం చెబుతుంది. అందువల్లే ఇక్కడ జంబుకేశ్వరస్వామి పశ్చిమాభిముఖంగా ఉండగా అఖిలాండేశ్వరి రూపంలో ఉన్న పార్వతీ దేవి ఆయనకు ఎదురుగా ఉంటుంది.

17. గురుశిష్యులుగా

17. గురుశిష్యులుగా

Image Source:

అందువల్లే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను గురుశిష్యులుగా భావిస్తారు. దీంతో వీరిద్ధరికీ ఇక్కడ వివాహం జరిపించరు. ఇటువంటి క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే. స్వయంగా పరమశివుడే ఇక్కడ గురువు కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే చదువులో ముందుంటారని భక్తుల నమ్మకం.

18. ఉగ్ర రూపంలో

18. ఉగ్ర రూపంలో

Image Source:

అందువల్లే విద్యా ఏడాది మొదట్లో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. కాగా, అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రరూపంలో ఉండేవారని చెబుతారు.

19. కర్ణభూషణాలు

19. కర్ణభూషణాలు

Image Source:

అయితే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గంచడం కోసం తపస్సు చేశారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని కూడా ఆయనే ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలు శంకరాచార్యుల వారే సమర్పించారని స్థలపురాణం వివరిస్తుంది.

20. తిరుచ్చికి 11 కిలోమీటర్లు

20. తిరుచ్చికి 11 కిలోమీటర్లు

Image Source:

ఈ ఆలయం తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచ్చికి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వరంలో ఉంది. చారిత్రక ఆధారాలు, గుడిలో ఉన్న శాసనాలను అనుసరించి శ్రీరంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా ఈ దేవాలయం పురాతనమైనదని చెబుతారు.

21. చోళులు నిర్మించారు.

21. చోళులు నిర్మించారు.

Image Source:

ముఖ్యంగా క్రీస్తుశకం 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా అటు పై పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు ఈ ఆలయం విస్తరణకు సహకరించారని శాసనాలు తెలియజేస్తున్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి