» »అగుంబే - దక్షిణ చిరపుంజీ !!

అగుంబే - దక్షిణ చిరపుంజీ !!

Written By:

అగుంబే పశ్చిమ కనుమలలో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఒక పర్యాటక ప్రదేశం. దక్షిణ చిరపుంజీ గా ఖ్యాతికెక్కిన అగుంబే కర్ణాటకలోని మల్నాడు ప్రాంతం పరిధిలోకి వస్తుంది. అరేబియా సముద్రం ఇక్కడి నుండి 55 కిలోమీటర్ల దూరంలో కలదు. అద్భుత సూర్యోదయాలకు, సూర్యాస్తమయాలకు అగుంబే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : మహిమలు కల మూకాంబికా దేవి ఆలయం !!

అగుంబే లో జలపాతాలు, అటవీ భూభాగాలు ఎక్కువ. పాములు, ఇతర విష కీటకాలు ఇక్కడ సంచరిస్తుంటాయి. కనుక పర్యాటకులు అగుంబే అడవులలో సంచరిస్తే కాలికి బూట్లు ధరించడం శ్రేయస్కరం. ఎన్నో సహజ అందాలను అందించే ఈ ప్రదేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు ఈ ప్రాంత పరిసరాలలో కలియతిరుగుతూ విశ్రాంతిని పొందుతారు. ఆర్.కే. నారాయణ్ నవల మాల్గుడి కథలు షూటింగ్ ఇక్కడే తీసింది. సాహసికులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ సదుపాయం కలదు. ఇక్కడి అతి ప్రధానమైన ఆకర్షణలను పరిశీలిస్తే ... !!

 కింగ్‌ కోబ్రా

కింగ్‌ కోబ్రా

కింగ్‌ కోబ్రా పాము పుట్టింది ఇక్కడే! సుప్రసిద్ధ సర్ప (పాముల) పరిశోధకుడు రోములస్‌ విట్టేకర్‌.. 1970వ సంవత్సరంలో ఆగుంబె ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా రాజనాగాన్ని (కింగ్‌ కోబ్రా) కనుగొన్నారు. ఇందుకుగానూ ఆయన బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి విట్లీ అవార్డును కైవసం చేసుకున్నారు.

చిత్రకృప : Shashidhara halady

కుంచికాళ్‌ జలపాతం

కుంచికాళ్‌ జలపాతం

ఇక్కడి అందమైన జలపాతాలు పర్యాటకులకు మరో ఆకర్షణ. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుంచికాళ్‌ జలపాతం. ఇది భారతదేశంలో అత్యధిక ఎత్తు నుంచి పడుతున్న జలపాతాలలో ఒకటి. ఇది 1493 అడుగుల ఎత్తు నుంచి పడుతూ... వరాహి నదికి జన్మనిస్తున్నది.

చిత్రకృప : Saurabhsawantphoto

బర్కానా జలపాతం

బర్కానా జలపాతం

మరో జలపాతం బర్కానా. ఇది 850 అడుగుల ఎత్తు నుంచి పరవళ్ళెత్తూ ఉంటుంది. సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తూ బర్కానా జలపాతంగా మారే ఈ జలపాతానికి సీతా జలపాతం అనే మరో పేరు కూడా ఉంది. ఈ జలపాతాన్ని చేరాలంటే పర్యాటకులు పడమటి కనుమల నుండి గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా మోటర్ బైక్ మార్గంలో కూడా వెళ్ళవచ్చు.

చిత్రకృప : Arun ghanta

ఒనకి అబ్బే జలపాతం

ఒనకి అబ్బే జలపాతం

ఆగుంబెకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ఒనకి అబ్బే జలపాతం. కన్నడ భాషలో ఒనకి అంటే దంపుడు కర్ర (వడ్ల దంచేందుకు ఉపయోగించే కర్ర, లేదా రోకలి) అని అర్థం. ఈ జలపాతం పైకి అక్కడే నిర్మించిన మెట్ల ద్వారా చేరవచ్చు. పర్యాటకులు జలపాతాన్ని, ప్రవాహాన్ని చూసి ఆనందిస్తారు.

చిత్రకృప : Mylittlefinger

జోగి గుండి జలపాతాలు

జోగి గుండి జలపాతాలు

జోగి గుండి జలపాతాలు చాలా పురాతనమైనవి. సుమారు 829 అడుగుల ఎత్తునుండి పడతాయి. జోగిగుండి జలపాతాలు అగుంబేకు సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటాయి. సుమారు మూడు వంతుల దూరాన్ని వాహనంపై ప్రయాణించి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి. స్ధానికుల మేరకు జోగి అంటే రుషి గుహలను చూడవచ్చు.

చిత్రకృప : Subramanya C K

కూడ్లు తీర్ధ జలపాతాలు

కూడ్లు తీర్ధ జలపాతాలు

పడమటి కనుమలలోని జలపాతాలలో బహు సుందరమైన జలపాతాలు ఈ కూడ్లు తీర్ధ జలపాతాలు. అగుంబే వచ్చిన ప్రతి పర్యాటకుడూ వీటిని చూసి తీరవలసిందే. ఈ జలపాతం 126 అడుగుల ఎత్తునుండి ఒక సరస్సులోకి పడుతుంది. పర్యాటకులు జలపాతాన్ని 3 నుండి 4 కి.మీ.ల ట్రెక్కింగ్ తో చూడగలరు.

చిత్రకృప : Balajirakonda

మెక్కల సంరక్షణా స్థలం

మెక్కల సంరక్షణా స్థలం

అగుంబేలోనే 1999 సంవత్సరంలో ఔషధీ మెక్కల సంరక్షణా స్థలం స్థాపించబడింది. సముద్రమట్టానికి 600-700 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం వివిధ రకాల ఓషధ మొక్కలకు నిలయంగా మారింది. ఇది అగుంబేలో చూడవలసిన పర్యాటక ప్రదేశంగా అక్కడి స్థానికులు చెబుతుంటారు.

చిత్రకృప : Manjeshpv

అగుంబే ప్రత్యేక ఆకర్షణల విషయానికి వస్తే...

అగుంబే ప్రత్యేక ఆకర్షణల విషయానికి వస్తే...

పశ్చిమ కనుమలలో ఉన్న అగుంబేలో సూర్యాస్తమయం చూసేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. అరేబియా సముద్రం ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నప్పటికీ... ఆకాశం నిర్మలంగా ఉన్న రోజుల్లో, సూర్యాస్తమయం సమయాల్లో అరేబియా సముద్రంలోకి సూర్యుడు వెళ్లిపోతున్నాడా అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ వీక్షకులకు కట్టిపడేస్తుంది.

చిత్రకృప : ಪ್ರಶಾಂತ ಸೊರಟೂರ

మాల్గుడి డేస్

మాల్గుడి డేస్

సమయం వుంటే, సుమారు వంద సంవత్సరాలు పురాతన నివాసం అయిన కావేరి అక్క భవనం చూడండి. ఆర్ కే నారాయణ్ రచించిన , టి.వి. సీరియల్ అయిన మాల్గుడి డేస్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడే ఉన్న ఒక రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ చూడవచ్చు.

చిత్రకృప : Nireekshit

వసతి

వసతి

అగుంబే లో వసతి సౌకర్యాలు ఉన్నాయి. సాహసికులు, పర్యాటకులు హోటళ్ళను ముందుగానే రిజర్వ్ చేసుకోవటం ఉత్తమం లేకుంటే లాస్ట్ మినిట్ లో గదులు దొరకవు. కాటేజీలు, రిసార్టులలో పర్యాటకులు బస చేయవచ్చు.

చిత్రకృప : Jeff Peterson

స్థానిక వంటకాలు

స్థానిక వంటకాలు

అగుంబే సందర్శించే పర్యాటకులు ఇక్కడి స్థానిక వంటకాలను తప్పక రుచి చూడాలి. శాఖాహార మరియు మాంసాహార వంటలు తప్పక తినిచూడాలి. సాయంత్రం చిరుతిండ్లు కూడా లభిస్తాయి. వెన్నల ఫ్లేవర్ టీ రుచి తప్పక ఆస్వాదించండి.

చిత్రకృప : Harsha K R

అగుంబే ఎలా చేరుకోవాలి ??

అగుంబే ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

అగుంబే కు సమీప విమానాశ్రయం మంగుళూరు విమానాశ్రయం. ఇది 93 కి.మీ. దూరంలో ఉంది. క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి అగుంబే చేరుకోవచ్చు.

రైలు ప్రయాణం

అగుంబే కు సమీపాన ఉడుపి రైల్వే స్టేషన్ కలదు. ఇది 53 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఇక్కడినుండి పర్యాటకులు స్ధానిక బస్సులను లేదా క్యాబ్ లను తీసుకొని అగుంబే చేరవచ్చు.

బస్సు ప్రయాణం

బెంగుళూరు నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అనేక బస్సులను నడుపుతోంది. పర్యాటకులు షిమోగా, ఉడుపి, మంగుళూరు లనుండి కూడా బస్సులలో 40 నిమిషాల వ్యవధిలో చేరవచ్చు.

చిత్రకృప : Shyam siddarth

Please Wait while comments are loading...